నాలుక
పూర్తిగా కండరాలతో చేయబడిన నోటిలోని భాగం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నాలుక (Tongue) పూర్తిగా కండరాలతో చేయబడిన నోటిలోని భాగం. ఇది ఆహారాన్ని నమలడం, మింగడంలో ఉపకరిస్తుంది. దీనివల్లనే మనకు రుచి తెలుస్తుంది. లాలాజలం దీన్ని ఎప్పుడూ తడిగా ఉంచుతుంది. మనం మాట్లాడడానికి కూడా ఇది సహకరిస్తుంది. ఇది నోటి అడుగుభాగంలో క్రింది పళ్ళ నుండి గొంతు వరకు వ్యాపించింది. నాలుక గురించిన అధ్యయనాన్ని లారింగాలజీ అంటారు
నిర్మాణము
మార్చు- ఉపకళా కణజాలము: జిహ్వా మొగ్గలు కలిగి ఉండి, రుచిని తెలియజేస్తాయి.
- గ్రంధులు: వీటి స్రావాలు నాలుకను తేమగా ఉంచుతాయి.
- కండరాలు: ముఖ్యంగా చారల కండరాలు. నాలుక చలనంలో తోడ్పడతాయి.
వైద్యశాస్త్రంలో
మార్చు- నాలుక క్రింద మాత్రలు ఉంచడం ఒక వైద్యవిధానం. మందు త్వరగా కరిగి గుండెను చేరి అతి త్వరగా పనిచేయడం మొదలుపెడుతుంది. గుండెనొప్పి వచ్చిన వెంటనే మనతో ఉన్న నైట్రోగ్లిజరిన్ మాత్రలు వెంటనే పనిచేసి నొప్పి తొందరగా తగ్గుతుంది.
- నాలుక పూత ఒకరకమైన శిలీంద్ర సంబంధమైన వ్యాధి.
- మనిషి శరీరంలో నీరు ఎక్కువగా తగ్గినప్పుడు నాలుక ఎండిపోయినట్లు పొడిగా కనిపిస్తుంది.
- కొన్ని నరాల వ్యాధులలో నాలుక వంకరపోతుంది. అది తిరిగిన వైపును బట్టి వ్యాధిని గురించి అవగాహన కలుగుతుంది.
- నోటిలోని కాన్సర్ నాలుకకు కూడా రావచ్చును.
- నాలుక ద్వారా చూపు:కంటి చూపు కోల్పోయిన వారు నాలుకతో చూసే విధంగా బ్రెయిన్ పోర్ట్ అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చుLook up నాలుక in Wiktionary, the free dictionary.