నిధి సుబ్బయ్య (జననం 16 ఫిబ్రవరి, 1987), భారతీయ సినీ నటి, మోడల్. ఆమె ఎన్నో టీవీ యాడ్లలోనూ, దక్షిణ భారత, హిందీ సినిమాల్లోనూ నటించింది. ఆమె నటించిన పంచరంగి(2010), కృష్ణన్ మ్యారేజ్ స్టోరీ(2011) వంటి కన్నడ సినిమాల ద్వారా ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ రెండు సినిమాల్లోని నటనకూ ఫిలింఫేర్ పురస్కారానికీ, సైమా స్పెషల్ ఎప్ప్రిసియేషన్ పురస్కారానికీ నామినేషన్ పొందింది నిధి. ఓ మై గాడ్ సినిమాతో బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసిన ఆమె, అజబ్ గజబ్ లవ్ సినిమాలో కూడా నటించింది.

నిధి సుబ్బయ్య
జననం (1985-02-16) 16 ఫిబ్రవరి 1985 (age 39)
కొడగు, కర్ణాటక, భారతదేశం
విద్యాసంస్థశ్రీ జయచామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (SJCE), మైసూర్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం

తొలినాళ్ళ జీవితం

మార్చు

కర్ణాటకలోని కొడగు జిల్లాలో 16 ఫిబ్రవరి 1982న బొల్లచంద సుభాష్ సుబ్బయ్య, ఝాన్సీ సుబ్బయ్యలకు జన్మించింది నిధి.[1] ఆ తరువాత ఆమె కుటుంబం మైసూర్ లోని గోకులంకు మారిపోయింది. అక్కడే తన చిన్నతనం గడిపిన నిధి, చదువు కూడా మైసూర్ లోనే పూర్తి చేసింది.

మూలాలు

మార్చు
  1. "Nidhi had a little lamb, Entertainment - Bollywood - Bangalore Mirror,Bangalore Mirror". Bangaloremirror.com. 26 September 2010. Archived from the original on 28 September 2010. Retrieved 8 November 2012.