నిధి బిష్త్ (జననం 1985 అక్టోబరు 21) ఒక భారతీయ నటి, చిత్రనిర్మాత, న్యాయవాది. ఆమె ది వైరల్ ఫీవర్ తొలి సభ్యులలో ఒకరు.[2][3] ఆమె టీవీఎఫ్ తో క్రియేటివ్ డైరెక్టర్ గా, తరువాత గిర్లియాపా కోసం క్రియేటివ్ హెడ్ గా పనిచేసింది.

నిధి బిష్త్
జననం (1985-10-21) 21 అక్టోబరు 1985 (age 39)[1]
భారతదేశం
జాతీయతభారతీయురాలు
విశ్వవిద్యాలయాలుజామియా మిలియా ఇస్లామియా
వృత్తి
  • నటి
  • చిత్ర నిర్మాత
  • న్యాయవాది
క్రియాశీలక సంవత్సరాలు2009–ప్రస్తుతం
ప్రసిద్ధివినోదం

జీవితచరిత్ర

మార్చు

నిధి బిష్త్ ఢిల్లీ పోలీస్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నది. ఆ తరువాత, ఆమె జామియా మిలియా ఇస్లామియా కళాశాలలో ఎల్ ఎల్ బి పూర్తిచేసింది.[1] గ్రాడ్యుయేషన్ తరువాత, ఆమె ఐపిఆర్ న్యాయ సంస్థలో పనిచేయడం ప్రారంభించింది.[3] ఢిల్లీ హైకోర్టులో ఆమె న్యాయవాదిగా ఒక సంవత్సరం పాటు పనిచేసింది.[4] 2009లో ఆమె తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి వినోద రంగంలో అడుగు పెట్టింది. ది సిటీ ఆఫ్ జిన్స్, చైన్పూర్ కి దస్తాన్, షిట్ హాపెన్స్, వన్స్ అపాన్ ఎ టైగర్, డర్టీ టాక్, హోలీ, షేక్స్పియర్, హూ?, ఓకే టాటా బై బై వంటి చిత్రాలలో నటించింది. 

ఆమె 2013లో వైరల్ ఫీవర్లో చేరింది.[3] ఆమె ది వైరల్ ఫీవర్లో ఐఐటీయేతర గ్రాడ్యుయేట్ అయిన ఏకైక మహిళ.[3]

2013లో ఆమె చాయ్ సుత్త క్రానికల్స్ లో నటించింది.[1] ఆమె 2014లో పర్మనెంట్ రూమ్మేట్స్ లో నటించింది. ఆమె 2015లో ఉమ్రికాలో నటించింది.[3] ఆమె 2017లో అనుష్కా శర్మ, సూరజ్ శర్మ, దిల్జిత్ దోసాంజ్ లతో కలిసి ఫిల్లౌరీలో నటించింది.[5] ఆమె బిష్త్ ప్లీజ్! లో నటించింది.[6] ఆమె బ్యాచిలర్స్ లో నటించింది. ఆమె 2018లో కనిక అనే లఘు చిత్రంలో నటించింది.[7] ఆమె టీవీఎఫ్ ట్రిప్లింగ్, ఇమ్ మ్యాచూర్, ది మేకింగ్ ఆఫ్.... వంటి వెబ్ సిరీస్లలో కూడా నటించింది.[8][9] ఆమె చిత్రం డ్రీమ్ గర్ల్ 2019 సెప్టెంబరు 13న విడుదలై బ్లాక్బస్టర్ హిట్ అయింది.[10][11][12] డిసెంబరు 2019లో విడుదలైన టీవీఎఫ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'క్యూబికల్స్' లో మేఘా అస్తానా పాత్రను ఆమె పోషించింది.[13]

ఆమె పర్మనెంట్ రూమ్మేట్స్ (2016), పిఎ-గల్స్ (2017), బిష్త్ ప్లీజ్! (2017) లలో చేసింది.[14] ఆమె పిఎ-గల్స్ లో దర్శకుడిగా కూడా పనిచేసింది.[15] ఆమె టీవీఎఫ్ పిచర్స్ కాస్టింగ్ డైరెక్టర్, పర్మనెంట్ రూమ్మేట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది.[14]

