పి.లీల
పొరయత్తు లీల (మే 19, 1934 - అక్టోబరు 31, 2005) దక్షిణ భారత నేపథ్యగాయని. మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.[1]
పొరయత్తు లీల | |
---|---|
జననం | పి.లీల 1934 మే 19 కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూర్ |
మరణం | 2005 అక్టోబరు 31 చెన్నై, ఇండియా | (వయసు 71)
వృత్తి | గాయని |
ప్రసిద్ధి | సోలో సింగర్ |
తండ్రి | వి.కె.కన్‌జన్‌మీనన్ |
తల్లి | పొరయాత్ మీనాక్షీ అమ్మ |
జననం
మార్చులీల మే 19, 1934లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూరులో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించింది. తండ్రి వి.కె.కుంజన్ మీనన్ ఎర్నాకుళంలోని రామవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు, తల్లి మీనాక్షి. ముగ్గురు అక్కాచెల్లెల్లలో (శారద, భానుమతి, లీల) లీల చివరిది. ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములో శిక్షణ పొందినది. తండ్రి కుంజన్ మీనన్ కు సంగీతంలో ఉన్న ఆసక్తితో ముగ్గురు కూతుర్లకు సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. సంగీతకారుడు టి.వి.గోపాలకృష్ణన్ పెద్దనాన్న త్రిభువన మణిభాగవతార్ ఈమె మొదటి గురువు. ఈమె తన పదమూడో యేట 1947లో విడుదలైన తమిళ చిత్రము కంకణంతో సినీరంగప్రవేశం చేసింది. ఈమె పాడిన మొదటి పాట హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి స్వరపరిచిన శ్రీ వరలక్ష్మీ.. అంటూ మొదలయ్యే స్త్రోత్రం. ఈ తరువాత తెలుగు, కన్నడ చిత్రాలలో అనేక పాటలు పాడింది. 1948లో విడుదలైన నిర్మల చిత్రముతో లీలకు తొలిసారి తన మాతృభాషైన మలయాళంలో పాడే అవకాశం వచ్చింది. తెలుగులో ఈమె తొలి చిత్రం 1949లో విడుదలైన మన దేశం.
తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీల 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.
తెలుగు సినిమారంగం
మార్చుఈమె 1949 నుండి 1984 వరకు అనేక తెలుగు సినిమాలో పాటలు పాడింది. చిన్నారి పాపలు అనే చిత్రానికి సంగీతాన్ని సమకూర్చింది.[2]
పి.లీల తెలుగు చిత్రాలలో పాడిన సినిమ పాటల పాక్షిక జాబితా:
క్రమ సంఖ్య | సినిమా పేరు | పాట పల్లవి | సహ గాయకుడు/ గాయని | సంగీత దర్శకుడు | గేయ రచయిత | సినిమా విడుదలైన సంవత్సరం |
---|---|---|---|---|---|---|
1 | మనదేశం | బాలత్రిపురసుందరీ | ఘంటసాల | 1949 | ||
2 | కీలుగుర్రం | దిక్కుతెలియదేమిసేతు దేవదేవా కావరావా దిక్కు నీవనుచు నమ్మి | ఘంటసాల | తాపీ ధర్మారావు నాయుడు | 1949 | |
3 | కీలుగుర్రం | నిదురబో నాయన్న నిదురబో నా చిన్న నిదురబో నాయయ్య నిదురబో | ఘంటసాల | తాపీ ధర్మారావు నాయుడు | 1949 | |
4 | గుణసుందరి కథ | ఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా అపరాధములన్ని మరచి | ఓగిరాల రామచంద్రరావు | పింగళి | 1949 | |
5 | గుణసుందరి కథ | ఓ మాతా రావా నా మొరవినవా నీవు వినా దక్కెవరే ఓ రాజరాజేశ్వరి | ఓగిరాల రామచంద్రరావు | పింగళి | 1949 | |
6 | గుణసుందరి కథ | కల్పగమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతిని | ఓగిరాల రామచంద్రరావు | పింగళి | 1949 | |
