బ్రియాన్ లారా
1969, మే 2 న జన్మించిన బ్రియాన్ లారా (Brian Charles Lara) వెస్ట్ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్. క్రికెట్ చరిత్రలోనే ప్రముఖ ఆటగాళ్ళలో ఒకడిగా పేరుపొందాడు. లారా పలుసార్లు టెస్ట్ క్రికెట్‌లో టాప్‌ర్యాంక్ సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును సృష్టించడమే కాకుండా టెస్ట్ ఇన్నింగ్సులో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించి ఇందులోనూ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ 501* పరుగులు సాధించి అత్యధిక వ్యక్తిగత స్కోరులో ప్రపంచరికార్డు సృష్టించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బ్రియాన్ చార్లెస్ లారా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | శాంటా క్రజ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో | 1969 మే 2|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 8 అం. (1.73 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Right-arm leg break | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Batsman | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 196) | 1990 డిసెంబరు 6 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2006 నవంబరు 27 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 59) | 1990 నవంబరు 9 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2007 ఏప్రిల్ 21 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 9 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1987–2008 | Trinidad and Tobago | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1992–1993 | Transvaal | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1994–1998 | Warwickshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | Southern Rocks | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2012 ఫిబ్రవరి 4 |
ప్రారంభ జీవితం
మార్చుఆరేళ్ళ ప్రాయంలోనే క్రికెట్ శిక్షణకై లారా తండ్రి స్థానిక హార్వార్డ్ కోచింగ్ క్లినిక్ లో చేర్పించాడు. ఫాతిమా కళాశలలో ఉన్నప్పుడు లారా క్రికెట్ జీవితం ప్రారంభమైంది. 14 సంవత్సరాల వయస్సులో పాఠశాల లీగ్ పోటీలలో పాల్గొని 126.16 సగటుతో 745 పరుగులు చేశాడు. దోంతో ట్రినిడాడ్ తరఫున అండర్-16 టీమ్ లో స్థానం పొందినాడు. 15 సంవత్సరాల వయస్సులోనే వెస్ట్‌ఇండీస్ తరఫున అండర్-19 టీమ్‌లో స్థానం పొందినాడు.
అంతర్జాతీయ క్రికెట్
మార్చుఅంతర్జాతీయ క్రికెట్‌లో బ్రియాన్ లారా స్థానం అత్యున్నతమైంది. టెస్ట్ క్రికెట్‌లోనూ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ ఒక ఇన్నింగ్సులో అత్యధిక స్కోరు సాధించిన రికార్డులు అతని పేరిటే ఊన్నాయి. 1994లో ఇంగ్లాండుపై 375 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించగా, 2003లో దాన్ని మాథ్యూ హెడెన్ 380 పరుగులు చేసి అధికమించాడు. లారా మళ్ళీ 400 పరుగుల ఇన్నింగ్సుతో మరో పర్యాయం ప్రపంచ రికార్డు చేజిక్కించుకున్నాడు. అంతేకాదు డొనాల్డ్ బ్రాడ్‌మెన్ తర్వాత టెస్టులలో 2 ట్రిపుల్ సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్ గాను, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బిల్స్ పాన్స్‌ఫోర్డ్ తర్వాత 2 క్వాడ్రుపుల్ సెంచరీలు (400 కంటే అధికంగా పరుగులు సాధించడం) చేసిన రెండో బ్యాట్స్‌మెన్ గాను అవతరించాడు. టెస్ట్ క్రికెట్ మొత్తంలో 9 డబుల్ సెంచరీలు సాధించి వీటిలో కూడా 12 డబుల్ సెంచరీలు సాధించిన డాన్ బ్రాడ్‌మెన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. 1995లో ఇంగ్లాడుతో జరిగిన టెస్ట్ సీరీస్ లో వరుసగా 3 టెస్టులలో 3 శతకాలు సాధించాడు. 2005 నవంబర్లో ఆస్ట్రేలియాకు చెందిన అలాన్ బోర్డర్ అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును కూడా అధికమించి ఇందులోనూ ప్రపంచ రికార్డు సాధించాడు. ఇతడు మూడు పర్యాయాలు వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. మొదటి పర్యాయం 1998లో, రెండో సారి 2003లో, చివరగా 2006 ఏప్రిల్లో శివనారాయణ్ చందర్‌పాల్ రాజీనామాతో నాయకత్వం చేపట్టాడు. 2006 డిసెంబర్ 16న టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగులను పూర్తి చేసి ఈ ఘనత సాధించిన తొలి వెస్ట్‌ఇండీస్ బ్యాట్స్‌మెన్ గా రికార్డు స్థాపించాడు[1]. 2007, ఏప్రిల్ 10న లారా వన్డే క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు [2].
క్రీడాజీవితంలో ముఖ్యసంఘటనలు
మార్చు- తొలి సెంచరీలోనే ఆస్ట్రేలియాపై 277 పరుగులు చేసి తొలి టెస్ట్ సెంచరీ ద్వారా అత్యధిక పరుగులు సాధించిన వారిలో నాలుగవ స్థానంలో ఉన్నాడు [3]
- 8 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్సులలో 7 సెంచరీలు సాధించిన వారిలో ఇతడే ప్రథముడు.
