ధర్మరాజు తిరునాళ్ళు
ధర్మరాజు తిరునాళ్ళు చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో పాండవులలో మొదటి వాడైన ధర్మరాజు పేరుతో ఉన్న ఆలయాల్లో ప్రతి సంవత్సరం జరిపే ఉత్సవాలు. ఈ ఉత్సవాలు వారం నుంచి 18 రోజుల దాకా జరుగుతాయి. ధ్వజారోహణం, మహాభారత పురాణ శ్రవణం, తపస్సుమాను, అగ్నిగుండ ప్రవేశం (నిప్పుల మీద నడక) లాంటివి ఇందులో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు.
ముఖ్యమైన ఆలయాలు
మార్చుయామిగాని పల్లె
మార్చుకుప్పం తాలూకా యామిగాని పల్లెలో ధర్మరాజు దేవాలయం పురాతన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం ధర్మరాజుల తిరునాళ్ళు జరుగుతాయి.[1]
శ్రీకాళహస్తి ధర్మరాజుల గుడి
మార్చుపంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో ద్రౌపదీ సమేత ధర్మరాజుల దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉంది.[2]
మూలాలు
మార్చు- ↑ "ద్రౌపది ఆలయం – యామిగాని పల్లె (Draupadi Devalayam – Yamiganipalle)". TeluguOne Devotional. Retrieved 2025-01-27.
- ↑ Rangarajan, A. D. (2022-07-03). "Andhra Pradesh: Taking the Mahabharata to the unlettered". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2025-01-27.