నాగపూర్-సికందరాబాద్ రైలు మార్గం

 

నాగపూర్-సికిందరాబాద్ రైలు మార్గం
అవలోకనం
స్థితిపనిచేస్తోంది
చివరిస్థానంనాగపూర్
సికిందరాబాద్
ఆపరేషన్
ప్రారంభోత్సవం1929
యజమానిIndian Railways
నిర్వాహకులుమధ్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వే
డిపో (లు)అజ్ని, కాజీపేట, మౌలాలీ, హైదరాబాదు
రోలింగ్ స్టాక్WAP-7, WAG-7 లోకోలు, WAG-9, WAG-9I
WDG-4, WDM-3A, WDG-3A, WDM-2.
సాంకేతికం
ట్రాక్ పొడవుప్రధాన మార్గం: 581 కి.మీ. (361 మై.)
శాఖ మార్గం:
మజ్రి-ముద్‌ఖేడ్266 కి.మీ. (165 మై.)
నిజామాబాద్-పెద్దపల్లి శాఖా మార్గం
ట్రాక్ గేజ్5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజి
ఆపరేటింగ్ వేగంup to 130 km/h
మార్గ పటం
మూస:Nagpur–Hyderabad line

నాగ్‌పూర్-సికింద్రాబాద్ లైన్ నాగపూరు, సికింద్రాబాద్‌లను కలిపే రైలు మార్గం. [1] 581 కి.మీ. ల ఈ మార్గంలో నాగ్‌పూర్ నుండి కాజీపేట వరకు ఢిల్లీ-చెన్నై లైన్‌లో భాగం. ఇది ఢిల్లీ-హైదరాబాద్ లైన్‌లో కూడా భాగమే. ఈ లైన్ సెంట్రల్ రైల్వే, దక్షిణ-మధ్య రైల్వే పరిధిలో ఉంది.

చరిత్ర

మార్చు

1929లో కాజీపేట్-బల్లార్షా లింక్ పూర్తవడంతో, చెన్నై నుండి నేరుగా ఢిల్లీకి అనుసంధానం ఏర్పడింది. [2]

వాడి-సికింద్రాబాద్ లైన్ 1874లో హైదరాబాద్ నిజాం ఆర్థిక సహాయంతో నిర్మించబడింది. ఇది తరువాత నిజాం యొక్క గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేలో భాగమైంది. 1889లో నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే ప్రధాన మార్గాన్ని విజయవాడ వరకు పొడిగించారు. [3]

1909 నాటికి, నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే "గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేకు చెందిన వాడి నుండి తూర్పుగా వరంగల్‌కు ఆపై ఆగ్నేయంగా మద్రాసు రైల్వే లోని ఈస్ట్ కోస్ట్ సెక్షన్‌లో బెజవాడ వైపు వెళుతుంది." [4]


విద్యుద్దీకరణ

మార్చు

1987-88లో కాజీపేట-రామగుండం సెక్టార్, 1988-89లో రామగుండం-బల్హర్షా-నాగ్‌పూర్ సెక్టార్లను, 1991-93 లో కాజీపేట-సికింద్రాబాద్ సెక్టారును, 1994-95లో మజ్రీ-రాజ్‌పూర్ సెక్టారునూ విద్యుద్దీకరించారు. [5]

ప్రయాణీకుల కదలిక

మార్చు

ఈ లైన్‌లోని నాగపూర్మ, సికిందరాబాదు స్టేషన్లు భారతీయ రైల్వేలోని అగ్ర వంద బుకింగ్ స్టేషన్‌లలో ఉన్నాయి. [6]

షెడ్లు, వర్క్‌షాప్‌లు

మార్చు

అజ్నీలో ఎలక్ట్రిక్ లోకో షెడ్, డీజిల్ ట్రిప్ షెడ్ ఉన్నాయి. ఇది ప్రధానంగా 190 లోకోలతో కూడిన సరుకు రవాణా షెడ్డు. ఇది WAG-7, WAG-9, WAG-9I, WAP-7 లోకోలను కలిగి ఉంది. కాజీపేట డీజిల్ లోకో షెడ్‌లో WDM-2, WDM-3A, WDG-3A, WDG-4 లోకోలు ఉన్నాయి. 2006లో ప్రారంభించబడిన కాజీపేట ఎలక్ట్రిక్ లోకో షెడ్‌లో 150+ WAG-7 లోకోలు ఉన్నాయి. మౌలా అలీలో డీజిల్ లోకోమోటివ్‌లు, EMUల కోసం ఒక షెడ్ ఉంది. ఇక్కడ WDM-2, WDM-3A, WDG-3A, DHMUలు (3-కార్, 6-కార్లు కలిగినచవి), EMUలు ఉన్నాయి. హైదరాబాద్‌లో విద్యుత్ ట్రిప్ షెడ్ ఉంది. [7]

నాగ్‌పూర్‌లో కోచ్ నిర్వహణ వర్క్‌షాప్ ఉంది. అజ్నిలో గూడ్స్ వ్యాగన్ రిపేర్ సౌకర్యం ఉంది. రామగుండంలో వ్యాగన్ నిర్వహణ కోసం సాధారణ ఓవర్‌హాల్ డిపో, సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేటలో కోచింగ్ మెయింటెనెన్స్ డిపోలు ఉన్నాయి. [7]

మూలాలు

మార్చు
  1. Chakraborty, Aniket (2017-04-03). "Russian Railways to sign Nagpur–Secunderabad line modernisation contract". www.rbth.com. Retrieved 2020-07-06.
  2. "IR History: Early Days – III". Chronology of railways in India, Part 3 (1900–1947). Retrieved 26 November 2013.
  3. "IR History: Early days II". 1870–1899. IRFCA. Retrieved 26 November 2013.
  4. "Hyderabad – Imperial Gazetteer of India". IRFCA. Retrieved 26 November 2013.
  5. "History of Electrification". IRFCA. Retrieved 26 November 2013.
  6. "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 10 May 2014. Retrieved 26 November 2013.
  7. 7.0 7.1 "Sheds and Workshops". IRFCA. Retrieved 26 November 2013.