ఫిరోజ్ ఖాన్
ఫిరోజ్ ఖాన్ (1939 సెప్టెంబరు 25 - 2009 ఏప్రిల్ 27), ఒక భారతీయ నటుడు, సినిమా ఎడిటర్, నిర్మాత, దర్శకుడు.[1] భారతీయ చలనచిత్ర రంగంలో ఆయన పలు విభాగాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తన కెరీర్ మొత్తంలో 60కి పైగా చిత్రాలలో నటించాడు. బాలీవుడ్ ప్రముఖ స్టైల్ ఐకాన్‌లలో ఆయన ఒకడు.[2][3] అర్జూ (1965), ఔరత్ (1967), సఫర్ (1970), మేళా (1971), అప్రద్ (1972), ఖోట్టే సిక్కే (1974), కాలా సోనా (1975), ధర్మాత్మ (1975), నాగిన్ (1976), ఖుర్బానీ (1980), జాన్‌బాజ్ (1986), వెల్‌కమ్ (2007) వంటి విజయవంతమైన హిందీ చిత్రాలలో ఆయన తన పాత్రలకు ప్రసిద్ధి చెందాడు.[4][5]
ఫిరోజ్ ఖాన్ | |
---|---|
జననం | జుల్ఫికర్ అలీ షా ఖాన్ 1939 సెప్టెంబరు 25 |
మరణం | 2009 ఏప్రిల్ 27 బెంగళూరు, కర్ణాటక, భారతదేశం | (వయసు 69)
ఇతర పేర్లు | క్లింట్ ఈస్ట్‌వుడ్ ఆఫ్ ఇండియా |
వృత్తి | నటుడు, సినిమా ఎడిటర్, నిర్మాత, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1959–2007 |
జీవిత భాగస్వామి | సుందరి
(m. 1965; div. 1985) |
పిల్లలు | 2, ఫర్దీన్ ఖాన్ తో సహా |
బంధువులు | అబ్బాస్ ఖాన్ (సోదరుడు) అక్బర్ ఖాన్ (సోదరుడు) సుసానే ఖాన్ జాయెద్ ఖాన్ |
పురస్కారాలు | ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (2001) |
1970లో, ఆయన ఆద్మీ ఔర్ ఇన్సాన్ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డును గెలుచుకున్నాడు.[6] 2000లో, ఆయన ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించబడ్డాడు. ఆయన "ది క్లింట్ ఈస్ట్‌వుడ్ ఆఫ్ ది ఈస్ట్" అని పిలువబడ్డాడు.[7]
ప్రారంభ జీవితం
మార్చుఫిరోజ్ ఖాన్ 1939 సెప్టెంబరు 25న బెంగుళూరులో జన్మించాడు. ఆయన తండ్రి ఆఫ్ఘనిస్తాన్‌లోని ఘజనీకి చెందిన సాదిక్ అలీ, కాగా తల్లి ఫాతిమా, ఇరాన్ కు చెందిన పెర్షియన్.[8][9][10][11]
ఆయన బెంగుళూరులోని బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్, సెయింట్ జర్మైన్ హై స్కూల్ లలో చదువుకున్నాడు. అతని సోదరులు షా అబ్బాస్ ఖాన్, షారుక్ షా అలీ ఖాన్, సమీర్ ఖాన్, అక్బర్ ఖాన్. అతని సోదరీమణులు ఖుర్షీద్ షానవర్, దిల్షాద్ బేగం షేక్.[12][13][14][15]
బెంగుళూరులో తన పాఠశాల విద్య తర్వాత, ఆయన బొంబాయి (ప్రస్తుత ముంబై)కి వెళ్ళాడు, అక్కడ అతను 1960లో దీదీలో రెండవ లీడ్ పాత్రతో అరంగేట్రం చేసాడు.[16][17]
కెరీర్
మార్చు1960ల నుండి 1970ల ప్రారంభం వరకు, ఆయన స్టార్‌లెట్‌ల సరసన తక్కువ-బడ్జెట్ థ్రిల్లర్‌లను రూపొందించాడు. 1962లో, ఆయన టార్జాన్ గోస్ టు ఇండియా అనే ఆంగ్ల-భాషా చిత్రంలో సిమి గరేవాల్ సరసన నటించాడు. ఆయన మొదటి పెద్ద హిట్ 1965లో, ఫణి మజుందార్ రూపోందించిన ఊంచే లాగ్ (1965), అందులో ఆయన రాజ్ కుమార్, అశోక్ కుమార్‌ల సరసన నటించాడు. ఆ తర్వాత, ఆయన సామ్సన్, ఏక్ సపేరా ఏక్ లూటేరా, చార్ దర్వేష్ వంటి చిన్న బడ్జెట్ హిట్ చిత్రాలు వచ్చాయి.[18][19] మళ్ళీ, అదే సంవత్సరంలో, సాధన శివదాసాని నటించిన ఆర్జూలో ఆయన త్యాగం చేసే ప్రేమికుడిగా నటించాడు. దీంతో ఆయన ఎ-లిస్ట్ సెకండ్ లీడ్స్ అందుకోవడం ప్రారంభించాడు. ఆద్మీ ఔర్ ఇన్సాన్ (1969) చిత్రానికి, ఆయన సహాయ పాత్రలో ఉత్తమ నటుడిగా తన మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. హిట్ చిత్రాలు సఫర్, ఖోటే సిక్కే, గీతా మేరా నామ్, కాలా సోనా, శంకర్ శంభు, ఉపాస్న (1971), మేళా (1971), నాగిన్ (1976) వంటి వాటిలో ఆయన నటించాడు.