7 | గుణసుందరి కథ | చిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటే | కస్తూరి శివరావు | ఓగిరాల రామచంద్రరావు | పింగళి | 1949 |
8 | గుణసుందరి కథ | శ్రీతులసి ప్రియతులసి జయమునీయవే జయమునీయవే | ఓగిరాల రామచంద్రరావు | పింగళి | 1949 | |
9 | లైలా మజ్ను | అందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపు | కె.జమునారాణి | సి.ఆర్.సుబ్బరామన్ | సముద్రాల సీనియర్ | 1949 |
10 | శ్రీ లక్ష్మమ్మ కథ | ఇది నా విధికృతమా గతిమాలిన జన్మ యిల బాధలకేనా | సి.ఆర్.సుబ్బరామన్ | 1950 | ||
11 | శ్రీ లక్ష్మమ్మ కథ | చిన్నారి బంగారు చిలకవే నా తల్లి చిగురుమావులలోన | బృందం | సి.ఆర్.సుబ్బరామన్ | 1950 | |
12 | శ్రీ లక్ష్మమ్మ కథ | జీవితమే వృధాయౌనో సుఖించే ఆశలు మాసెనో | బృందం | సి.ఆర్.సుబ్బరామన్ | 1950 | |
13 | అగ్నిపరీక్ష | వసంత రుతువే హాయి మురిపించి మించెనోయి | గాలిపెంచల | కె.జి. శర్మ | 1951 | |
14 | పాతాళ భైరవి | ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో కన్నుకాటు | ఘంటసాల | ఘంటసాల | పింగళి | 1951 |
15 | పాతాళ భైరవి | కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే | ఘంటసాల | ఘంటసాల | పింగళి | 1951 |
16 | పాతాళ భైరవి | తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి వసంత | బృందం | ఘంటసాల | పింగళి | 1951 |
17 | పాతాళ భైరవి | హయిగా మనకింక స్వేచ్ఛగా | ఘంటసాల | ఘంటసాల | పింగళి | 1951 |
18 | సర్వాధికారి | అందాల నారాజు నన్నేలే రతిరాజు ముద్దు మురిపాలు | సుసర్ల దక్షిణామూర్తి | 1951 | ||
19 | చిన్నమ్మ కథ | కనుపించినావు రావో రాకున్న విడువనోయీ | వేలూరు కృష్ణమూర్తి | 1952 | ||
20 | పెళ్ళి చేసి చూడు | ఎవరో ఎవరో ఈ నవనాటక సూత్రధారులు.. ఎవరా ఎవరా | ఘంటసాల | ఘంటసాల | పింగళి | 1952 |
21 | పెళ్ళి చేసి చూడు | ఏడుకొండలవాడా ! వెంకటారమణా! సద్దు శాయక నీవు | ఘంటసాల | పింగళి | 1952 | |
22 | పెళ్ళి చేసి చూడు | ప్రియా ! ప్రియా! హా ప్రియా! ప్రియా యుగ | పిఠాపురం, రామకృష్ణ |
ఘంటసాల | పింగళి | 1952 |
23 | పెళ్ళి చేసి చూడు | మనసా నేనెవరో నీకు తెలుసా నీకు తెలుసా తెలుసా మనసా | ఘంటసాల | పింగళి | 1952 | |
24 | మిస్సమ్మ | ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1955 | |
25 | మిస్సమ్మ | కరుణించు మేరీమాత శరణింక నీవే మేరీమాత | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1955 | |
26 | మిస్సమ్మ | తెలుసుకొనవె చెల్లి అలా నడచుకొనవే చెల్లీ మగవారికి దూరముగా | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1955 | |
27 | మిస్సమ్మ | రాగసుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసా | సి.కృష్ణవేణి | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1955 |
28 | మిస్సమ్మ | రావోయి చందమామ మా వింత గాథ వినుమా | ఎ.ఎం.రాజా | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1955 |
29 | చరణదాసి | ఈ దయ చాలునురా కృష్ణా కాదనకీరా నాకో వరము | ఎస్.రాజేశ్వరరావు | 1956 | ||
30 | చింతామణి | తగునా నను నీట ముంచ తగునా కన్నీట ముంచ తగునా | అద్దేపల్లి రామారావు, టి.వి.రాజు |
