దగ్గరగా దూరంగా
దగ్గరగా దూరంగా 2011 లో విడుదలైన శృంగార థ్రిల్లర్ సినిమా. సుమంత్, వేదిక [1], సింధు తొలానీ నటించారు. ఇది 2011ఆగస్టు 26 న విడుదలై బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీనిని మలయాళంలో పూవితాల్ అజాకు (పచ్చదనం), తమిళంలో పూవూడం పుయలోడం, హిందీలో ఆతంక్ కి జంగ్ అనే పేర్లతో అనువదించారు.
దగ్గరగా దూరంగా (2011 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | రవి సి. కుమార్ |
కథ | రవి సి. కుమార్ |
తారాగణం | సుమంత్, వేదిక, సిందూ తొలాని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కొండవలస లక్ష్మణరావు, ఆలీ, రంగనాథ్ |
నిర్మాణ సంస్థ | సుధా సినిమా |
విడుదల తేదీ | 26 ఆగష్టు 2011 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చుగౌతమ్ ( సుమంత్ ) ప్రకటన చిత్రాల నిర్మాత. అతను తన ప్రాజెక్టులలో ఒకదాని కోసం ఊహాత్మక డిజిటల్ నమూనాను సృష్టిస్తాడు. ఆ మోడల్ అనుకోకుండా నిజ జీవిత మహిళ మీనాక్షి ( వేధిక ) ని పోలి ఉంటుంది, గౌతమ్ యొక్క రెచ్చగొట్టే ప్రకటన కారణంగా ఆమె పెళ్ళి నిశ్చితార్థం రద్దవుతుంది. కోపంతో మీనాక్షి, గౌతమ్ పైన, అతని ప్రకటన ఏజెన్సీపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది.
గౌతమ్‌పై చర్యలు తీసుకోవడానికి ఆమె తన స్నేహితురాలు జహ్రీన్ ( సింధు తోలాని) అనే పరిశోధనాత్మక జర్నలిస్టును సంప్రదిస్తుంది. జహ్రీన్ ఓ ప్రమాదకరమైన మిషన్‌లో పనిచేస్తూ ఉంటుంది. రాబోయే ఉగ్రవాద దాడిని బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తూంటుంది. జహ్రీన్ మీనాక్షికి ఉగ్రవాదుల వివరాలతో కూడిన ఓ డివిడిని అందజేసి చనిపోతుంది.
ఆ డివిడి కోసం ఉగ్రవాదులు ఇప్పుడు మీనాక్షి వెంటపడతారు. అనుకోకుండా ఆమె చిక్కుకున్న ఈ దుస్థితి నుండి ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఉగ్రవాద చర్యను నిరోధించగలిగేది ఇప్పుడు పరారీలో ఉన్న మీనాక్షి, గౌతమ్ లు మాత్రమే.
తారాగణం
మార్చు- గౌతంగా సుమంత్
- మీనాక్షిగా వేదిక
- రంగనాథ్
- బ్రహ్మానందం
- సింధు తొలానీ
- ప్రగతి
- ఆహుతి ప్రసాద్
- అజయ్
- రవి ప్రకాష్
- కృష్ణ భగవాన్
- రఘుబాబు
- సత్యం రాజేష్
- కొండవలస లక్ష్మణరావు
- దువ్వాసి మోహన్
సమీక్షలు
మార్చుRediff.com యొక్క సమీక్ష ప్రకారం మొత్తమ్మీద దగ్గరగా దూరంగా చూడదగిన సినిమాయే. సుమంత్, వేదిక ఈ చిత్రాన్ని వారి భుజాలపై వేసుకున్నారు.. సుమంత్ చక్కటి నటనను ప్రదర్శించాడు. వేధికకు చాలా గణనీయమైన పాత్ర ఉంది, దానికి అనుగుణంగా జీవించింది.[2]
మూలాలు
మార్చు- ↑ I have an important role in Daggaraga Dooranga
- ↑ "Review: Daggaraga Dooranga is worth a watch". rediff. 26 August 2011. Retrieved 3 March 2014.