పెద్దపల్లి
?పెద్దపల్లి తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 16°22′29″N 78°24′14″E / 16.3748°N 78.4040°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 26.19 కి.మీ² (10 చ.మై)[1] |
జిల్లా (లు) | పెద్దపల్లి జిల్లా |
జనాభా • జనసాంద్రత |
41,171[2] (2011 నాటికి) • 1,572/కి.మీ² (4,071/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | పెద్దపల్లి పురపాలక సంఘం |
కోడులు • పిన్‌కోడ్ |
• 505172 |
పెద్దపల్లి, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం లోని గ్రామం.[3] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.[4] ఇది పెద్దపల్లి జిల్లాకు ముఖ్య కేంద్రం. 2011లో పెద్దపల్లి పురపాలకసంఘంగా ఏర్పడింది.
కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.
మార్చులోగడ పెద్దపల్లి పట్టణం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెద్దపల్లి మండలాన్ని (1+22) ఇరవై మూడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]
కలక్టరేట్ భవన ప్రారంభం
మార్చుఈ గ్రామంలోని 22 ఎకరాల విస్తీర్ణంలో 48.07 కోట్ల రూపాయలతో ఆరు బ్లాకులు, 98 గదులతో జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. గ్రౌండ్ ఫ్లోర్లో 40, మొదటి అంతస్తులో 29, రెండో అంతస్తులో 29 గదులు నిర్మించిన ఈ భవన సముదాయంలో 41 శాఖలకు చెందిన కార్యాలయాలున్నాయి. 2022, ఆగస్టు 29న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. కలెక్టరేట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంతరం కలెక్టర్ చాంబర్‌లోని సీట్లో కలెక్టర్ సంగీతను కూర్చోబెట్టి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, గిరిజన, బిసీ, మైనారిటీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్, పౌరసరఫరాలు, బిసి వెల్ఫేర్ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ ఎంపీ దీవకొండ దామోదర్‌రావు, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీలు టి. భానుప్రసాదరావు, ఎల్ రమణ, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5][6]
మాతాశిశు కేంద్రం
మార్చుపెద్దపల్లి పట్టణ కేంద్రంలో 18 కోట్ల ఖర్చుతో 100 పడకల సామర్థ్యంతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని 2022 మే 4న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు, సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్సీలు టి. భానుప్రసాద్ రావు, ఎల్.రమణ, పెద్దపల్లి ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, టీఎస్ఎంఎస్ఐడిసి చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7]
మూలాలు
మార్చు- ↑ "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 June 2016. Retrieved 28 June 2016.
- ↑ "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 12, 50. Retrieved 9 June 2016.
- ↑ 3.0 3.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ telugu, NT News (2022-08-29). "పెద్దపల్లి కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-08-29. Retrieved 2022-08-30.
- ↑ Velugu, V6 (2022-08-29). "పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్". V6 Velugu. Archived from the original on 2022-08-30. Retrieved 2022-08-30.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ telugu, NT News (2022-05-04). "ఏ ముఖం పెట్టుకొని రాహుల్ తెలంగాణకు వద్దామనుకుంటున్నాడు : మంత్రి హరీశ్ రావు". Namasthe Telangana. Archived from the original on 2022-05-04. Retrieved 2022-05-04.