పాలేరు
పాలేరు బోయి భీమన్న రచించిన సాంఘిక నాటకం. దీనిలోని ప్రధాన కథాంశం కుల నిర్మూలన.[1]
కథాంశం
మార్చుసమాజంలో కులం వల్ల గౌరవం పొందుతున్న కుటుంబం నుండి వచ్చిన వనబాల, కులం వల్ల సమాజంలో అవమానాలకు గురౌతున్న వెంకన్న పరస్పరం ప్రేమించుకుంటారు. పాలేరుగా పనిచేయాల్సిన వాడు, అగ్రకులంగా గౌరవ మర్యాదల్ని పొందుతున్న అమ్మాయిని పెండ్లి చేసుకోవాలంటే, ఎన్ని బాధలకు గురికావాల్సివస్తుందో, అన్నింటినీ అగ్రకుల, భూస్వామి కుభేరయ్య వల్ల పాలేరు వెంకన్న ఎదుర్కొంటాడు. చివరికి ‘‘ఉపకారి’’ మాస్టారు సహాయంతో చదువుకుని వెంకటేశ్వరరావుగా గౌరవం పొంది, డిప్యూటీ కలెక్టరుగా ఉన్నతోద్యోగం సాధిస్తాడు. ఉద్యోగిగా తన గ్రామానికే వచ్చి, భూస్వాముల దురాగతాలను చట్టబద్ధంగా అడ్డుకుంటాడు. అస్పృశ్యతను పాటించే వాళ్ళనీ, ప్రోత్సాహించేవాళ్ళనీ నిరోధిస్తాడు. ప్రజాస్యామ్యబద్ధంగా దళితులు తమ హక్కుల్ని సాధించుకోవాలనే అంబేద్కర్ ఆశయాన్ని రచయిత ఈ నాటకం ద్వారా ప్రేరేపించారు .
సమాజంలోని వాళ్ళంతా చెడ్డవాళ్ళే కాదనీ, మంచివాళ్ళూ ఉంటారనేది భీమన్న సాహిత్యంలో కనిపించే ఒక విశిష్ట గుణం. ఈ పాలేరు నాటకంలో వనబాల కూడా అగ్రవర్ణానికి చెందిన కుంటుంబం నుండే వచ్చినా, సంకుచిత మూర్ఖ కులతత్వవాదులు లేని వాళ్ళూ ఉంటారనే మరో పార్శ్వాన్ని కూడా చూపారు. వెంకన్న తండ్రి పుల్లయ్య తన తండ్రి బాటలోనే తానూ పయనించి, తన కొడుకునీ పాలేరుతనానికి పంపుతాడు. అలాంటి సేవ చేయడానికే తాము జన్మించామనే భ్రమను కల్పించి, కొన్ని తరాలుగా కర్మ సిద్ధాంతం పేరుతో దళితుల్ని అగ్రవర్ణ భూస్వాములు వంచించిన తీరుతెన్నుల్ని ఈ నాటకం ద్వారా వివరించారు.
పాత్రలు
మార్చు- వెంకన్న - వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి
- వనబాల - అగ్రకులానికి చెందిన వనిత
- కుభేరయ్య - భూస్వామి
- పుల్లయ్య - వెంకన్న తండ్రి
మూలాలు
మార్చు- ↑ "అక్షరాంగణంలో 'భీమ'బలుడు!". www.teluguvelugu.in. Retrieved 2020-12-15.[permanent dead link]
బాహ్య లంకెలు
మార్చు- "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2021-06-21. Retrieved 2020-12-15.