నందికొట్కూరు పురపాలక సంఘం
నందికొట్కూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం లోని, నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
నందికొట్కూరు | |
స్థాపన | 2012 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చునందికొట్కూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఇది 2012 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.పురపాలక సంఘం పరిధి 23 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]
జనాభా గణాంకాలు
మార్చు2001 లో 40210 గా ఉన్న పట్టణ జనాభా 2011 లో 46953 కు పెరిగింది. దశాబ్దంలో 16.77% పెరిగింది.
ప్రస్తుత చైర్పర్సన్, వైస్ చైర్మన్
మార్చుప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా సుబ్బమ్మ, [2] వైస్ చైర్మన్‌గా షేక్ అబ్దుల్ మునాఫ్ పనిచేస్తున్నారు.[2]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము:- నందికొట్కూరు పట్టణం నుంచి కొణిదేల గ్రామంనకు వెళ్ళే దారిలో అతి సుందరమైన, ప్రాచీనమైన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము ఉంది.
- శ్రీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం.
ఇతర వివరాలు
మార్చుఈ పురపాలక సంఘం 23.85.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.16 రెవెన్యూ వార్డులు,23 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 25 మురికివాడలు ఉండగా అందులో జనాభా 17200 ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.