ప్రదీప్ పురోహిత్

ఒడిశా రాజకీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు

ప్రదీప్ పురోహిత్ (జననం 1964 ఏప్రిల్ 5) ఒడిశాకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బార్‌ఘర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]

ప్రదీప్ పురోహిత్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 4
ముందు సురేష్ పూజారి
నియోజకవర్గం బార్‌ఘర్

ఒడిషా శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2014 – 2019
ముందు బిజయ రంజన్ సింగ్ బరిహా
తరువాత బిజయ రంజన్ సింగ్ బరిహా
నియోజకవర్గం పదంపూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1964 ఏప్రిల్ 5
పైక్మల్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ప్రతిమ పురోహిత్
నివాసం పైక్మల్ , బర్గఢ్ జిల్లా
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

ప్రదీప్ పురోహిత్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో పదంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ పార్టీ అభ్యర్థి బిజయ రంజన్ సింగ్ బరిహాపై 4513 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ప్రదీప్ పురోహిత్ 2019 శాసనసభ ఎన్నికలలో పదంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ పార్టీ అభ్యర్థి బిజయ రంజన్ సింగ్ బరిహా చేతిలో 5734 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బార్‌ఘర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ పార్టీ అభ్యర్థి పరిణిత మిశ్రాపై 2,51,667 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6]

మూలాలు

మార్చు
  1. BJP leaders meet, discuss Odisha's Bijepur, Patkura by-poll strategy
  2. Fight to be tight in Padampur
  3. Bargarh Election Result 2024, Times of India
  4. TV9 Bharatvarsh (5 June 2024). "बारगढ़ लोकसभा सीट पर 251667 वोट से जीते BJP के प्रदीप पुरोहित, जानिए उनके बारे में". Retrieved 4 September 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. India Today (13 July 2024). "Farmer leaders | A harvest of ambitions" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
  6. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.