నాయని వెంకటరంగారావు

(నాయని వెంకట రంగారావు నుండి దారిమార్పు చెందింది)

నాయని వెంకటరంగారావు (1879 - 1958) నల్లగొండ జిల్లా మునగాల సంస్థాన రాజు, సాహిత్యకళా పోషకుడు.

నాయని వెంకటరంగారావు
జననం1889
తొర్రూరు, వరంగల్ జిల్లా
మరణం1958
ప్రసిద్ధిమునగాల సంస్థాన రాజు, సాహిత్యకళా పోషకుడు
తండ్రినాయని వెంకటరామయ్య
తల్లిలచ్చమ్మారావు

జననం - విద్యాభ్యాసం

మార్చు

వెంకటరంగారావు 1879 లో వరంగల్ జిల్లా తొర్రూరు లో జన్మించాడు.[1] మునగాల సంస్థాన జమీందారిణి లచ్చమ్మారావు, దేశముఖు నాయని వెంకటరామయ్య దంపతులకు దత్తత వెళ్లాడు.[2] బందరు లోని నోబుల్ కళాశాలలో, మద్రాసు లో విద్యను అభ్యసించాడు.

కుటుంబం

మార్చు

వెంకటరంగారావు కుమారులు రామకృష్ణారెడ్డి, గోపాలకృష్ణారెడ్డి ఉన్న విద్యా పట్టభద్రులు. రెండవ కుమర్తె రాణి సరళాదేవి భర్త వనపర్తి సంస్థానాధీశులు రాజా కృష్ణదేవరాయలు, కుమారుడు రాజా రామేశ్వరరావు పార్లమెంట్ సభ్యులు. మొదటి అల్లుడు రాజగోపాలరెడ్డి, మూడవ అల్లుడు ఎస్.ఎమ్. రెడ్డి బారిస్టరు పట్టా పొందారు.

మునగాల రాజాగా

మార్చు

1900లో వెంకటరంగారావు ఎస్టేట్ ను ఆధిపత్యంలోకి తీసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడైన కొమర్రాజు వెంకట లక్ష్మణరావుని దివానుగా నియమించుకొన్నాడు. కొమర్రాజు 1923 వరకు మునగాల దివాన్ గా పనిచేశాడు.

సాహిత్య, కళా పోషణలు

మార్చు

మునగాల సంస్థానానికి చెందిన గ్రామాలు ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం లో, మరికొన్ని గ్రామాలు బ్రిటీషు ఇండియాలో ఉండేవి. వెంకటరంగారావుకు బ్రిటీషు పాలకులకు, ఇటు నిజాం పాలకులకు మధ్య దగ్గరి సంబంధాలు ఉండేవి. వెంకటరంగారావు కార్యకలాపాలకు ప్రధాన వేదిక హైదరాబాద్‌ నగరమే. హైదరాబాద్ లోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయము పోషకులలో వెంకటరంగారావే మొదటివారు.

బందరులోని సరస్వతీగ్రంథమాలిక, కాకినాడలోని ఆంధ్రప్రచారిణీగ్రంథమాల, మద్రాసులోని ఆర్యభారతీగ్రంథమాల, రాజమహేంద్రవరంలోని ఆంధ్రేతిహాసపరిశోధక మండలి మొదలైన సంస్థలకు రాజపోషకులుగా ఉన్నారు. విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిని స్థాపించాడు. గుంటూరు లోని శ్రీ శారదానికేతనము పాలకవర్గంలో వెంకటరంగారావు అధ్యక్షులుగా ఉన్నాడు. గుంటూరు బ్రాడీపేట దగ్గర పదివేల చదరపు గజాల (80వేల విలువగల) స్థలాన్ని ఈ శారదనికేతనానికి దానంగా ఇచ్చారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు లో కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు స్మారకార్థం ఒక నిధిని కూడా ఏర్పాటుచేశాడు. బందరు జాతీయ కళాశాలకు రూ. 8వేలు విరాళంగా ఇచ్చాడు.

1906లో బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమంలో పాల్గొన్న సయమంలో ఈయనకు రవీంద్రనాథ్ టాగూర్ తో ప్రత్యక్ష సంబంధాలుండడంతోపాటు శాంతినికేతన్ కు ధన సహాయం కూడా చేశారు.

సంస్థలకు ధన సహాయం చేసిన వివరాలు:

  • రాజా దన్‌ రాజ్‌ గిరి - 15,000/-
  • మార్వాడి సమితి - 1,750/-
  • సికిందరాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ - 1,000/-
  • టీచర్స్‌ అసోసియేషన్‌ - 1,000/-
  • పబ్లిక్‌ ఆఫ్‌ సికిందరాబాద్‌ - 750/-

బిరుదులు

మార్చు

ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారు వెంకటరంగారావుకు కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చారు.

వెంకటరంగారావు 1958 లో మరణించారు.

మూలాలు

మార్చు
  1. తెలంగాణ మాస పత్రిక. "తెలంగాణలో విశ్వకవి రవీంద్రుడు". Retrieved 20 September 2017.
  2. మాగంటి, ఆంధ్ర సంస్థానములు: సాహిత్య పోషణము. "మునగాల" (PDF). Retrieved 20 September 2017.