పట్టు (సిల్క్)
సిల్క్ అనేది సహజ ప్రోటీన్ దారం. ఈ దారంతో బట్టలు నేస్తారు. ఈ ప్రోటీన్ దారం ముఖ్యంగా పైబ్రోయిన్ తో తయారైనది. ఇది దారం కొన్ని పురుగుల గుడ్లనుండి తయారైన లార్వా నుండి ఉత్పత్తి అవుతుంది. ఈ లార్వా తన చుట్టూ ఒక దారాన్ని అల్లుకుని కకూన్ ను తయారు చేసుకుంటుంది. [1] ముఖ్యంగా పట్టు పురుగు లార్వాలతో ఏర్పడే సిల్క్ ను ఎక్కువగా వస్త్రాల తయారీకి వాడుతున్నారు. పట్టు దారం మెరిసే రూపం పట్టు దారం త్రిభుజాకార పట్టకం లాంటి నిర్మాణం కారణంగా ఏర్పడుతుంది. పట్టు వస్త్రంలో ఉన్న ఈ పట్టకం లాంటి రూపాలలో వివిధ కోణాల్లో పతనమైన కాంతిని వక్రీభవనం చెందించడం మూలంగా మెరుపు వస్తుంది. తద్వారా వివిధ రంగులను ఉత్పత్తి చేస్తుంది.
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/8/8f/Meyers_b14_s0826a.jpg/220px-Meyers_b14_s0826a.jpg)
పట్టు (సిల్క్) అనేక కీటకాల వల్ల ఉత్పత్తి అవుతుంది. కానీ సాధారణంగా వస్త్ర తయారీకి మాత్ గొంగళి పురుగుల పట్టు మాత్రమే ఉపయోగించబడుతుంది. అణుస్థాయిలో బేధం కలిగించే ఇతర రకాల పట్టు దారాన్ని తయారుచేయడానికి పరిశోధనలు జరిగాయి.[2] సాధారణంగా పట్టును కీటకాల జీవన చక్రంలోని లార్వా దశలో దాని నుండి ఉత్పత్తి చేసిన దారంతో తయారుచేస్తారు. అదే విధంగా సాలెపురుగులు, రేస్పీ క్రికెట్స్ వంటి కొన్ని కీటకాలు కూడా వాటి జీవన విధానంలో పట్టును తయారుచేస్తాయి.[3] సిల్క్ ఉత్పత్తి హెమెనోప్టెరా ( తేనెటీగలు, కందిరీగలు, చీమలు), సిల్వర్ ఫిష్, మైఫైల్స్, థ్రిప్స్, లీఫ్ హోపర్స్, బీటిల్స్, లేస్ వింగ్స్, ప్లీస్, ప్లైస్, మిడ్జెస్ వంటి కీటకాలలో కూడా కనిపిస్తుంది.[2] ఇతర రకాల ఆర్థ్రోపొడా వర్గానికి చెందిన జీవులు కూడా సిల్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ప్రధానంగా సాలెపురుగులు ఉత్పత్తి చేస్తాయి.
మూలాలు
మార్చు- ↑ "Silk". The Free Dictionary By Farlex. Retrieved 2012-05-23.
- ↑ 2.0 2.1 Sutherland TD, Young JH, Weisman S, Hayashi CY, Merritt DJ (2010). "Insect silk: one name, many materials". Annual Review of Entomology. 55: 171–88. doi:10.1146/annurev-ento-112408-085401. PMID 19728833.
- ↑ Walker AA, Weisman S, Church JS, Merritt DJ, Mudie ST, Sutherland TD (2012). "Silk from Crickets: A New Twist on Spinning". PLOS ONE. 7 (2): e30408. Bibcode:2012PLoSO...730408W. doi:10.1371/journal.pone.0030408. PMC 3280245. PMID 22355311.
{{cite journal}}
: CS1 maint: unflagged free DOI (link)