పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం
సంగారెడ్డి జిల్లాలోని 5 శాసనసభ స్థానాలలో పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం ఒకటి. 2009లో జరిగిన నియోజకవర్గాల డీలిమిటేషన్లో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి విడిపోయి నూతనంగా పటాన్చెరు నియోజకవర్గం ఏర్పడింది. 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా తర్వాత వరుసగా 2018, 2018 రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది.
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 17°31′12″N 78°15′36″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,17.52,78.26,300x300.png?lang=te&domain=te.wiki.x.io&title=%E0%B0%AA%E0%B0%9F%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C%E0%B0%9A%E0%B1%86%E0%B0%B0%E0%B1%81_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4089837&groups=_43887763c467aba09e67378f0b1ef95fb1cb08a3)
ఈ నియోజకవర్గంలో మొత్తంగా 3 లక్షల 28 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 5 మండలాలతో పాటు తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలు ఉన్నాయి. రామచంద్రాపురం, పటాన్చెరు, భారతీనగర్ డివిజన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భాగంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలన్నీ కలిపి 5 వేల పైనే ఉన్నాయి. రాష్ట్రంలోనే ప్రముఖ పారిశ్రామిక ప్రాంతంగా పేరున్న పటాన్చెరులో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిన కార్మికుల ఓట్లే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయిస్తుంటాయి.
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు
మార్చుఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు:
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 టి.నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఎం.సపాన్ దేవ్ స్వతంత్ర అభ్యర్థి 2014 గూడెం మహిపాల్ రెడ్డి తె.రా.స ఎం.సపాన్ దేవ్ తె.దే.పా 2018 గూడెం మహిపాల్ రెడ్డి తె.రా.స కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ 2023[1] గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ
2009 ఎన్నికలు
మార్చు2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నందీశ్వర్ గౌడ్ పోటీచేయగా, ప్రజారాజ్యం పార్టీ నుండి జి.రాములు పోటీపడ్డాడు. భారతీయ జనతా పార్టీ తరఫున సత్యనారాయణ, సి.పి.ఎం. నుండి చుక్కారాములు పోటీచేశారు.[2]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009