నృత్య నాటిక అనునది ఒక విశిష్టమైన నృత్య కళ.[1] ఈ కళారూపంలో గాయకులు, సంగీతకారులు, నర్తకులు కలిసి ఒక కథను లేక ఒక ఘట్టాన్ని ఒక నృత్యరూపంలో ప్రదర్శిస్తారు. ఇందులో పాటలకే కాక పద్యాలకు, పదములకు కూడా స్థానం ఉంది. ఈ కళ యందు హావ-భావాలు, నటన, దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అప్పుడప్పుడూ మాత్రమే నాట్యం ప్రధానాంశం అవుతుంది. ప్రతి వాగ్గేయకారుడు తన కృతిలలో కచ్చితంగా ఒక నృత్యనాటకాన్ని రచించడం కద్దు.

  • మన రంగస్థల నాటకములు, కన్నడిగుల యక్షగానము, ఇదే కోవకు చెందినవి.
  • అయితే త్యాగరాజులు వారు రాసిన నౌకా చరితము అను నృత్యనాటిక చాలా ప్రసిద్ధమైనది.[2]
  • ఇంకా ఇదే కోవలో వస్తాయి- భామా కలాపము.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలలో తెలంగాణ ఉద్యామన్ని గురించిన 'జయ జయహే తెలంగాణ' నృత్యనాటిక

కూచిపూడి నాట్యకళాకారులు ప్రదర్శించే నృత్యరూపకాలో అలంకారయుక్తంగా, దేశ ఛందస్సుతో రచించబడ్డాయి.  నృత్యరూపకాలలో దరువులకు ప్రత్యేకస్థానం ఉంది.  దరువంటే మాత్రా ఛందస్సుతో, సాధ్యమైనంత వరకు చతురస్రంలో నడుస్తూ పల్లవి, అనుపల్లప్లవి చరణాలతో కూడి    ఉండే సంగీత రచన. [3]

మూలాలు

మార్చు
  1. "Definition of DANCE DRAMA". www.merriam-webster.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-07.
  2. Thyagaraja. Nauka Charitra telugu.
  3. పత్రిక, విహంగ మహిళా. "కూచిపూడి నృత్య నాటికలలో "దర్వులు" – వైవిధ్యం - డా.లక్ష్మణరావు ఆదిమూలం |" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-05-07. Retrieved 2021-05-07.