పెడన పురపాలక సంఘం
పెడన పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం లోని, పెడన శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
పెడన | |
స్థాపన | 1985 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుపెడన పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఇది 1985 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.పురపాలక సంఘం పరిధి 23 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]
జనాభా గణాంకాలు
మార్చు2001 లో 29,612 ఉన్న పట్టణ జనాభా 2011 లో 30,835 కి పెరిగింది. గత దశాబ్దంలో 1.57% పెరిగింది. అక్షరాస్యత రేటు 65.08% ఉండగా పురుష జనాభాలో 69.96%, స్త్రీ జనాభాలో 60.20% అక్షరాస్యులు ఉన్నారు.
ప్రస్తుత చైర్పర్సన్, వైస్ చైర్మన్
మార్చుప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా వెంకట బాబా, [2] వైస్ చైర్మన్‌గా కాశీ పనిచేస్తున్నారు.[2]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- పైడమ్మతల్లి దేవాలయం
- గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వరస్వామివారి దేవాలయం
- శ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం
- భద్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం
ఇతర వివరాలు
మార్చుఈ పురపాలక సంఘం 12.87.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.20 రెవెన్యూ వార్డులు,23 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 26 మురికివాడలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి,18 ప్రభుత్వ పాఠశాలలు, 2 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.