తేజస్వి యాదవ్
తేజస్వి యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు. అతను వరకు 2015 నుండి వరకు 2017 వరకు బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పని చేశాడు.
తేజస్వి యాదవ్ | |||
![]()
| |||
బీహార్ 6వ ఉప ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 2022 ఆగస్టు 10 – 2024 జనవరి 28 | |||
గవర్నరు | ఫగు చౌహాన్ | ||
---|---|---|---|
ముందు | రేణు దేవి తార్ కిషోర్ ప్రసాద్ | ||
పదవీ కాలం 2015 నవంబరు 20 – 2017 జులై 26 | |||
గవర్నరు | రామ్‌నాథ్ కోవింద్ కేశరి నాథ్ త్రిపాఠి | ||
ముందు | సుశీల్ కుమార్ మోదీ | ||
తరువాత | సుశీల్ కుమార్ మోదీ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2015 డిసెంబరు 1 | |||
ముందు | సతీష్ కుమార్ | ||
నియోజకవర్గం | రఘోపూర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గోపాల్‌గంజ్, బీహార్, భారతదేశం | 9 నవంబరు 1989||
రాజకీయ పార్టీ | రాష్ట్రీయ జనతాదళ్ | ||
తల్లిదండ్రులు | |||
జీవిత భాగస్వామి | రాజశ్రీ యాదవ్ (వివాహం. 2021)[1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుతేజస్వి యాదవ్ తన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ అడుగుజాడల్లో రాజకీయ ప్రవేశం చేశాడు. అతను 2015లో బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ పై 22,733 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై నీతీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పని చేశాడు.
తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ‘మహాఘట్ బంధన్’ 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రీయ జనతా దళ్ కూటమి, ప్రభుత్వంలో ఉన్న నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) కూటమికి గట్టి పోటీ ఇచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహా ఘట్‌బంధన్‌కు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. జేడీయు 115 స్థానాలు, బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేశాయి. మహా కూటమిలో ఆర్జేడీ 144 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేశాయి. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాల్లో సాధారణ మెజార్టీ 122 కాగా, 125 స్థానాలతో ఎన్‌డీఏ కూటమి గట్టెకింది.[2][3]
అతను 10 ఆగష్టు 2022న నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భాద్యతలు చేపట్టి, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ, రోడ్డు నిర్మాణాలు, గృహ నిర్మాణ & పట్టణాభివృద్ధి & గ్రామీణ పనులు శాఖ పని చేస్తున్నాడు.[4][5]
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (9 December 2021). "ఓ ఇంటి వాడైన బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్.. సాదాసీదాగా వివాహ వేడుక". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ BBC News తెలుగు (11 November 2020). "ఐపీఎల్‌లో విఫలమైన క్రికెటర్ రాజకీయాల్లో ఎలా రాటుదేలారు". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ Sakshi (12 November 2020). "తేజస్వి వైఫల్యానికి ఐదు కారణాలు". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ Andhra Jyothy (11 August 2022). "సీఎంగా నితీశ్.. డిప్యూటీగా తేజస్వి" (in ఇంగ్లీష్). Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
- ↑ 10TV Telugu (16 August 2022). "బీహార్‌లో కొలువుదీరిన కొత్త మంత్రి వర్గం.. ఎక్కువ మంది తేజస్వి యాదవ్ పార్టీ నుంచే." Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)