దండు విశ్వేశ్వరరాజు
దండు విశ్వేశ్వరరాజు అంతరిక్ష శాస్త్రవేత్త.ఉపగ్రహ పరిశోధకుడు.
దండు విశ్వేశ్వరరాజు | |
---|---|
జననం | నవంబరు 22 1943 విశాఖపట్టణం జిల్లాలోని లింగరాజు పాలెం |
జాతీయత | భారతీయుడు |
ముఖ్యమైన పురస్కారాలు | హింద్ గౌరవ్ అవార్డు |
జీవిత విశేషాలు
మార్చుదండు విశ్వేశ్వరరాజు విశాఖపట్టణం జిల్లా, ఎస్.రాయవరం తాలూకా లింగరాజు పాలెంలో 1943 నవంబరు 22 న జగ్గరాజు, సత్యవతిదేవి దంపతులకు రెందవ సంతానంగా, మొదటి పుత్రునిగా జన్మించారు.[1] వారి పూర్వీకులు తూర్పుగోదావరి జిల్లా మల్లెపూడి గ్రామానికి చెందినవారు. 1940లో వాళ్ళ కుటుంబం పిల్లలకు మంచి విద్యనందుంచుటకు విశాఖపట్టణం వచ్చారు. ఆయన ప్రారంభ విధయను కాథలిక్ మిషనరీ పాఠశాల, విశాఖపట్టణంలో పూర్తిచేసారు. తరువాత విశ్వేశ్వరరాజు కుటుంబం మరల వారి స్వగ్రామానికి వెళ్ళింది. ఆయన భీమవరంలోని డబ్ల్యూ.జి.బి (ప్రస్తుతం డి.ఎన్.ఆర్) కళాశాలలో పి.యు.సి చదివారు. 1961 లో పి.యు.సి పూర్తిచేసిన తదుపరి తన 17వ యేట సీతాదేవిని వివాహం చేసుకున్నారు. 1966లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, కాకినాడలో బి.ఇ చేసారు. 1966 లో వరంగల్ లోని ఎం.టెక్ పూర్తిచేసారు.[1]
ఉద్యోగ జీవితం
మార్చు1968 నవంబరులో ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్), తిరువనంతపురం (కేరళ) లో ప్రవేశించి, స్పేస్ క్రాఫ్ట్ టెలిమెట్రీ సిస్టమ్స్ అధిపతిగా చేరారు. 1972 నాటి వరకు వివిధ హోదాలలో స్పేస్ క్రాప్ట్ ఎలక్ట్రానిక్ డివిజన్ లో పనిచేసారు. రష్యా నుండి 1975, ఏప్రిల్ లో తొలి భారతీయ ఉపగ్రహం "ఆర్యభట్ట" ప్రయోగ సమయంలో పాల్గొన్న పిన్న వయసు శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. ఆ తరువాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (హైదరాబాదు) లో నెట్ లైట్ ఎర్త్ స్టేషన్స్ డివిజన్ కు అధిపతిగా పనిచేసారు.[2] ఈయన డిసెంబరు 31 1992 న పదవీవిరమణ చేసి సుసీ స్పేస్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు. దిగుమతి చేసుకోనవసరం లేకుండా హై టెక్నాలజీ ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. 1996-97 లో ప్రత్యేక ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసారు.
పరిశోధనలు
మార్చుమనదేశంలో తొలిసారిగా హైదరాబాద్ సమీప షాద్ నగర్ లో రిమోట్ సెన్సింగ్ ఎత్ స్టేషన్ ను నెలకొల్పడంతో (1979) విశేష కృషిచేసారు. వివిధ రంగాల మీద ఎర్త్ రిసోర్సెస్ డేటాను సేకరించడంలో మన దేశం ప్రపంచంలో ఐదవ దేశంగా రూపొందింది. 1982 లో డిప్యూటీ డైరక్టరుగా నియమితులై తొలి భారతీయ రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ మొదలగు ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్వహణకు దోహదపడ్డారు. యూరోపియన్ రిమోట్ సెన్సింగ్ సెటిలైట్ (షార్, శ్రీహరికోట ఉపగ్రహ కేంద్రం) లో రోహిణి స్వదేశీ రాకెత్ లాంచింగ్ కు ప్రాజెక్టు ఇంజనీరుగా ఉన్నారు. ఏరియల్ పాసింజ్ పే లోడ్ ఎక్స్‌పెరిమెంటు (ఆపిల్) ద్వారా మన దేశంలో తొలి ప్రయోగాత్మక ఉపగ్రహం యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటారు. షాద్ నగర్ ఎర్త్ స్టేషన్ ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రెందవ ఎర్త్ స్టేషను రూపకల్పన చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. 1986 లో నేషలన్ ఓషనిక్ ఎట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ను, వాతావరణ పరిసోధనా కేంద్రాన్ని నెలకొల్పడంలో సహకరించారు[2].
1980లో సాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్.ఎల్.ఎ 3) 1988 లో పూర్తి స్వదేశీ ఉపగ్రహం (ఐ.ఆర్.ఎస్.1ఎ) ప్రయోగాలు జరిగినప్పుడు ఈయన గ్రౌండ్ సిగ్నల్ కో ఆర్డినేటరుగా ఉండి బాధ్యతలు నిర్వర్తించారు. ఆకాశంలో మేఘాలు దట్టంగా ఉన్నా, వర్షం వచ్చినా, వాతావరణాన్ని అధ్యయనం చేయుటకు ఉపయోగపడు "మైక్రోవ్ శాటిలైట్ యూరోపియన్ స్పేస్ ఏజన్సీ"కి కూడా ఈయన కో ఆర్డినేటరుగా ఉండగా రూపకల్పన జరిగింది.
విదేశీ పర్యటనలు
మార్చుఈయన పదవీ బాధ్యతలో ఉండగా బ్రిటన్ (1972-79), అమెరికా, జపాన్, కెనడా, నెదర్లాండ్స్, రష్యా, జర్మనీ, ఆస్ట్రేలియా, కొరియా మొదలగు దేశాలలో "ఇండియన్ స్పేస్ ప్రోగ్రాముల విషయమై పర్యటించారు.
అవార్డులు
మార్చు- 1976 : ఇస్రో వారి "డిస్టింగిష్డ్ అఛీవ్ మెంటు అవార్డు"
- 1995 : హింద్ గౌరవ్ అవార్డు.
- 1995 : నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్స్‌లెన్స్ ఆవార్డు.
- 1996-97 : బెస్ట్ ఎక్స్‌పోర్టర్ అవార్డు.
- 1997 : బెస్ట్ ఎక్స్‌పోర్ట్ ఎఫర్ట్ అవార్డు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "D.visweswara rao" (PDF).[permanent dead link]
- ↑ 2.0 2.1 ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణ వేణి పబ్లిషర్స్, విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011. p. 80.
ఇతర లింకులు
మార్చు- http://www.kshatriyasevasamithiap.in/admin/APHAdmin/pdfs/dandu%20visweswara%20raju(9).pdf[permanent dead link]
- http://www.zoominfo.com/p/D.-Raju/71802389
- https://web.archive.org/web/20160305002250/http://www.ecosak-hyd.org/htmls/association-member-profile-pm-0059.html
- https://web.archive.org/web/20160305072337/http://www.inrimt.com/Thankover.htm