పోఖ్రాన్
?పోఖ్రాన్ రాజస్థాన్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 26°55′N 71°55′E / 26.92°N 71.92°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 233 మీ (764 అడుగులు) |
జిల్లా (లు) | జైసల్మేర్ జిల్లా జిల్లా |
జనాభా | 19,186 (2001 నాటికి) |
పోఖ్రాన్ లేదా పోకరాన్, రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా లోని, ఒక పట్టణం, పురపాలక సంఘం . ఇది థార్ ఎడారి ప్రాంతంలో ఉంది. భారత్ తన మొదటి అణుపరీక్ష ఇక్కడనే చేపట్టింది.
భూగోళికం
మార్చుపోఖ్రాన్ 26°55′N 71°55′E / 26.92°N 71.92°E న ఉంది.[1] దీని సరాసరి ఎత్తు 233 మీటరులు (764 అడుగులు) రాళ్ళతో చుట్టబడిన ఇసుక ప్రాంతం. పోఖ్రాన్ అనగా 'ఐదు ఎండమావులు'. జోధ్‌పూరు నుండి జైసల్మేరు, బికనేరు నుండి జైసల్మేరు పోయే మార్గం మధ్యన పోఖ్రాన్ ఉంది.
జనగణన
మార్చు2001 గణాంకాల ప్రకారం,[2] పోఖ్రాన్ పట్టణ జనాభా 19,186,అందులో పురుషులు 55%, స్త్రీలు 45%. అక్షరాస్యత సరాసరి 56%, జాతీయ సరాసరి 59.5% కంటే తక్కువగా ఉంది. అక్షరాస్యత పురుషులలో 68%, స్త్రీలలో 41%. పోఖ్రాన్ లో 19% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారు ఉన్నారు.
అణు పరీక్ష ప్రదేశం
మార్చు1972 సెప్టెంబరు 7 న, పోఖ్రాన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ భాభా అణు పరిశోధనా సంస్థ (B.A.R.C) ట్రాంబేకు, భారత్ లో తయారైన అణు పరికరాన్ని పరీక్ష చేయడానికి అధికారాలు ఇచ్చింది. మే 18 1974 న భారత్ తన మొదటి అణుపరీక్ష చేపట్టింది. 1998 మే 11 నుండి మే 13 వరకు ఐదు అణుపరీక్షలు చేపట్టింది. ఆ తరువాత పరీక్షలకు నిషేధం ప్రకటించింది.
మూలాలు
మార్చు- ↑ "Falling Rain Genomics, Inc. - Map and weather data for Pokhran".
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.