పోర్చుగల్‌లో హిందూమతం

పోర్చుగల్‌లో హిందూమతం అభ్యాసానికి చాలా తక్కువ చరిత్ర ఉంది. ప్రస్తుతం దాదాపు 9,000 మంది గల హిందూ సమాజం ఉంది. వీరిలో ఎక్కువ మంది పోర్చుగీస్ వలసలైన మొజాంబిక్, డయ్యూ, డామన్, గోవా మొదలైన చోట్ల నుండి వలస వచ్చిన వారే. [1]

లిస్బన్‌లో రథంపై దేవుని ఊరేగింపు

1990ల మధ్య నుండి పోర్చుగల్‌కు నేపాల్ మూలానికి చెందిన హిందువులు వలస వచ్చారు. అలాగే 1990ల నుండి లిస్బన్‌లో ఒక చిన్న హరే కృష్ణ కమ్యూనిటీ ఏర్పడింది. ఇందులో ప్రధానంగా పోర్చుగీస్ మూలానికి చెందిన కాకేసియన్‌లు ఉన్నారు. వాళ్ళే కాక, బ్రెజిల్ నుండి, ఇతర యూరోపియన్ దేశాల నుండీ వచ్చినవారు కూడా ఉన్నారు.

లిస్బన్ లోని భారతీయ ఎంబసీ ప్రకారం పోర్చుగల్ లోని హిందువులలో గుజరాతీయులు, పంజాబీలు, గోవన్లు ప్రముఖంగా ఉన్నారు. హిందువులలో ఎక్కువ మంది రాజధాని నగరం లిస్బన్‌లో నివసిస్తున్నారు. అయితే ఒపోర్టోలో కూడా కొన్ని హిందూ-గుజరాతీ కుటుంబాలు నివసిస్తున్నాయి.

పోర్చుగల్‌లోని హిందూ సమూహాలు

మార్చు

గుజరాతీలు వలస పాలనలో ఉన్న మొజాంబిక్‌కు తరలివెళ్లారు. 1974లో ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారిలో కొందరు పోర్చుగల్‌కు (ముఖ్యంగా లిస్బన్‌కు) తరలివెళ్లారు. 1980ల నుండి, గుజరాతీలు గుజరాత్‌లోని వారి స్వస్థలం నుండి, డయ్యూ ద్వీపం నుండీ నేరుగా పోర్చుగల్‌కు వలస వచ్చారు.

భారత సాయుధ దళాల చర్యతో గోవా, డామాన్ & డయ్యూ విముక్తి పొందిన తరువాత గోవన్లు 1961లో పోర్చుగల్‌కు వలస వచ్చారు. వారు స్వాతంత్ర్యానికి ముందు మొజాంబిక్‌లో ఒక సంఘాన్ని కూడా నిర్మించారు. ఆపై పోర్చుగల్‌కు వెళ్లారు. గోవాలోని మాజీ పోర్చుగీస్ సబ్జెక్ట్‌ల కుటుంబాలకు ఇచ్చిన ఉదారవాద వలస విధానం, పౌరసత్వం పోర్చుగల్‌లో వారి సంఖ్య పెరగడానికి కారణమైంది.

డామన్, డయ్యూ, దాద్రా,నగర్ హవేలీ లకు చెందిన హిందువులు పోర్చుగల్‌లో 1954 1961లో ఆ భూభాగాలను భారత్‌లో విలీనం చేసుకునే కొంచెం ముందు నుండి పోర్చుగల్‌లో ఉన్నారు. పోర్చుగీస్ పాలనలో కాకుండా, బ్రిటిషు వలస పాలనలో ఉన్న పంజాబీలు ఇటీవల పోర్చుగల్‌కు వలసలు ప్రారంభించారు.

పోర్చుగల్‌లోని హిందూ సంస్థ

మార్చు

"హిందూ కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగల్" అనే హిందూ సంస్థను 1982లో స్థాపించారు. [1] . కమ్యూనిడేడ్ హిందూ డి పోర్చుగల్‌కు చెందిన టెంప్లో హిందూ కు చెందిన రాధా కృష్ణ దేవాలయం కూడా ఉంది. ఇది లిస్బన్‌లోని మహాత్మా గాంధీ అలమేడ వద్ద ఉంది. ఇతర సంస్థలు:

  • శివ మందిర్ అసోసియేషన్.
  • BAPS శ్రీ స్వామినారాయణ మందిర్, లిస్బన్
  • ఇస్కాన్ - లిస్బోవా, అసోసియాకో ఇంటర్నేషనల్ పారా ఎ కాన్సైన్సియా డి కృష్ణ.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Portugal". U.S. Department of State.