దండు నారాయణరాజు
దండు నారాయణరాజు (ఆగష్టు 15, 1889 - జనవరి 30, 1944) ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు.
దండు నారాయణరాజు | |
---|---|
జననం | దండు నారాయణరాజు ఆగష్టు 15, 1889 భీమవరం తాలూకా నేలపోగుల |
మరణం | జనవరి 30, 1944 |
మరణ కారణం | గుండె జబ్బు |
తండ్రి | భగవాన్ రాజు |
బాల్యము, విద్య
మార్చువీరు భీమవరం తాలూకా నేలపోగుల గ్రామంలో భగవాన్ రాజు దంపతులకు 1889, 15 ఆగష్టు తేదీన జన్మించారు. వీరు బి.ఎ., బి.ఎల్. చదివారు.
స్వాతంత్ర్య సాధన లో
మార్చురాజకీయ జీవితం
మార్చువీరు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ నేతలలో ముఖ్యులు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా ఉన్నతమైన సేవ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా 4 సంవత్సరాలు పనిచేశారు. 1937 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.
మరణం
మార్చుక్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 1942 లో తంజావూరు జైల్లో ఉంటూ 1944, జనవరి 30 న అక్కడే గుండె జబ్బుతో మరణించారు.