నీటి ఆవిరి లేదా ఆవిరి (Steam or Water vapor) నీరు మరిగించినప్పుడు విడుదలై గాలిలో కలిసిపోయే వాయువు.

ఎల్లో స్టోన్ పార్క్ వద్ద ఆవిరిగా మారుతున్నా నీరు

ఆవిరి యంత్రం

మార్చు

నీటి ఆవిరిలోని శక్తిని మొదటి సారిగా గుర్తించి వాటితో ఆవిరి యంత్రాలను తయారుచేసింది జేమ్స్ వాట్ (James Watt). వీటి ద్వారానే 18వ శతాబ్దంలో యాంత్రిక యుగం అభివృద్ధి చెందింది. నీటి ఆవిరితో నడిచే రైలు, ఓడలు కూడా తయారయ్యాయి. నీటిని మరిగించడానికి బొగ్గును ఇంధనంగా ఉపయోగించేవారు. ఇలాంటి స్టీమ్ తో నడిచే ఓడని స్టీమర్ అనడం తెలుగు భాషలోని వచ్చింది.

ఉపయోగాలు

మార్చు
  • నీటి ఆవిరి మీద మన ఇండ్లలో ప్రెషర్ కుక్కర్ (Pressure Cooker) తో వంటచేసుకుంటాము. వివిధ ఆహార పదార్థాలు తయారుచేసుకోవచ్చును.
  • ఆవిరి నింపిన గదులలో ఒక విధమైన ఆవిరి స్నానం (Steam Bath) కోసం కూర్చుంటారు. వీటిని స్పా (Spa) అంటారు.
  • గృహ వైద్యంలో ఆవిరిలో వివిధ పదార్థాలు వేసి ఆవిరి పీల్చితే జలుబు, దగ్గు మొదలైన ఊపిరితిత్తుల బాధలనుండి ఉపశమనం కలుగుతుంది.
"https://te.wiki.x.io/w/index.php?title=నీటి_ఆవిరి&oldid=3840433" నుండి వెలికితీశారు