పొన్ననూనె
పొన్న లేదా పున్నాగ చెట్టును ఆగ్లంలో అలెగ్జండ్రియన్ లారెల్ (Alexandrian laurel) అంటారు. ఈ చెట్టు గట్టిఫెరె కుటుంబానికి చెందిన మొక్క. వృక్షశాస్త్ర నామం:కలొపైల్లం ఇనొపైల్లం (calophyllum inophyllum.linn).సముద్రతీర ప్రాంతాలలో బాగా పెరుగును. ఈ చెట్టు పుట్టుక స్థానం పసిఫిక్,, ఆసియా ఉష్ణవలయ ప్రాంతాలు [1].మలనేశియా (malanesia, పొలినేశియా ( polynesia) ప్రాంతాల్లో కూడా విస్తరించినవి.కొందరి వాదన ప్రకారం ఇదిమొదట ఆఫ్రికా, భారతదేశంలో స్వాభావికంగానే వ్యాపించి ఉంది.ఇక్కడి నుండియే ఇతర దేశాలకు విస్తరణ చెందినది[2] .
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/c/cb/Calophyllum-inophyllum01.jpg/220px-Calophyllum-inophyllum01.jpg)
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/a/aa/Calophyllum-inophyllum03.jpg/220px-Calophyllum-inophyllum03.jpg)
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/5/5c/Starr_010309-0546_Calophyllum_inophyllum.jpg/220px-Starr_010309-0546_Calophyllum_inophyllum.jpg)
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/c/c4/Calophyllum-inophyllum06.jpg/220px-Calophyllum-inophyllum06.jpg)
- హిందీ=సుల్తాన్ చంప (सुलतान चम्पा) (Sultan Champa)
- మరాఠి=సురంగి (सुरंगी) (Surangi)
- సంస్కృతం=నాగ చంప (नाग चम्पा|Nag champa) పున్నాగ (पुन्नाग|Punnaga)
- తమిళం=పున్నై (புன்னை|punnai)
- కన్నడ=పున్నాగ, సురహొన్నె
- మలయాళం=పుమ్మ (pumma)
- మహారాష్ట్ర=ఉండి (Undi)
- బెంగాల్=సుల్తాన్ చంప (सुलतान चम्पा|Sultan Champa)
- ఒరియా=పునాగ్ (poonag)
అవాసం
మార్చుభారతదేశం : ముఖ్యంగా కేరళ తీరప్రాంతంలోను, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిస్సా,, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలలో, అండమాన్ దీవులలో పెరుగును.ఉద్యాన వనాల్లోను, ప్రాంగాణలలో, ఆవరణలలో కూడా పెంచెదరు.
ఇతరదేశాలు :తూర్పుఆఫ్రికా, దక్షిణ ఆసియా, ఇండియా, ఆస్ట్రేలియాసముద్ర తీరభూములు, దక్షిణ పసిఫిక్ సముద్రతటి ప్రాంతాలు[5].
చెట్టు:
సతతహరిత వృక్షం.ఎత్తు 40 అడుగుల వరకుపెరుగును. దట్టంగా, గుబురుగా ఆకులు అల్లుకొనివుండును. చెట్టు 10 సంవత్సరాలకు చేవకు వచ్చును. చెట్టు జీవితకాలం 100 సంవత్సాలు. మంచి ఫలదిగుబడి 20-40 సంవత్సరాల మధ్య ఇచ్చును. చెట్టు కలపను నావల (పడవల) తయారికి, రైల్వే స్లీపరులు చేయుటకు వాడెదరు. అకులను, బెరడును వైద్యపరంగా వినియోగిస్తారు.
పూలు:
మార్చి-ఏప్రిల్ నెలలో పూయును. కొన్నిప్రాంతాలలో చలికాలంలో రెండో కాపుకు వచ్చును.పూలు తెల్లగా, గుత్తులుగావుండి సువాసన వెదజల్లుచుండును.
