నాగదంతి యొక్క వృక్ష శాస్త్రీయ నామం Heliotropium indicum. దీనికి తెలుగులో గల ఇతర పేర్లు : కొడిక్కి, భూచంపకము, కొండకలువ, కుంజర, నాగస్ఫోటము, నాగపడిగలు.

నాగదంతి
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
(unplaced)
Family:
Genus:
Species:
H. indicum
Binomial name
Heliotropium indicum
Synonyms

Heliophytum indicum
Heliotropium parviflorum
Tiaridium indicum

ఇతర భాషలలో పేర్లు

మార్చు
 
నాగదంతి

సంస్కృతం : భూమి కంపాక, భూచంపక, హల్లాకః, హిందీ : భూయిచంపా, కన్నడ : నెలసంపింగె, మలయాళం : సెన్నల విర్కిలన్ను, తమిళం : నెర్పిసిన్

వ్యాప్తి

మార్చు

భారతదేశమంతటా చిత్తడి నేలల్లో పెరుగుతుంది, పెంచబడుతుంది.

మొక్క వర్ణన

మార్చు
 

అందంగా ఉండే ఈ సుగంధ ఔషధ మొక్కకు దుంపలు ఉంటాయి. మొక్క చిన్నదిగానే ఉంటుంది. ఆకులు కోలగా పొడుగ్గా ఉంటాయి. ఆకులు కొద్దిగానే ఉంటాయి. దాదాపు 30 సెం.మీ. పొడవు 10 సెం.మీ. వెడల్పు ఉంటాయి. ఆకులు పై కొస ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పువ్వులు సువాసన కలిగి తెలుపు రంగులో ఎరుపు రంగుని కూడి ఉంటాయి. గుత్తులుగా పూస్తాయి. పూవులు ఒక్కసారిగాక క్రమంగా ఒకదాని తర్వాత, మరొకటి విచ్చుకుంటాయి. మొక్క క్రింది భాగం అర్ధగోళాకారంగా ఉండే దుంపకు చుట్టు కొలగా పొడుగ్గా ఉండే దుంపలు ఉంటాయి.

ఔషధి ఉపయోగాలు

మార్చు

దుంపలు వగరుగా ఉంటాయి. చలవచేస్తాయి. సువాసన కలిగి ఉంటుంది. శరీర మంటలను తగ్గిస్తుంది. లాలాజలాన్ని వృద్ధి చేస్తుంది. వాంతులు కలిగిస్తుంది. గాయాలను మాన్పుతుంది. వాత, కఫ ప్రకోపం వల్ల వచ్చు వ్యాధులకు మంచి మందు. గృహిణి, అతిసారము, శరీరంలో నీరు పట్టుట, వ్రణములు, రక్తం గడ్డకట్టుట, కణుతులు, పుట్టకురుపు వాపుల పైన పనిచేస్తుంది.

ఉపయోగపడు భాగాలు

మార్చు

దుంపలు

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wiki.x.io/w/index.php?title=నాగదంతి&oldid=4025056" నుండి వెలికితీశారు