పిడుగు హరిప్రసాద్

పిడుగు హరిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు. ఆయనను 2024 జూలై 12న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా జూలై 1న పార్టీ అధిష్టానం ప్రకటించింది.[1]

పిడుగు హరిప్రసాద్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జులై 5 - 2027 మార్చి 29
ముందు మహమ్మద్ ఇక్బాల్
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 1975
ఏలూరు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
నివాసం ఏలూరు

వృత్తి జీవితం

మార్చు

హరిప్రసాద్ జర్నలిస్ట్ గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి ఈనాడు, ఈటీవీ-2లో పనిచేసి ఆ తరువాత మాటీవీలో న్యూస్‌ హెడ్‌గా పనిచేసి ఆ తరువాత అదే ఛానల్‌లో అసోసియేట్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన ఆ తరువాత సీవీఆర్‌ హెల్త్‌ ఛానల్, సీవీఆర్‌ హెల్త్‌ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా, సీవీఆర్‌ న్యూస్‌ టీవీకి కరెంట్‌ అఫైర్స్‌ హెడ్‌గా వివిధ హోదాల్లో పనిచేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

హరిప్రసాద్ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ మీడియా విభాగం అధిపతిగా, [2] పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా 2024 జూలై 12న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా జూలై 1న పార్టీ అధిష్టానం ప్రకటించింది.[3] ఈ ఎన్నికలలో ప్రత్యర్థులుగా ఎవరు పోటీలో లేకపోవడండతో ఆయన కౌన్సిల్​కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[4] పిడుగు హరిప్రసాద్ జనసేన పార్టీ నుండి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికైన తొలి ఎమ్మెల్సీగా రికార్డులకు ఎక్కాడు. ఆయన నవంబర్ 12న శాసనమండలిలో విప్‌గా నియమితుడయ్యాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. "ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే, జనసేనకు ఛాన్స్". 1 July 2024. Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.
  2. The Hindu (7 October 2017). "No room for tainted persons, says JSP" (in Indian English). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  3. Eenadu (2 July 2024). "ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్‌". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  4. "ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం". 5 July 2024. Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  5. Eenadu (13 November 2024). "అసెంబ్లీ చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  6. Andhrajyothy (13 November 2024). "శాసనసభ చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.