పార్వతీ కళ్యాణం (1941 సినిమా)
ప్రతిభా పతాకాన ఘంటసాల బలరామయ్య 'పార్వతీ కళ్యాణం' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇది ప్రతిభావారి తొలి చిత్రం. ఘంటసాల బలరామయ్య సోదరుడు, ఘంటసాల రాధాకృష్ణయ్య, శివుడుగా, పారుపల్లి సత్యనారాయణ నారదుడుగా, పారుపల్లి సుబ్బారావు హిమవంతుడుగా, ఘంటసాల శేషాచలం మన్మధుడుగా, శాంతకుమారి పార్వతిగా, లక్ష్మీదేవి మేనకగా, వెంకటగిరి రతీదేవిగా నటించారు. మద్రాస్‌లోని వేల్ పిక్చర్స్ స్టూడియోలో షూటింగ్ జరిగింది.[1]
పార్వతీ కళ్యాణం (1941 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఘంటసాల బలరామయ్య |
నిర్మాణం | ఘంటసాల బలరామయ్య |
తారాగణం | దైతా గోపాలం, శాంతకుమారి, ఘంటసాల రాధాకృష్ణయ్య, పారుపల్లి సత్యనారాయణ, పారుపల్లి సుబ్బారావు, ఘంటసాల శేషాచలం, లక్ష్మీదేవి |
సంగీతం | ఓగిరాల రామచంద్రరావు |
గీతరచన | దైతా గోపాలం |
నిర్మాణ సంస్థ | ప్రతిభా పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుఘంటసాల రాధాకృష్ణయ్య
పి.శాంతకుమారి
దైతా గోపాలం
పారుపల్లి సుబ్బారావు
పారుపల్లి సత్యనారాయణ
కమలాదేవి
శేషాచలం
లక్ష్మీదేవి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: ఘంటసాల బలరామయ్య
- సంగీతం: ఓగిరాల రామచంద్రరావు
- గీత రచయిత: దైతా గోపాలం
- గాయనీ గాయకులు: పి.శాంతకుమారి, బి.ప్రభాకరరావు, జి.రాదాకృష్ణయ్య, జి.శేషాచలం, పి.సత్యనారాయణ, కమలాదేవి, విజయ, వెంకటగిరి, రామబ్రహ్మం, శ్రీనివాసరావు నాయుడు, కృష్ణప్ప
- నిర్మాత:ఘంటసాల బలరామయ్య
- నిర్మాణ సంస్థ: ప్రతిభా పిక్చర్స్
- విడుదల:1941: డిసెంబరు:10.
పాటల జాబితా
మార్చుగీత రచయిత: దైతా గోపాలం
1.గౌరీ కళ్యాణము గనరారే కన్నుల పండువుగా, రచన: దైతా గోపాలం, గానం.పి.శాంతకుమారి బృందం
2.ఈ దెస గన్గొనరే చెలులారా ఎన్ని సుమంబులహో , గానం.పి.శాంతకుమారి
3.ఆడుదమా పాట పాడుదమా మనము ఆనంద వారాశి, గానం.పి.శాంతకుమారి బృందం
4.ఆహా వ్రతంబు సపలంభాయే నాదు జన్మ సార్థకమాయే, గానం.ఘంటసాల రాథాకృష్ణయ్య, పి.శాంతకుమారి
5.ఎంతో సంతసమౌగా ఈ దినమెంతో శుభదినమౌగా, గానం.బృందం
6.ఏ దేస. కేగితివో స్వామి ఈ నీ దాసికి యీకేది తెరవో, గానం.పి.శాంతకుమారి
7.కరుణ కలిగెను నా ఈశానా నీ చరణదాసిపైన, గానం.పి.శాంతకుమారి
8.ప్రభో లోకనాథా భక్తవత్సలా శుభకర శంభో, గానం.పారుపల్లి సత్యనారాయణ
9.ప్రాణదారుడ నీవే మానస చోరుడ నీవే, గానం.పి.శాంతకుమారి
10.ప్రణుతావనా హే దేవా ఫాలలోచనా భవమోచనా,గానం. పి.సత్యనారాయణ
11.ప్రేమరూపా శుభనామా విజిత మనోజ విభో జగదీశ్వరా, గానం.పి.సత్యనారాయణ
12.భళి భళి ఎంతటి మగవానిన్ మది గోరితీవో, గానం.కమలాదేవి, విజయ
13.రాగదోయీ వసంతదేవా వేగ రావోయీ రాగము, గానం.వెంకటగిరి, జి.శేషాచలం
14.వడిగా వడి వడిగా నడుపుము జీవితనౌక , గానం.వెంకటగిరి, జి.శేషాచలం
15.శంభో జయచంద్ర మకుట, గానం.రామబ్రహ్మం,శ్రీనివాసరావు, నాయుడు, కృష్ఞప్ప
16.శివ శివ శంభో గిరీశా చిదానంద రూపా శివహర, గానం.పి.సత్యనారాయణ
17.శివమయమీ భువనమురా సదాశివుడే పరదైవమురా,
18 స్వామీ నను కరుణించెనుగా జన్మసార్థక మయ్యేను, గానం: పి.శాంతకుమారి
పద్యాలు
మార్చు1.అరసి పాల్వోసి పెంచిన యర్భకుండు దుష్టుడైనను, గానం.బి.ప్రభాకరరావు
2.కులిశము చేతగాని పని కోమలచారు సరోజ మల్లికా, గానం.జి.శేషాచలం
3.చెరుకు పానకమాన నాశించు హృదయ ముప్పునీటి, గానం.పారుపల్లి సత్యనారాయణ
4.విలయోత్పాతక దూమకేతు వొకడా, గానం.పారుపల్లి సత్యనారాయణ
5.తరుణ నర పాలకులయందు దలపు చోరదు, గానం.పి.శాంతకుమారి
6.ప్రసవ గర్భమునను భావిఫలము పోల్కి, గానం.పారుపల్లి సత్యనారాయణ
7.మమత లెడియని దాంపత్య మధుర వృత్తి, గానం.పి.శాంతకుమారి
మూలాలు
మార్చు. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.