దూర్జయులు వీరు కాకతీయుల పాలనలో వెలుగులోకి వచ్చారు. వెలనాటి చోడులు గణపతిదేవుడి చేతిలో ఓడిపోవడంతో వారి వద్ద సైన్యాధిపతులుగా పనిచేసిన నాయక కులాలవారు కాకతీయ సైన్యంలో చేరిపోయారు. ఆ క్రమంలో గణపతిదేవుడు కమ్మనాడు కు చెందిన జయపసేనాని ని సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నాడు. జయపసేనాని కృష్ణానదీ తీరంలో మంత్రిగా చేసిన పిన్నచోడ నాయకుని కుమారుడు.

సూర్యవంశ క్షత్రియుడైన గణపతిదేవుడు దూర్జయ తెగ కన్యను వివాహమాడాడు

జయపసేనాని కాకతీయ సామ్రాజ్యానికి తన విశిష్ట సేవలు అందించాడు. ఫలితంగా గణపతిదేవుడు జయపసేనాని చెళ్ళెళ్ళు అయిన నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు.

సూర్యవంశ క్షత్రియుడైన గణపతిదేవుడు దూర్జయ తెగ కన్యను వివాహమాడుట వలన రాణీ రుద్రమదేవి పుట్టియుండవచ్చును. అందువల్ల దూర్జయ తెగకు చెందిన కమ్మ వారు రుద్రమదేవిని తమ ఆడపడుచుగా భావించడమే కాకుండా తాము కాకతీయుల వంశస్తులమని చెప్పుకుంటారు.

ఇంకా చదవండి

మార్చు
"https://te.wiki.x.io/w/index.php?title=దూర్జయులు&oldid=4191825" నుండి వెలికితీశారు