పళ్ళు :
కొన్నిచోట్ల రెండు కాపులిచ్చును. మొదట మే నుండి నవంబరు వరకు, కొన్నిసందర్భాలలో డిసెంబరు వరకు కాయును. కాయలు ఆకుపచ్చగా, గుండ్రంగా వుండి 2.5 సెం.మీ.ల వ్యాసముండును.కాయ పక్వానికి వచ్చినప్పుడు పసుపు రంగులోకి మారును. తాజాగావున్న (పచ్చి) పెద్దకాయలు 16.6 గ్రాములు, చిన్నకాయలు 9గ్రాం.లుండును. ఎండిన తరువాత పెద్దకాయలు 8 గ్రాం.లు, చిన్నకాయలు 4గ్రాం.లు బరువు తూగును. ఒకచెట్టు ఏడాదికి 50కిలోల వరకు ఎండిన పళ్ళు దిగుబడి ఇచ్చును.
నూనెగింజల సేకరణ:[4]
చెట్ల నుండి పండి నేలరాలిన పళ్ళను,, పొడవాటి కర్రలతో కొట్టిరాల్చి సేకరించెదరు. తాజాపండ్లలో తేమశాతం (60%) వరకుండును.పండ్లను ఎండబెట్టి 50%వరకు తేమతొలగించెదరు.ఎండినపళ్లను తూకంలెక్కన కాకుండగా పండ్లను (లెక్కబెట్టి) సంఖ్యా పరంగా అమ్మకం చేస్తారు.పండ్ల సేకరణ 3నుండి 6 నెలల కాలం పట్టును. ఎండిన నూనెగింజలో విత్తనం (kernel) 43-52%వరకుండును.విత్తనం 1.5 సె.మీ. వ్యాసం కల్గి వుండును. విత్తనంలో 55-73%వరకు నూనె, 25%వరకు తేమ వుండును.
ప్రస్తుతం కేరళలో 7400 టన్నులు, ఒడిస్సాలో 1600 టన్నులు, మధ్యప్రదేశ్‍లో 100టన్నులు ఏడాదికి దిగుబడివచ్చే అవకాశం మెండుగా ఉంది.
నూనెను ఉత్పత్తిచేయుట
మార్చుసేకరించి, ఆరబెట్టిన/ఎండబెట్టిన నూనె గింజలను మల్లెట్‍ల ద్వారా లేదా పొట్టుతీయుయంత్రాల (decorticators) ఆడించి గింజలలోని విత్తనాలను (kernels) ను వేరుచేయుదురు.నూనెగింజలో విత్తనశాతం55-70% వరకుండును[6] . విత్తనాలను గ్రామీణస్దాయిలో నయినచో గానుగ (ghani, మోటారుతో తిరుగు రోటరిలలో, లేదా నూనెతీయు యంత్రాలలో (Expeller) ఆడించి నూనెను సంగ్రహించెదరు. కేకులో మిగిలిన నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంట్ లో ప్రాసెస్ చేసి మిగిలిన నూనెను కూడా తీయుదురు.
నూనె స్వభావం-లక్షణాలు
మార్చుపొన్ననూనెను వాడటం వలన ఆరోగ్యం, చర్మం, జుట్టుకి ఉపయోగాలు ఉండును[7] మార్కెట్‍లో దొంబ (domba, లారెల్‍నట్ ఆయిల్ (Laurel nutoil, దిల్లో (Dillo, పిన్నే (pinnay, ఫోన్ నూనె (poonseed oil, అని పలుపేర్లతో పిలుస్తారు.ఆకుపచ్చ, పసుపులమిళితవర్ణం కలిగి, ఘాటైనవాసన కల్గివుండును., నూనెస్ధిగ్నత (viscosity) కూడా మిగతానూనెలకన్న అధికం. రుచికూడా వెగటుగా వుండును. ఈ నూనె వంటనూనె/ఖాద్యతైలంగా పనికిరాదు. నూనెలో ఇనొఫిల్లిక్ ఆమ్లం (Inophyllic acid, ఇనొఫిల్లొలైడ్ (inophyllolide) లు వువన్నాయి. ఇవి విషగుణం (Toxic) కలిగి వుండటం వలన ఆహరయోగ్యంకాదు. పారిశ్రామిక వినియోగం ఉంది.
