ఫతేనగర్ (బాలానగర్ మండలం)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం.

ఫతేనగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం.[1] ఈ ప్రాంతంలో అనేక చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇది బేగంపేట విమానాశ్రయం సమీపంలో ఉన్న ఈ ఫతేనగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం పరిధిలోకి వస్తుంది.[2]

ఫతేనగర్
నగర ప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 018
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో సనత్‌నగర్, కైలాష్ నగర్, బాలానగర్, వాల్మీకి నగర్, ఆల్విన్ హౌసింగ్ కాలనీ, జింకలవాడ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఫతేనగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడ ఫతే నగర్ రైల్వే స్టేషను ఉంది.

అభివృద్ధి పనులు

మార్చు

ఫతేనగర్‌ డివిజన్‌లో రూ.2.66 కోట్ల నిధులతో చేయనున్న అభివృద్ధి పనులకు (గౌతంనగర్‌ శ్మశానవాటిక అభివృద్ధికి రూ.1.5 కోట్లు, కార్మికనగర్‌ శ్మశానవాటిక అభివృద్ధికి రూ.75 లక్షలు, వెంకటేశ్వరనగర్‌ ముస్లిం గ్రేవ్‌యార్డ్‌ అభివృద్ధికి రూ.18 లక్షలు) 2022, ఏప్రిల్ 5న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశాడు. రూ.23 లక్షలతో హెచ్‌పీరోడ్డులో అభివృద్ధి పరిచిన శ్మశానవాటికను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో ఫతేనగర్‌ డివిజన్‌ కార్పోరేటర్‌ పండాల సతీశ్‌గౌడ్‌, ఈఈ సత్యనారాయణ, డీఈ శ్రీదేవి, ఏఈ పవన్‌ తదితరులు పాల్గొన్నారు.[4]

మూలాలు

మార్చు
  1. "Archive News". The Hindu. Archived from the original on 2010-10-24. Retrieved 2016-12-01.
  2. "Fatheh Nagar Main Road, Fatehnagar, Begumpet Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  4. telugu, NT News (2022-04-06). "ప్రణాళికాబద్ధంగా వైకుంఠధామాల అభివృద్ధి". Namasthe Telangana. Archived from the original on 2022-04-05. Retrieved 2022-04-05.

వెలుపలి లింకులు

మార్చు