తెలంగాణ ఉప ముఖ్యమంత్రుల జాబితా

తెలంగాణ ఉప ముఖ్యమంత్రుల జాబితా

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం అధిపతి తెలంగాణ ముఖ్యమంత్రికి డిప్యూటి ముఖ్యమంత్రి. తెలంగాణ మంత్రి మండలిలో ఉప ముఖ్యమంత్రి రెండో అత్యున్నత స్థాయి సభ్యుడిగా,[1] రాష్ట్ర మంత్రిత్వ శాఖలో క్యాబినెట్ పోర్ట్‌ఫోలియోను కూడా కలిగి ఉంటాడు. ఒకే పార్టీ సభ్యుని మద్దతుతో రాష్ట్రాన్ని పరిపాలించడానికి లేదా సంకీర్ణ ప్రభుత్వంలో రాజకీయ స్థిరత్వాన్ని, బలాన్ని తీసుకురావడానికి లేదా రాష్ట్ర అత్యవసర సమయాల్లో సరైన కమాండ్ అవసరమైనప్పుడు ఉపముఖ్యమంత్రి పదవి ఉపయోగించబడుతుంది.

తెలంగాణ ఉపముఖ్యమంత్రి
Incumbent
మల్లు భట్టివిక్రమార్క

since 7 డిసెంబరు 2023 (2023-12-07)
Nominatorముఖ్యమంత్రి
నియామకంగవర్నరు
ప్రారంభ హోల్డర్ఎం. మొహమూద్ అలీ
నిర్మాణం2 జూన్ 2014; 10 సంవత్సరాల క్రితం (2014-06-02)

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, జూన్ 2న ఎం. మొహమూద్ అలీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. 2014–2018 మధ్యకాలంలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ శాఖలకు కూడా మంత్రిగా ఉన్నాడు.[2] రెండవ ఉపముఖ్యమంత్రిగా టి. రాజయ్య[3] బాధ్యతలు చేపట్టి, ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశాడు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజయ్యను 2015, జనవరి 25న తొలగించగా, తరువాతి రాజయ్య స్థానంలో ఉపముఖ్యమంత్రిగా కడియం శ్రీహరి 2018 డిసెంబరు 12 వరకు మూడవ ఉప ముఖ్యమంత్రిగా పవిచేసాడు.[4] 2018, డిసెంబరు 13 నుండి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి 2023 డిసెంబరు 6 వరకు ఖాళీగా ఉంది.

2023లో తెలంగాణ శాససభకు జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరుపున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2023 డిసెంబరు 7న నియమితుడయ్యాడు.మధిర నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన మల్లు భట్టి విక్రమార్క డిసెంబరు 7న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా,  ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుచున్నాడు.[5]

జాబితా

మార్చు
సంఖ్య ఫోటో పేరు ఎన్నికైన నియోజకవర్గం రాజకీయ పార్టీ పదవీకాలం [6] ముఖ్యమంత్రి నియమించినవారు
1   ఎం. మొహమూద్ అలీ
(1952–)
రాష్ట్ర శాసన మండలి సభ్యుడు తెలంగాణ రాష్ట్ర సమితి 2014 జూన్ 2 2018 డిసెంబరు 12 4 years, 193 days కె. చంద్రశేఖర రావు ఈ.ఎస్.ఎల్.నరసింహన్
2   టి.రాజయ్య
(1965–)
ఘన్‌పూర్ (స్టేషన్) తెలంగాణ రాష్ట్ర సమితి 2014 జూన్ 2 2015 జనవరి 25 237 days
3   కడియం శ్రీహరి
(1952–)
రాష్ట్ర శాసన మండలి సభ్యుడు తెలంగాణ రాష్ట్ర సమితి 2015 జనవరి 25 2018 డిసెంబరు 12 3 years, 321 days
2018 డిసెంబరు 13 నుండి 2023 డిసెంబరు 6 వరకు ఖాళీ
4   మల్లు భట్టి విక్రమార్క మధిర

శాసనసభ్యుడు

భారత జాతీయ కాంగ్రెస్ 2023 డిసెంబరు 7 పదవిలో ఉన్న వ్యక్తి 1 year, 60 days ఎనుమల రేవంత్ రెడ్డి

గణాంకాలు

మార్చు

పదవీకాలం వారీగా ఉప ముఖ్యమంత్రుల జాబితా

  పేరు పార్టీ పదవీకాలం
పదవీకాలం పదవీకాల మొత్తం సంవత్సరాలు
1 ఎం. మొహమూద్ అలీ టీఆర్ఎస్ 4 years, 193 days 4 years, 193 days
2 టి. రాజయ్య టీఆర్ఎస్ 237 days 237 days
3 కడియం శ్రీహరి టీఆర్ఎస్ 3 years, 321 days 3 years, 321 days

పార్టీల వారీగా జాబితా

మార్చు
డిప్యూటీ సిఎంఓని కలిగి ఉన్న వారి సభ్యుల మొత్తం కాల వ్యవధి ప్రకారం రాజకీయ పార్టీలు ( 2022 జనవరి 20 )
  రాజకీయ పార్టీ ఉప ముఖ్యమంత్రుల సంఖ్య డిప్యూటీ సీఎంఓని కలిగి ఉన్న మొత్తం రోజులు
1 తెలంగాణ రాష్ట్ర సమితి 3 1654 రోజులు
500
1,000
1,500
2,000
TRS

ఇవికూడ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Rajendran, S. (2012-07-13). "Of Deputy Chief Ministers and the Constitution". The Hindu. Retrieved 21 January 2022.
  2. "KCR keeps his promise; Mehmood Ali becomes first Deputy CM of Telangana". Two Circles. Retrieved 21 January 2022.
  3. "Telangana Deputy Chief Minister Rajaiah sacked". TheHindu. 2015-01-25. Retrieved 21 January 2022.
  4. Kodiyam Srikari: As EDUCATION MINISTER & DEPUTY CM
  5. Namaste Telangana (8 December 2023). "12 మందితో కాంగ్రెస్‌ క్యాబినెట్‌". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  6. The ordinal number of the term being served by the person specified in the row in the corresponding period