1971లో, ఆయన విజయవంతమైన నిర్మాత, దర్శకుడిగా మారాడు, ఆయన మొదట దర్శకత్వం వహించిన చిత్రం అప్రద్. జర్మనీలో ఆటో రేసింగ్‌ను ప్రదర్శించే మొదటి భారతీయ చిత్రం ఇది. ఇందులో ముంతాజ్ మాధ్వాని అతని సహనటి. ఆయన 1975 చలనచిత్రం ధర్మాత్మకు నటుడు,దర్శకుడు, నిర్మాత గా వ్యవహరించాడు. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో చిత్రీకరించబడిన మొదటి భారతీయ చిత్రం. కాగా, ఆయన నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా అతని మొదటి బ్లాక్‌బస్టర్ హిట్.[20]
ఆయన పంజాబీ చిత్రం భగత్ ధన్నా జట్ (1974)లో కూడా నటించాడు. 1980లో, ఆయన వినోద్ ఖన్నా, జీనత్ అమన్‌లతో కలిసి ఖుర్బానీని నిర్మించాడు, దర్శకత్వం వహించాడు. అందులో ఆయన ఒక పాత్ర కూడా పోషించాడు. ఇది ఆయన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని సాధించింది. దీంతో దిగ్గజ పాకిస్తానీ పాప్ గాయని నజియా హసన్ గాన వృత్తిని ప్రారంభించింది, ఆమె ఇందులో "ఆప్ జైసా కోయి" అనే ఎప్పుడూ గుర్తుండిపోయే పాట పాడింది.[21] 1986లో, ఆయన బాక్సాఫీస్ హిట్ అయిన జాన్‌బాజ్‌కి దర్శకత్వం వహించి, నటించాడు.[22]
1988లో, ఆయన దయావన్‌కి నటుడిగానే కాకుండా దర్శకత్వం వహించాడు. ఇది నాయకన్ అనే భారతీయ తమిళ చిత్రానికి రీమేక్. 1991లో, ఆయన మెహుల్ కుమార్ దర్శకత్వం వహించిన మీట్ మేరే మన్ కే లో నటించాడు. యాల్గార్ (1992) చిత్రానికి దర్శకత్వం వహించి, నటించిన తర్వాత, ఆయన 11 సంవత్సరాల పాటు నటనకు సుదీర్ఘ విరామం తీసుకున్నాడు.
ఆయన తన కుమారుడు ఫర్దీన్ ఖాన్ కెరీర్‌ను 1998 చిత్రం ప్రేమ్ అగ్గన్‌తో ప్రారంభించాడు. 2003లో, ఆయన జనషీన్‌ని నిర్మించి దర్శకత్వం వహించాడు, అతని కుమారుడు ఫర్దీన్‌తో కలిసి కూడా నటించాడు. ఈ చిత్రం 11 సంవత్సరాల తర్వాత అతను తిరిగి నటించడం, దర్శకత్వం వహించిన చివరి చిత్రం.
