బెంగుళూరు సిటి రైల్వేస్టేషను

బెంగళూరు రైల్వే స్టేషన్,భారత దేశము
(బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ నుండి దారిమార్పు చెందింది)

బెంగుళూరు సిటి రైల్వేస్టేషను దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉన్న రైల్వేస్టేషను లలో ఒకటి.

బెంగుళూరు సిటి రైల్వేస్టేషను
భారతీయ రైల్వే స్టేషను
General information
Locationరైల్వేస్టేషను రోడ్డు,
పశ్చిమ గుబ్బి తొటదప్ప రోడ్డు,
బెంగుళూరు ,
కర్ణాటక,
భారత్
Coordinates12°58′42″N 77°34′10″E / 12.97833°N 77.56944°E / 12.97833; 77.56944
Owned byభారతీయ రైల్వేలు
Operated bySouth Western Railways
Line(s)చెన్నై సెంట్రల్ - బెంగుళూరు నగర లైన్
Platforms10
Connectionsకెంపెగౌడ బస్టాండ్ నుండి బస్సులు కలవు
Construction
Parkingలభ్యము
Other information
Statusవాడుకలో ఉన్నది
Station codeSBC
జోన్లు South Western Railways
డివిజన్లు బెంగుళూరు
History
Electrifiedఅవును

నేపధ్యము

మార్చు

బెంగళూరు సిటీ రైల్వేస్టేషను‌లో మొత్తం పది ఫ్లాట్‌ఫారాలు ఉన్నాయి.నిత్యం స్టేషను నుంచి వివిధ ప్రాంతాలకు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడి నుంచి రోజూ 28 రైళ్ల సర్వీసులు నడుస్తుంటాయి. కర్ణాటక రాజధానిలో ఎంతో ప్రత్యేకత చాటుకున్న స్టేషను జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. రాకపోకలు సాగించే ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించారు. స్వదేశీ, విదేశీ పర్యాటకులతో పాటు నిత్యం ప్రయాణించేవారు వాటిని పొందవచ్చు. దీంతో కేంద్ర పర్యాటక శాఖ 2014లో జాతీయ ఉత్తమ పర్యాటక స్టేషను పురస్కారాన్ని అందజేసింది. పర్యాటకులకు సమాచారం అందించేందుకు 24 గంటల కేంద్రాలను అందుబాటులో ఉంచారు

విశేశాలు

మార్చు
  • దేశంలోనే తొలిసారి వైద్యశాలను ఏర్పాటు చేసిన ఘనత ఈ రైల్వేస్టేషను‌కు దక్కింది. ఇక్కడ ప్రారంభించిన తరువాత సికింద్రాబాద్ స్టేషను‌లో ఏర్పాటు చేశారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రి సహకారంతో మొదటి ఫ్లాట్‌ఫారంలో ప్రారంభించారు. ప్రయాణికులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే తక్షణం ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడే మందుల దుకాణం ఉంది. ఇవి 24గంటల పాటు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.
  • ప్రయాణికుల రిజర్వేషన్ గురించి తెలుసుకునేందుకు ఫ్లాట్‌ఫారాల్లో డిజిటల్ ప్రదర్శనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. టచ్ స్క్రీన్ ద్వారా రిజర్వేషన్ సమాచారాన్ని పొందవచ్చు. అప్పటికప్పుడు టిక్కెట్ తీసుకుని ప్రయాణించే వారి కోసం ప్రవేశద్వారం వద్ద 12 కౌంటర్లను ఏర్పాటు చేశారు. బయట రిజర్వేషన్ పది కౌంటర్లు ఉన్నాయి.
  • కదిలే మెట్లను (ఎస్కలేటర్లు) మొదటి, ఆరో నెంబరు ఫ్లాట్‌ఫారంలో నిర్మించారు. కొత్తగా రెండు, మూడు, ఎనిమిదో నెంబరు ఫాట్‌ఫారాల్లో ఆధునిక ఎస్కలేటర్ల నిర్మాణం చేపట్టారు. పది ఫ్లాట్‌ఫారాలకు సొరంగ మార్గం ఉంది. ప్రతి చోట లిఫ్ట్‌వసతి కల్పించారు. అలాగే మొదటి ఫ్లాట్‌ఫారంలో వైఫై సౌకర్యం ఉంది. అక్కడ ఉచితంగా ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు.
  • ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్ట్ గ్యాలరీ, కార్టూన్ గ్యాలరీ, పాత వస్తువుల ప్రదర్శనశాలలు ప్రయాణికులు ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, పర్యాటక సంస్థల సమాచార కేంద్రాలు, ఫుడ్ ఫ్లాజాలు, పుస్తక దుకాణాలు, తాజా పండ్లు దొరికే హాప్‌కామ్స్ దుకాణాలు అందుబాటులో ఉంచారు. ప్రయాణికుల కోసం ప్రత్యేకగా పది లక్షల లీటర్ల తాగునీటి ఫ్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బోగీలను శుభ్రపరిచేందుకు మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం ఉంది.

రవాణా సదుపాయాలు

మార్చు

ప్రయాణికుల కోసం బయట ప్రీపెయిడ్ ఆటో, ట్యాక్సీ స్టాండ్లు ఉన్నాయి. కారు, ద్విచక్రవాహనాలకు విశాలమైన పార్కింగ్ వసతి కల్పించారు. స్టేషను లోపల బయట 36 పైగా నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. బీఎంటీసీ బస్టాండు, కెంపేగౌడ కె.ఎస్.ఆర్టీసీ వెళ్లేందుకు ప్రత్యేక దారితో పాటు సొరంగ మార్గం ఉంది. స్టేషను నుంచి బస్టాండుకు ఉచిత బస్సు సేవలను బీఎంటీసీ నిర్వహిస్తుంది. త్వరలో ఆధునిక టిక్కెట్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. బిన్నిమిల్స్‌కు చెందిన 12 ఎకరాల్లో మరో ఆరు ఫ్లాట్‌ఫారాలను నిర్మించనున్నారు. అక్కడ దిగే ప్రయాణికులకు నేరుగా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్టాండు నిర్మించనున్నారు.

దేశంలోనే తొలి వైఫై సౌకర్యం కలిగిన రైల్వేస్టేషను‌గా బెంగళూరు సిటీ స్టేషను‌ రికార్డులకెక్కింది. 2014 లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ వైఫై సేవలను ప్రారంభించారు. స్టేషను‌కు వ చ్చే ప్రయాణికులకు తొలి 30 నిమిషాల పాటు ఉచితంగానే హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు లభించనున్నాయి. ఆ తర్వాత వినియోగించే ఇంటర్నెట్‌కు ప్రయాణికులు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.[1]

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-31. Retrieved 2014-10-29.

మూసలు, వర్గాలు

మార్చు