నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ
నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ అనేది హైదరాబాదు రాష్ట్రంలోని నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే కు చెందిన ఒక విభాగం. ఇది 1932వ సంవత్సరంలో రోడ్డు రవాణా శాఖకు సంబంధించి ప్రయాణీకుల రోడ్డు రవాణా సేవలను జాతీయం చేసిన మొదటి రవాణా శాఖ.
![]() | |
పరిశ్రమ | బస్సు |
---|---|
స్థాపన | 1932 |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | హైదరాబాదు రాష్ట్రం |
కీలక వ్యక్తులు | నిజాం |
సేవలు | ప్రజా రోడ్డు రావాణా సేవ |
ఉద్యోగుల సంఖ్య | 166 (1932) |
మాతృ సంస్థ | నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే |
చరిత్ర
మార్చుప్రజా రవాణా కోసం నిజాం రాజు 1932 జూన్‍లో మూడులక్షల తొంబైమూడువేల రూపాయల పెట్టుబడితో, మూడు డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో ఈ రవాణా శాఖను ప్రారంభించాడు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థ. రైల్వే పరిపాలన ఆధ్వర్యంలో షెడ్యూల్ చేసిన బస్సు సర్వీసులు 450 కిలోమీటర్ల పరిధిలో నడిచాయి. 1936 నాటికే హైదరాబాదు నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులు నడపటం ప్రారంభమైంది.[1] ఒక దశాబ్దకాలంలో మొత్తం 7½ మిలియన్ హెచ్‌ఆర్‌ల ఖర్చుతో దాదాపు 500 వాహనాలు, 7200 కి.మీ. పరిధికి విస్తరించింది.[2]
ఏ.పి.యస్.ఆర్.టి.సి. గా మార్పు
మార్చునిజాం చివరి రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ సంస్థను భారత ప్రభుత్వంకు అప్పగించాడు. నంబర్ ప్లేట్‌లోని జెడ్ అక్షరం తన తల్లి జహ్రా బేగంను సూచిస్తున్నందున, ప్రతి బస్సు నంబర్‌లో జెడ్ అక్షరాన్ని చేర్చాలని ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు.[3] 1951, నవంబరు 1వ తేదీన ఈ సంస్థ హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వ శాఖగా మార్చబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1958లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది.[4] తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దీనినుండి 2015లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వేరుపడింది.[5]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ సాక్షి, విద్య (28 November 2015). "రవాణా సౌకర్యాలు". www.sakshieducation.com. Archived from the original on 7 December 2019. Retrieved 7 December 2019.
- ↑ Nayeem, M. A.; The Splendour of Hyderabad; Hyderabad ²2002 [Orig.: Bombay ¹1987]; ISBN 81-85492-20-4; S. 221
- ↑ "Nizam's wife gifted first bus service to Secunderabad". The Hans India.
- ↑ "APSRTC - Profile". apsrtc.gov.in. Archived from the original on 2018-09-30. Retrieved 2019-12-07.
- ↑ Krishnamoorthy, Suresh (16 May 2014). "It will be TGSRTC from June 2". The Hindu. Hyderabad. Retrieved 7 December 2019.