స్పోర్ట్స్ కార్లే కాకుండా, అతను తన చిత్రాలలో పెర్ఫార్మింగ్ జంతువులను కూడా ఉపయోగించాడు - జనషీన్‌లో చింపాంజీ, సింహాన్ని ఉపయోగించాడు. 2005లో, ఆయన బయటి ప్రొడక్షన్ ఏక్ ఖిలాడీ ఏక్ హసీనాలో మళ్లీ తన కొడుకుతో కలిసి నటించాడు. అతను తన చివరి చిత్రంగా 2007లో హాస్య చిత్రం వెల్‌కమ్‌లో కనిపించాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుఫిరోజ్ ఖాన్ 1965లో సుందరి ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే, వారు 1985లో విడాకులు తీసుకున్నారు.[23] వారికి ఇద్దరు పిల్లలు లైలా ఖాన్ (జననం 1970), ఫర్దీన్ ఖాన్ (జననం 1974). మాజీ బాలీవుడ్ నటి ముంతాజ్ మాధ్వాని కుమార్తె నటాషా మాధ్వానిని ఫర్దీన్ వివాహం చేసుకున్నాడు.[24][25]
మరణం
మార్చుఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఫిరోజ్ ఖాన్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, చివరిదశలో ఫిరోజ్ ఖాన్ కోరికమేరకు ఆయనను బెంగుళూరులోని తన ఫామ్‌హౌస్‌కి తరలించారు. అయితే, ఆయన మరుసటి రోజు 2009 ఏప్రిల్ 27 తెల్లవారుజామున మరణించాడు.[26]
బెంగుళూరులోని హోసూర్ రోడ్ షియా కబ్రిస్తాన్‌లోని తన తల్లి సమాధి దగ్గరే అతన్ని ఖననం చేశారు.[27]
మూలాలు
మార్చు- ↑ Jaskiran Chopra (29 September 2018),"Feroz Khan: From a shy young hero to self-styled cowboy star", DailyO. Retrieved 17 March 2019.
- ↑ "Feroz Khan". The Daily Telegraph. London. 27 April 2009. Archived from the original on 12 January 2022.
..one of Bollywood's biggest stars; with his swagger and tough-guy styling he was compared to American leading men like Clint Eastwood or Steve McQueen.
- ↑ 'Feroz Khan was an Indian style icon' R G Vijayasarathy in Bengaluru, Rediff.com, 27 April 2009.
- ↑ "Feroz Khan Birth Anniversary: A Look at His 5 Superhit Films". 25 September 2020.
- ↑ "Blockbusters Of Twenty-Five Years (1973-1997)". 13 October 2023.
- ↑ Bollywood's style icon Feroz Khan is dead The Economic Times, 27 April 2009
- ↑ "Feroz Khan Death Anniversary: Remembering Bollywood's Clint Eastwood". news18.com. 27 April 2022.
- ↑ "Feroz Khan". Encyclopædia Britannica. Retrieved 2012-11-02.
- ↑ Bharati, Dubey (April 28, 2009). "Feroz Khan". The Times of India. Archived from the original on September 17, 2011. Retrieved 2012-11-02.
- ↑ "Feroz Khan laid to rest in Bangalore". Mangalorean.com. 29 ఏప్రిల్ 2009. Archived from the original on 14 జూలై 2014.
- ↑ "Feroz Khan, Bollywood Actor, Dies at 69". The New York Times. Agence France-Presse. April 29, 2009. Retrieved 2012-08-23.
- ↑ "'I have never known FEAR'". Indian Express. The Indian Express ltd. Retrieved 10 December 2020.
- ↑ "Feroz Khan: 1919-2009". Rediff.com. Retrieved 10 December 2020.
- ↑ "Feroz Khan lived life king size". Times of India. Bennett, Coleman & Co. Ltd. 27 April 2009. Retrieved 10 December 2020.
- ↑ "How a movie star cheated death". Rediff.com. Retrieved 10 December 2020.
- ↑ IANS. "Feroz Khan - Bollywood's all time style icon". India Today (in ఇంగ్లీష్).
- ↑ Farhana, Farhana (25 Sep 2019). "We remember the late actor, Feroz Khan". filmfare.com (in ఇంగ్లీష్).
- ↑ "Review: Blast from the past: Oonche Log (1965)". The Hindu. Chennai, India. 1 May 2009. Archived from the original on 26 May 2009.
- ↑ Feroz Khan lived life king size The Times of India. 27 April 2009.
- ↑ Feroz Khan was the only man who called me baby: Hema Malini Archived 30 ఏప్రిల్ 2009 at the Wayback Machine, Hindustan Times, 28 April 2009.
- ↑ Feroz Khan lived life king size The Times of India. 27 April 2009.
- ↑ "Far removed from Feroz's films". The Hindu. Chennai, India. 1 December 2003. Archived from the original on 6 December 2003.
- ↑ "Feroz Khan Birth anniversary: Lesser-known facts about the legendary actor". newsd.in. 24 September 2019.
- ↑ Indrani Roy Mitra (12 December 2005). "Mumtaz on Fardeen-Natasha wedding". Rediff.com.
- ↑ Mumtaz Interview: Rajesh Khanna-Anju Mahendroo BREAK-UP | Feroz Khan | Dev Anand యూట్యూబ్లో
- ↑ "Feroze Khan believed in living life king size". Hindustan Times (in ఇంగ్లీష్). hindustantimes.com. 27 April 2009.
- ↑ "Fareed Khan, Zayed Khan and Sanjay Khan at Feroz Khan's funeral". The Times of India.