రావి నాగలక్ష్మి
రావి నాగలక్ష్మి అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారిణి. 2012లో తొలిసారి జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో ఈమె సభ్యురాలు, తమ జట్టు గెలుపునకు ఈమె కీలక పాత్ర వహించింది.[1]
![](http://up.wiki.x.io/wikipedia/te/thumb/4/48/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BF_%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF.jpg/220px-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BF_%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF.jpg)
జీవిత విశేషాలు
మార్చుఆమె ప్రకాశం జిల్లా కు చెందిన ఇంకొల్లు వాసి. ఈమె తల్లిదండ్రులు అరుణకుమారి, శ్రీమన్నారాయణ.ఆమె నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. ఆమెను మొదట కోచ్ అమ్మయ్య చౌదరి గుర్తించి శిక్షణ నిచ్చింది, తరువాత ఈమె కోచ్ పద్మజా బాల వద్ద శిక్షణ పొందింది.
ఆమె ఇంకొల్లులోని బాలికోన్నత పాఠశాలలో చదువుతున్న రోజుల్లో (2000) జాతీయ సబ్ జూనియర్ పోటీల్లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. అక్కడి నుండి అంచెలంచెలుగా అండర్-14, 17,19 జూనియర్, సీనియర్, నాగార్జున విశ్వవిద్యాలయం జట్లకు ప్రాతినిధ్యం వహించింది. ఆ సమయంలో అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ కబడ్డీ పోటీల్లో నాగార్జున విశ్వవిద్యాలయం పక్షాన ఆడి పసిడి పతకం సాధించింది. జాతీయ సీనియర్ కబడ్డీ పోటీల్లో తృతీయ స్థానం సాధించడంలో ప్రధాన భూమిక పోషించింది. 2007లో శ్రీలంకతో జరిగిన దక్షిణాసియా సమాఖ్య క్రీడల్లో భారత జట్టు తరపున పాల్గొని బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది.
ప్రస్తుతం ఆమె సికింద్రాబాదు రైల్వే డిపార్టుమెంటులో జూనియర్ అసిస్టెంట్ గా చేరింది. [2] క్రీడల కేటాయింపులో బీహార్ హాజీపూర్ రైల్వే డివిజన్ లో సీనియర్ ఉద్యోగిగా పనిచేస్తుంది.
ప్రోత్సాహక బహుమతి
మార్చు2012 మహిళల కబడ్డీ ప్రపంచకప్లో స్వర్ణ పతకాన్ని సాధించిన భారత జట్టులోని సభ్యురాలైన ఈమెను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గుర్తించి 2012 ఆగస్టు 11న రూ.25 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు.
మూలాలు
మార్చు- ↑ సాక్షి దినపత్రిక - 12-08-2014 స్పోర్ట్స్ పేజీలో
- ↑ "Welcome to Mana Inkollu - More Information". manainkollu.org. Archived from the original on 2020-10-25. Retrieved 2020-07-24.