ఫిల్మోగ్రఫీ

మార్చు

నటిగా

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2013 తుపాకి తమిళ భాష
చాయ్ సుత్త క్రానికల్స్ ఇప్సా వెబ్ సిరీస్
2014 పర్మనెంట్ రూమ్మేట్స్ రీతూ వెబ్ సిరీస్
2015 ఉమ్రికా పింకీ
2016–19 టీవీఎఫ్ ట్రిప్లింగ్ నిర్మలా/భాభిషా వెబ్ సిరీస్
2017 ఫిలౌరి అమృత్
2017 బిష్త్, ప్లీజ్! నీతు బిష్త్/నీతు వెబ్ సిరీస్
2017–18 బ్యాచిలర్స్ చెవింగామి వెబ్ సిరీస్
2018 ది మేకింగ్ ఆఫ్... జామియా రాయ్ సేన్ గుప్తా, అర్జెంటీనా, ఏక్తి కపూర్ వెబ్ సిరీస్
కనికా మహిమా, ఒక పోలీసు అధికారి షార్ట్ ఫిల్మ్
2019 ఇమ్ మ్యాచూర్ ఐశ్వర్య మిస్ వెబ్ సిరీస్
డ్రీమ్ గర్ల్ రోమా హిందీ సినిమా
హాస్టల్ డజ్ కెమిస్ట్రీ ల్యాబ్ అసిస్టెంట్ వెబ్ సిరీస్
2019–2022 క్యూబికల్స్ మేఘా అస్థానా వెబ్ సిరీస్
2020 మిస్టర్ అండ్ మిసెస్ మధు వెబ్ సిరీస్
2022 హోమ్ శాంతి ఎస్డిఎం అరుణ త్రిపాఠి వెబ్ సిరీస్
ఫోన్ బూత్ లేడీ డయానా హిందీ సినిమా
2024 మామ్లా లీగల్ హై సుజాతా దీదీ హిందీ టీవీ సిరీస్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Meet Nidhi Bisht, the casting director who spotted leading web series stars". Hindustan Times. 24 December 2016. Retrieved 14 October 2019.
  2. "Nidhi Bisht waits to strike". Deccan Chronicle. 5 April 2017. Retrieved 14 October 2019.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Venkatesh, Shruti (2019-03-28). "TVF's Nidhi Bisht is breaking stereotypes and making it viral". Outlook Business. Archived from the original on 2019-03-30. Retrieved 14 October 2019.
  4. "All the Bisht to a TVF star". The Asian Age. 7 November 2015. Retrieved 14 October 2019.
  5. "Phillauri Cast & Crew". Bollywood Hungama. Retrieved 14 October 2019.
  6. "Bisht, Please! TVF's first show with a woman protagonist is all about men". Firstpost. 4 April 2017. Retrieved 14 October 2019.
  7. Dabhade, Aishwarya (2018-11-30). "Kanika review: A stirring narration and an honest attempt to tap a neglected issue". CNBCTV18 (in ఇంగ్లీష్). Archived from the original on 2020-09-22. Retrieved 2024-12-25.
  8. "5 things that make TVF Tripling the blockbuster web series that it is". India Today. 5 October 2016. Retrieved 14 October 2019.
  9. "'ImMature' Season 2 renewal details revealed". The Times of India. 4 April 2019. Retrieved 14 October 2019.
  10. "'Dream Girl': Ayushmann Khurrana introduces 'Pooja Ki Pujaran No.3'". The Times of India. 30 August 2019. Retrieved 14 October 2019.
  11. "Dream Girl: An attempt at a comedy of errors that makes you laugh... and forget why you did, immediately after". The Telegraph. 14 September 2019. Retrieved 14 October 2019.
  12. "Sexist and homophobic: Why Ayushmann Khurrana's Dream Girl pulls us back a decade in cinema". India Today. 18 September 2019. Retrieved 14 October 2019.
  13. Jyoti Kanyal (December 16, 2019). "Nidhi Bisht: Web gives more freedom. Women are writing, directing women here". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-05-07.
  14. 14.0 14.1 "Nidhi Bisht – Actor, Director, And Writer; The Backbone Of TVF". Rhapsode. 17 April 2019. Archived from the original on 14 October 2019. Retrieved 14 October 2019.
  15. "Had pitched PA-Gals to TVF six years ago, says Nidhi Bisht". Mid Day. 7 August 2018. Retrieved 14 October 2019.