పంజాబ్ మెయిల్
పంజాబ్ మెయిల్భారతీయ రైల్వేలు,మధ్య రైల్వే మండలం నిర్వహిస్తున్న సూపర్ ఫాస్టు రైలు.ఇది ఛత్రపతి శివాజీ టెర్మినస్,ముంబై,పంజాబ్ లో గల ఫిరోజ్‌పూర్ ల మద్య నడిచే రోజువారి సర్వీసు.12137 నెంబరుతో ఛత్రపతి శివాజీ టెర్మినస్,ముంబై,ఫిరోజ్‌పూర్ ల వరకు ,తిరుగు ప్రయాణం లో 12138 నెంబరుతో ఫిరోజ్‌పూర్ నుండి ఛత్రపతి శివాజీ టెర్మినస్,ముంబై వరుకు ప్రయాణిస్తుంది.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్ట్ రైలు |
స్థానికత | మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్,రాజస్థాన్,ఉత్తర ప్రదేశ్,హర్యానా,ఢిల్లీ,పంజాబ్ |
తొలి సేవ | 1 జూన్ 1912 |
ప్రస్తుతం నడిపేవారు | మధ్య రైల్వే మండలం |
మార్గం | |
మొదలు | ఛత్రపతి శివాజీ టెర్మినస్,ముంబై |
ఆగే స్టేషనులు | 56 12137 పంజాబ్ మెయిల్, 54 12138 పంజాబ్ మెయిల్ |
గమ్యం | ఫిరోజ్పూర్ |
ప్రయాణ దూరం | 1,930 కి.మీ. (1,199 మై.) |
రైలు నడిచే విధం | రోజు |
సదుపాయాలు | |
శ్రేణులు | క్లాసిక్ స్లీపర్,ఎ.సి మూడవ క్లాసు,రెండవ క్లాసు,మొదటి క్లాసు,సాధరణ |
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు |
పడుకునేందుకు సదుపాయాలు | కలదు |
ఆహార సదుపాయాలు | పాంట్రీ కార్ ఉంది |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | Standard భారతీయ రైల్వేలు coaches |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 110 km/h (68 mph) maximum 56.83 km/h (35 mph), including halts |
చరిత్ర
మార్చుభారతదేశం లో ప్రారంభింపబడ్డ పురాతన రైలుబండ్లలో పంజాబ్ మెయిల్ ఒకటి.దీనిని 1912 జూన్ 1 న ప్రారంభించారు.ఈ రైలు మొదటిలో బాల్లర్డ్ పెషావర్ ల మద్య నడిచేది.బ్రిటీష్ అధికారులను ఆరేబియా సముద్ర ఒడ్డున గల బాల్లర్డ్ నుండి నేరుగా ఢిల్లీ తరలించడానికి దీనిని ఉపయోగించేవారు.ఇది గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలుబండి కన్నా పురాతనమైనది.1914 నుండి దీనిని (ఛత్రపతి శివాజీ టెర్మినస్ ) విక్టోరియా టెర్మినస్ నుండి బయలుదేరడం మొదలైంది.భారత దేశ స్వాతంత్రనంతరం దీనిని ఫిరోజ్‌పూర్ వరకు నడిపించడం జరిగింది.
కోచ్ల అమరిక
మార్చుపంజాబ్ మెయిల్ లో ఎ.సి మొదటి తరగతి భోగీ 1,రెండవ తరగతి భోగీ 1,ముడవ తరగతి భోగీ 6 ,10 స్లీపర్ భోగీలు,3 సాధరణ భోగీలుంటాయి.
Loco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
M/L | SLR | S1 | S2 | S3 | S4 | S5 | S6 | S7 | S8 | S9 | S10 | PC | B1 | B2 | B3 | B4 | B5 | AB1 | A1 | HA1 | UR | UR | SLR |
ట్రాక్షన్
మార్చుమొదటగా పంజాబ్ మెయిల్ కు మూడు లోకోమోటివ్లను ఉపయోగించేవారు.ముంబై నుండి ఇగాత్పురి వరకు కల్యాణ్ లోకో షెడ్ అధారిత WCAM 3 ను,అక్కడి నుండి ఉపయోగించేవారు.అక్కడి నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు ఘజియాబాద్ అధారిత WAP 4 లోకోమోటివ్ను,అక్కడి నుండి ఫిరోజ్‌పూర్ వరకు భగత్ కి కోటి ఆధారిత WDP 4 ను ఉపయోగించేవారు. 2015 జూన్ లో DC-AC మార్పులు చేయడంతో ముంబై నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు ఘజియాబాద్ అధారిత WAP 4 లేదా WAP 7 లోకో మొటివ్ను, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ఫిరోజ్‌పూర్ వరకు భగత్ కి కోటి అధారిత WDP 4 లేదా WDP 4B లేదా WDP 4D లోకోమోటివ్ను ఉపయోగిస్తారు.
ప్రయాణం
మార్చుపంజాబ్ మెయిల్ 1930 కిలో మిఅటర్ల ప్రయాణదూరాన్ని 34గంటల సమయంతో,సుమారు 57 కిలో మీటర్ల సగటు వేగంతో పూర్తి చేస్తుంది.