1956 | ||
31 | చిరంజీవులు | అల్లవాడే రేపల్లెవాడే అల్లిబిల్లి పిల్లంగొవి | ఘంటసాల బృందం | ఘంటసాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1956 |
32 | చిరంజీవులు | ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక | ఘంటసాల | ఘంటసాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1956 |
33 | చిరంజీవులు | ఏనాటికైనా నీ దాననే ఏనాటికైనా నీ దాననే | ఘంటసాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1956 | |
34 | చిరంజీవులు | కనుపాప కరవైన కనులెందుకో తనవారే పరులైన | ఘంటసాల | ఘంటసాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1956 |
35 | చిరంజీవులు | చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు | ఘంటసాల | ఘంటసాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1956 |
36 | చిరంజీవులు | తెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళి పరుండేవు లేరా | ఘంటసాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1956 | |
37 | భలే రాముడు | ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా చల్లగ రావేలా మెల్లగ రావేల | ఎస్. రాజేశ్వరరావు | సదాశివబ్రహ్మం | 1956 | |
38 | హరిశ్చంద్ర | ఏలమ్మా ఈ వర్షధార లోకమేనిండి కల్లోలమైపోయె ఏలమ్మ | సుసర్ల దక్షిణామూర్తి | జంపన | 1956 | |
39 | దొంగల్లో దొర | విన్నావా చిన్నదాన అదో ఆ దూర తీరాల అనురాగ రాగాల | ఘంటసాల | ఎం.ఎస్.రాజు | నారపరెడ్డి | 1957 |
40 | మాయాబజార్ | చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము | ఘంటసాల | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1957 |
41 | మాయాబజార్ | దయచేయండి దయచేయండి | ఘంటసాల, పి.సుశీల |
ఘంటసాల | పింగళి | 1957 |
42 | మాయాబజార్ | నీకోసమె నే జీవించునది | ఘంటసాల | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1957 |
43 | మాయాబజార్ | నీవేనా నను తలచినది | ఘంటసాల | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1957 |
44 | మాయాబజార్ | లాహిరి లాహిరి లాహిరిలో | ఘంటసాల | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1957 |
45 | మాయాబజార్ | విన్నావటమ్మా ఓ యశోదమ్మా | పి.సుశీల, స్వర్ణలత |
ఘంటసాల | పింగళి | 1957 |
46 | వినాయక చవితి | ఆలించరా మొరాలించరా లాలించి నను పరిపాలించరా | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1957 | |
47 | వినాయక చవితి | తనూవూగే నా మనసూగె నునుతొలకరి మెరపుల తలపులతో | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1957 | |
48 | వినాయక చవితి | రాజా ప్రేమ జూపరా నా పూజల చేకోరా | ఎం.ఎస్.రామారావు బృందం | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1957 |
49 | సతీ అనసూయ | ఓ నాగ దేవతా నా సేవగొని దయసేయుమయా ఓ నాగదేవతా | ఘంటసాల | సముద్రాల జూనియర్ | 1957 | |
50 | సారంగధర | జయ జయ మంగళ గౌరి జయ జయ శంకరి కౌమారి | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1957 | |
51 | శ్రీ రామభక్త హనుమాన్ | పూజా తపముల మరి నేనెరుగ మరి నే నెరుగను హారతి | విజయభాస్కర్ | శ్రీశ్రీ | 1958 | |