పొన్ననూనె భౌతిక లక్షణాలపట్టిక
భౌతిక లక్షణాలు | మితి |
వక్రీభవన సూచిక 300Cవద్ద | 1.460-1.470 |
ఐయోడిన్ విలువ | 79-98 |
సపనిఫికెసను విలువ | 190-205 |
అన్‌సఫొనిపియబుల్ పదార్థం | 1.5% గరిష్ఠం |
ఆమ్ల విలువ | 20-40 |
తేమశాతం | 0.5% గరిష్ఠం |
- ఐయోడిన్‌విలువ:ప్రయోగశాలలో 100గ్రాములనూనెచే గ్రహింపబడు ఐయొడిన్‌గ్రాములసంఖ్య.ప్రయోగసమయంలో ఫ్యాటిఆసిడుల ద్విబంధమున్న కార్బనులతో ఐయోడిను సంయోగంచెంది, ద్విబంధాలను తొలగించును.ఐయోడిమ్ విలువ అసంతృప్తఫ్యాటిఆసిడ్‌లు ఏమేరకు నూనెలో వున్నది తెలుపును.
- సపొనిఫికెసను విలువ: ఒకగ్రాము నూనెలోని ఫ్యాటిఆసిడులను సబ్బుగా (saponification) మార్చుటకు కావలసిన పోటాషియంహైదృఆక్సైడ్, మి. గ్రాంలలో.
- అన్‌సపొనిఫియబుల్‌మేటరు:పోటాషియం హైడ్రాక్సైడుతో సపొనిఫికెసను చెందని నూనెలో వుండు పదార్థంలు.ఇవి అలిపాటిక్‌ఆల్కహల్‌లు, స్టెరొలులు, హైడ్రొకార్బనులు, రంగునిచ్చు పదార్థములు (pigments, రెసినులు.
పొన్ననూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం
ఫ్యాటి ఆమ్లాలు | శాతం |
పామిటిక్ ఆమ్లం | 14.8-18.5 |
స్టియరిక్ ఆమ్లం | 6.0-9.0 |
ఒలిక్ ఆమ్లం | 36-53 |
లినొలిక్ ఆమ్లం | 16-29 |
యురిసిక్ ఆమ్లం | 2.5-3.5 |
- నూనె ఆహర యోగ్యంకాదు.
- సబ్బుల తయారికి ఎంతో ఉపయుక్తమైన నూనె
- మర్ధన మందునూనె (medicinal oils) లతయారిలో ఉపయోగిస్తారు.
- పడవల/నావల చెక్కభాగాలు పాడవ్వకుండ వుండుటకై పైపూత (coating) గా ఉపయోగిస్తారు.
- నూనెలో వుండు కల్లోపైల్లిక్ ఆమ్లం (callophyllic acid,, కల్లోపైల్లొలైడ్ (callophyllolide) లు కుష్టు (Leprosey, క్షయ (tuberculosis) వ్యాధుల చికిత్సకు పనిచేయును. అందుచే ప్రత్యేక పద్ధతుల్లో రిపైనరిచేసిననూనెను పైరోగాలకు మందుగా వినియోగిస్తారు.
- చర్మవ్యాధులకు, కీళ్ళనొప్పుల మందుల తయారిలో కూడా వాడెదరు.
- దీపనూనెగా కూడా వాడెదరు.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-12. Retrieved 2013-10-13.
- ↑ http://www.jeannerose.net/articles/calophyllum.html/by[permanent dead link] Jeanne Rose
- ↑ http://www.flowersofindia.net/catalog/slides/Sultan%20Champa.html
- ↑ 4.0 4.1 SEA.2009.By The Solvent Extractors Association Of India
- ↑ http://agroforestry.net/tti/Calophyllum-kamani.pdf
- ↑ http://agroforestry.net/scps/Tamanu_specialty_crop.pdf
- ↑ http://www.beautyepic.com/tamanu-oil-benefits
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-11-11. Retrieved 2013-10-13.
- ↑ http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3249923/