పింగళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల

తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లాలోని వడ్డేపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల.

పింగళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లాలోని వడ్డేపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల. ఈ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి.[1]

పింగళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
నినాదంఎంటర్ టు లెర్న్ - లీవ్ టు సర్వ్
రకంప్రభుత్వ డిగ్రీ కళాశాల
స్థాపితం1965
ప్రధానాధ్యాపకుడుజి. రాజారెడ్డి
స్థానంవడ్డేపల్లి, హన్మకొండ జిల్లా, తెలంగాణ, భారతదేశం
18°00′02″N 79°31′49″E / 18.000476°N 79.530299°E / 18.000476; 79.530299
కాంపస్పట్టణ
అనుబంధాలుకాకతీయ విశ్వవిద్యాలయం

చరిత్ర

మార్చు

నిజాం రాజవంశంలో ప్రధాన మంత్రిగా పనిచేసిన పింగళి వెంకట్రామా రెడ్డి, అతని ఇద్దరు సోదరులు పింగళి కృష్ణారెడ్డి, పింగళి రంగారెడ్డి ఉన్నత విద్యా సంస్థను స్థాపించడానికి భవనాన్ని, భూమిని 1965 ఆగస్టు 16న ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు.[2] 67 మంది విద్యార్థులు, పదకొండు మంది సిబ్బందితో ఇంగ్లీష్, తెలుగు మాధ్యమంలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ విభాగాలలో ప్రీ-యూనివర్సిటీ కోర్సు (ఇంటర్మీడియట్) తో కళాశాల ప్రారంభించబడింది. 1966-67లో హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఇంగ్లీష్, తెలుగు మాధ్యమంలో డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ కళాశాల 1978లో కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చబడింది. ప్రస్తుతం కళాశాల 17 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులు, ఒక యాడ్ ఆన్ కోర్సు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమాలో యుజిసి స్పాన్సర్ చేస్తుంది. ఈ కళాశాల 2005లో మొదటిసారిగా నాక్ ద్వారా B ++ గ్రేడ్‌తో గుర్తింపు పొందింది. 2011లో B గ్రేడ్‌తో గుర్తింపు పొందింది. 2017లో A గ్రేడ్‌తో గుర్తింపు పొందింది.

ప్రాంగణం

మార్చు

వడ్డేపల్లి చెరువుకు 100 అడుగుల దూరంలో ఈ కళాశాల ఉంది. ఇందులో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు ఉన్నాయి. ఎన్.సి.సి., జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) వంటి కార్యకలాపాలు కూడా ఉన్నాయి.

కోర్సులు

మార్చు

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు:

  • సైన్స్ - బిఎస్సీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, మైక్రోబయాలజీ, బయో టెక్నాలజీ)
  • ఆర్ట్స్ - బిఏ (చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, ఆధునిక భాష, ప్రజా పరిపాలన)
  • కామర్స్ - బికాం (జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్)

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు:

  • సైన్స్ - ఎంఎస్సీ (వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, మైక్రోబయాలజీ)
  • ఆర్ట్స్ - ఎంఏ (తెలుగు, ఇంగ్లీష్, చరిత్ర)
  • కామర్స్ - ఎంకాం

ఇతర వివరాలు

మార్చు

కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా 2016 జూలై 28న హన్మకొండ సుబేదారిలోని తెలంగాణ అమరుల కీర్తి స్తూపం నుంచి వడ్డేపల్లిలోని కళాశాల వరకు 2కే రన్‌ నిర్వహించబడింది.[3]

ప్రముఖ పూర్వ విద్యార్థులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "CCE::". Ccets.cgg.gov.in. Archived from the original on 2019-01-24. Retrieved 2019-01-23.
  2. "Archived copy". Archived from the original on 10 September 2016. Retrieved 3 July 2016.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "పింగిళి విద్యార్థినుల 2కే రన్‌". Sakshi. 2016-07-29. Archived from the original on 2021-10-12. Retrieved 2021-10-12.
  4. "Contacto". www.pinglegdc.in.[permanent dead link]