52 | అప్పుచేసి పప్పుకూడు | ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెల పై | ఘంటసాల | ఎస్.రాజేశ్వరరావు | పింగళి | 1959 |
53 | పెళ్ళి సందడి | అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా | ఘంటసాల | సముద్రాల జూనియర్ | 1959 | |
54 | సతీ సుకన్య | అందాల సొగసులు చిందెనే కనువిందేనే మది పొంగేనే ఔనే | ఘంటసాల | శ్రీరామచంద్ | 1959 | |
55 | సౌభాగ్యవతి | ముల్లోకములనేలి కరుణించి జ్ఞాన ధనమిచ్చి బ్రోచుదేవీ | పెండ్యాల నాగేశ్వరరావు | శ్రీశ్రీ | 1959 | |
56 | సౌభాగ్యవతి | చేతన్ త్రిశూలమున్ నేత్రాల కరుణయున్ | పెండ్యాల నాగేశ్వరరావు | శ్రీశ్రీ | 1959 | |
57 | సౌభాగ్యవతి | మాతా భవానీ మంగళ గౌరీ శంకరీ | పెండ్యాల నాగేశ్వరరావు | శ్రీశ్రీ | 1959 | |
58 | సౌభాగ్యవతి | నిదురలో మెలుకువలో నిశ్చల దీక్షతో నిన్నే నిరతము కొలిచితినమ్మా | పెండ్యాల నాగేశ్వరరావు | శ్రీశ్రీ | 1959 | |
59 | భక్త రఘునాథ్ | హేశివశంకరా నమ్మినవారి కావగలేవా మమ్మిటుచేయుట న్యాయమా | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1960 | |
60 | మహాకవి కాళిదాసు | రసికరాజమణిరాజిత సభలో యశము గాంచెదవే సోదరి | రత్నం | పెండ్యాల | పింగళి | 1960 |
61 | శాంతి నివాసం | కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే | ఘంటసాల | సముద్రాల జూనియర్ | 1960 | |
62 | శాంతి నివాసం | సెలయేటి జాలులాగ చిందేసే లేడిలాగ సరదాగ గాలిలోన | ఎ.పి.కోమల బృందం | ఘంటసాల | సముద్రాల జూనియర్ | 1960 |
63 | జగదేకవీరుని కథ | జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయీలే హలా | పసుశీల బృందం | పెండ్యాల | పింగళి | 1960 |
64 | ఋష్యశృంగ | ఆనందమీనాడే పరమానంద మీనాడే | టి.వి.రాజు | సముద్రాల జూనియర్ | 1961 | |
65 | సీతారామ కళ్యాణం | ఓ సుకుమారా నినుగని మురిసితిరా నిను వలచేర | ఘంటసాల | గాలిపెంచల | సముద్రాల సీనియర్ | 1961 |
66 | శ్రీకృష్ణ కుచేల | నీ దయ రాదయా ఓ మాధవా కడువేదన పాలైన మాపైన | ఘంటసాల | ఘంటసాల | పాలగుమ్మి పద్మరాజు | 1961 |
67 | గుండమ్మ కథ | వేషము మార్చెనూ భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను | ఘంటసాల | ఘంటసాల | పింగళి | 1962 |
68 | మహామంత్రి తిమ్మరుసు | జయవాణీ చరణకమల సన్నిధి మన సాధన రసికసభా రంజనగా | ఘంటసాల | పెండ్యాల | పింగళి | 1962 |
69 | ఆప్తమిత్రులు | పవనా మదనుడేడా మరలిరాడా తెలుపరా వేగ | ఎ.పి.కోమల | ఘంటసాల | సముద్రాల జూనియర్ | 1963 |
70 | రాణీ సంయుక్త | ఓ వెన్నెలా ఓ వెన్నెలా వేగ మురిపించవా వెన్నెలా | ఘంటసాల | ఎం.రంగారావు | ఆరుద్ర | 1963 |
71 | లవకుశ | జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే | ఘంటసాల, పి.సుశీల, వైదేహి, పద్మామల్లిక్ | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1963 |
72 | లవకుశ | రామకథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే సీతా రామకథను వినరయ్యా | పి.సుశీల | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1963 |
