పేకాట పాపారావు 1994 లో వై. నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత చిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్, కుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని టి. గోవింద రెడ్డి, పంతంగి పుల్లయ్య, డి. వి. వి. రమణా రెడ్డి కలిసి ఉమామహేశ్వర మూవీస్ పతాకంపై నిర్మించారు. రాజ్ కోటి ఈ సినిమాకు సంగీతం అందించారు.[1]

పేకాట పాపారావు
దర్శకత్వంవై. నాగేశ్వరరావు
నిర్మాతటి. గోవింద రెడ్డి, పంతంగి పుల్లయ్య, డి. వి. వి. రమణా రెడ్డి
తారాగణంరాజేంద్ర ప్రసాద్,
కుష్బూ
సంగీతంరాజ్-కోటి
విడుదల తేదీ
1994
భాషతెలుగు

పేకాట పాపారావుకి పేకాటే సర్వస్వం. ఒకసారి ఉమ అనే యువతి అతన్ని ప్రేమించినట్లు నటిస్తుంది. కానీ పాపారావు ఆమెను నిజంగా ప్రేమించడం మొదలుపెడతాడు. ఉమ ఒక పోలీసు ఆఫీసరు. ఆమె అమ్మాయిలను నమ్మించి మోసంచేసే ఒక మోసగాడి కోసం వెతుకుతుంటుంది. అతని తొడపైన పుట్టుమచ్చ మాత్రమే ఆమెకు తెలిసిన గుర్తు. చివరికి ఆమె శివాజీ అనే అతణ్ణి పట్టుకుంది. దానికి అసలు సూత్రధారి మీసాల గుండయ్య అనే క్లబ్ యజమాని. ఉమ అతన్ని కూడా పట్టుకుంటుంది. కానీ గుండయ్య మాత్రం ఆమె మీద పగ తీర్చుకుంటానని శపథం చేస్తాడు. కొంతకాలం తర్వాత పాపారావు, ఉమ తమ నిజమైన వృత్తి ఒకరినొకరు తెలుసుకోకుండానే కలుసుకుంటారు. ఈ లోపు గుండయ్య పాపారావును జూదం నేరంలో ఇరికిస్తాడు. ఉమ వచ్చి అతన్ని అరెస్టు చేస్తుంది. ఉమ పాపారావును పేకాట జోలికి వెళ్ళవద్దంటుంది. పాపారావు ఆమెను ఉద్యోగం మానేయమంటాడు. ఇద్దరూ కలిసి పందెం వేసుకుంటారు. పాపారావు నెలరోజులపాటు ఆమెను తాకకుండా ఉంటే అతను పందెం గెలిచినట్లు లెక్క, లేకపోతే అతను పేకాట మానేయాలి. గుండయ్య శివాజీ సహాయంతో పాపారావును అప్పుల పాలు జేస్తాడు. నిజం తెలుసుకున్న పాపారావు శివాజీని హత్య చేస్తాడు. కానీ గుండయ్య శివాజీ చనిపోయేలా నాటకం ఆడించాడని తెలుసుకుంటాడు. ఉమ సహాయంతో అతన్ని పట్టుకుని చట్టానికి అప్పగిస్తాడు. చివరికి పాపారావు పేకాట అంటే అయిష్టం పెంచుకుంటాడు. ఇద్దరికీ ఒక అబ్బాయి పుడతాడు. నామకరణ మహోత్సవంలో ఆ అబ్బాయి పేకముక్కలు పట్టుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

తారాగణం

మార్చు
  • పేకాట పాపారావుగా రాజేంద్రప్రసాద్
  • ఉమగా కుష్బూ
  • నీలకంఠంగా బ్రహ్మానందం
  • ఆలీ
  • తనికెళ్ల భరణి
  • గుండు హనుమంతరావు
  • శివాజి రాజా
  • ప్రసన్న కుమార్
  • ఐరన్ లెగ్ శాస్త్రి
  • చిదల అప్పారావు
  • కాదంబరి కిరణ్
  • గాదిరాజు సుబ్బారావు
  • జెన్నీ
  • హరిత
  • చంద్రిక
  • నిర్మల

పాటల జాబితా

మార్చు
  • పేకాట పాపారావు, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • తైలమిస్తా, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. కె ఎస్ చిత్ర
  • ఎదెందురొయ్ రచన: గూడూరు విశ్వనాథ శాస్త్రి గానం..కె ఎస్ చిత్ర
  • పుకారే పుకారే , రచన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ,గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రాధిక
  • ప్రేమ పెట్టండి ,రచనలు: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు,గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర .

మూలాలు

మార్చు
  1. "Pekata Paparao (1994)". Indiancine.ma. Retrieved 2020-07-23.