73 | లవకుశ | రామసుగుణధామ రఘువంశ జలధిసోమ సీతామనోభిరామా సాకేత సార్వభౌమ | పి.సుశీల | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1963 |
74 | లవకుశ | లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో | పి.సుశీల | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1963 |
75 | లవకుశ | వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా | పి.సుశీల | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1963 |
76 | లవకుశ | శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతకథ వినుడోయమ్మా | పి.సుశీల | ఘంటసాల | సముద్రాల సీనియర్ | 1963 |
77 | సోమవార వ్రత మహాత్మ్యం | అడిగితినని అలుసా నిన్నడగనులే పోనీ నీ నోటి పసిడి | మాస్టర్ వేణు | నార్ల చిరంజీవి | 1963 | |
78 | పతివ్రత | రావో రాధామోహనా నమ్మినానోయి రాధాకృష్ణా | ఎం.రంగారావు | అనిసెట్టి | 1964 | |
79 | పతివ్రత | నీ చెలికనవో నీ చెలి గనవా చలించవా | మాధవపెద్ది | ఎం.రంగారావు | అనిసెట్టి | 1964 |
80 | పతివ్రత | లేత లేత వయసులో జాతి మేలు కోరుతు దేశభక్తి | బృందం | ఎం.రంగారావు | అనిసెట్టి | 1964 |
81 | పతివ్రత | సా సా సా సా పాడమ్మా .. మోహన మూర్తివి నీవో | పి.బి.శ్రీనివాస్ | ఎం.రంగారావు | అనిసెట్టి | 1964 |
82 | బభ్రువాహన | ఏలరా మనోహరా త్రిలోక మోహనా ఏలరా మనోహరా | పామర్తి | సముద్రాల సీనియర్ | 1964 | |
83 | రహస్యం | శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరిరామాయా సర్వమంగళా | ఘంటసాల | మల్లాది | 1967 | |
84 | శ్రీకృష్ణ మహిమ | కృష్ణా నా ముద్దు కృష్ణా నిదురించు నిర్మలవదనా | ఎ.పి.కోమల | ఘంటసాల | అనిసెట్టి | 1967 |
85 | శ్రీకృష్ణావతారం | విన్నారా విన్నారా వన్నెల కృష్ణుని వరాల పాటలు | బృందం | టి.వి.రాజు | సి.నా.రె. | 1967 |
86 | తారాశశాంకము | నీకే మాకే తగురా మా కౌగిళ్ళలో పస | పి.సుశీల | టి.వి.రాజు | సముద్రాల సీనియర్ | 1969 |
87 | మా ఇలవేల్పు | గౌరీ మాహేశ్వరి మము కన్న తల్లి పరమేశ్వరి | జిక్కి | జి.కె.వెంకటేష్ | సి.నా.రె. | 1971 |
మరణం
మార్చులీల అక్టోబర్ 31 2005 న చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో అస్వస్థతతో చికిత్స పొందుతూ మరణించింది. బాత్రూంలో జారిపడి తలకు దెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చేరిన లీల మొదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు నిర్ధారించారు. దానికై శస్త్రచికిత్స పొంది కోలుకుంటుండగా న్యుమోనియా సోకింది. అంతకు ముందునుండే లీలకు ఆస్థమా వ్యాధి ఉండటం వల్ల పరిస్థితి విషమించింది.[3]
ఈమెకు భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో మరణానంతరం పద్మ భూషణ పురస్కారం బహుకరించింది.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-01-30. Retrieved 2007-04-04.
- ↑ కంపల్లె, రవిచంద్రన్ (2013). జ్ఞాపకాలు (తృతీయ ed.). చెన్నై: కళాతపస్వి క్రియేషన్స్. pp. 131–136.
- ↑ P. Leela's death mourned Archived 2007-06-13 at the Wayback Machine - ది హిందూ, నవంబర్ 1, 2005
బయటి వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)