- టెస్ట్ క్రికెట్‌లో 2 ట్రిపుల్ సెంచరీలను, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 2 క్వాడ్రుపుల్ సెంచరీలను సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్.
- 2005, నవంబర్ 26న టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సృష్టించాడు.[4]
- 5 వేర్వేరు సంవత్సరాలలో టెస్టులలో 1000 పరుగులు చొప్పున సాధించిన రెండో బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు.
- అతివేగంగా 11,000 టెస్టు పరుగులు సాధించిన రికార్డు సృష్టించాడు..[5]
- వెస్ట్‌ఇండీస్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్.[6]
- అతను సాధించిన సెంచరీలలో 9 డబుల్ సెంచరీలు. ఈ విషయంలో ఆస్ట్రేలియాకు చెందిన డొనాల్డ్ బ్రాడ్‌మెన్ తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్నాడు.
- టెస్ట్ క్రికెట్ ఆడే అన్ని దేశాలపై సెంచరీలు సాధించాడు.
- వెస్ట్‌ఇండీస్ టీం స్కోరులో 20% పరుగులు సాధించాడు. ఈ విషయంలో డాన్ బ్రాడ్‌మెన్ (23%), జార్జ్ హీడ్లీ (21%) మాత్రమే ఇతనికంటే ముందున్నారు.
- 2001-02 లో శ్రీలంకపై 3 టెస్టుల సీరీస్ లో 688 పరుగులు సాధించాడు. 3 టెస్టుల సీరీస్ లో ఇది రెండో అత్యధిక సీరీస్ స్కోరు. అంతేకాకుండా ఈ సీరీస్ లో వెస్టీండీస్ చేసిన పరుగులలో ఇది 42%.[7]
- 2001-02 శ్రీలంక సీరీస్‌లో ఒకే టెస్టులో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించిన 6 గురు బ్యాట్స్‌మెన్లలో చోటు సంపాదించాడు.[8]
- 164 క్యాచ్‌లు పట్టి అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్లలో ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ వా తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.[9]
అవార్డులు
మార్చుటెస్ట్ సెంచరీలు
మార్చుబ్రియాన్ లారా సాధించిన టెస్ట్ సెంచరీల జాబితా | ||||||
---|---|---|---|---|---|---|
పరుగులు | మ్యాచ్ | ప్రత్యర్థి | వేదిక | సంవత్సరం | ||
[1] | 277 | 5 | ఆస్ట్రేలియా | సిడ్నీ, ఆస్ట్రేలియా | 1993 | |
[2] | 167 | 13 | ఇంగ్లాండు | జార్జ్‌టౌన్, గుయానా | 1993 | |
[3] | 375 | 16 | ఇంగ్లాండు | ఆంటిగ్వా | 1994 | |
[4] | 147 | 21 | న్యూజీలాండ్ | వెల్లింగ్టన్, న్యూజీలాండ్ | 1995 | |
[5] | 145 | 29 | ఇంగ్లాండు | మాంచెస్టర్, ఇంగ్లాండ్ | 1995 | |
[6] | 152 | 30 | ఇంగ్లాండు | నాటింఘామ్, ఇంగ్లాండు | 1995 | |
[7] | 179 | 31 | ఇంగ్లాండు | లండన్, ఇంగ్లాండు | 1995 | |
[8] | 132 | 38 | ఆస్ట్రేలియా | పెర్త్, ఆస్ట్రేలియా | 1997 | |
[9] | 103 | 42 | ఇండియా | ఆంటిగ్వా | 1997 | |
[10] | 115 | 45 | శ్రీలంక | కింగ్స్‌టౌన్, సెయింట్ విన్సెంట్ | 1997 | |
[11] | 213 | 61 | ఆస్ట్రేలియా | కింగ్‌స్టన్, జమైకా | 1999 | |
[12] | 153* | 62 | ఆస్ట్రేలియా | బ్రిడ్జిటౌన్, బార్బడస్ | 1999 | |
[13] | 100 | 63 | ఆస్ట్రేలియా | ఆంటిగ్వా | 1999 | |
[14] | 112 | 68 | ఇంగ్లాండు | మాచెస్టర్, ఇంగ్లాండు | 2000 | |
[15] | 182 | 73 | ఆస్ట్రేలియా | అడిలైడ్, ఆస్ట్రేలియా | 2000 | |
[16] | 178 | 81 | శ్రీలంక | గాలె, శ్రీలంక | 2001 | |
[17] | 221 | 83 | శ్రీలంక | కొలంబో, శ్రీలంక | 2001 | |
[18] | 130 | 83 | శ్రీలంక | కొలంబో, శ్రీలంక | 2001 | |
[19] | 110 | 91 | ఆస్ట్రేలియా | జార్జ్‌టౌన్, గుయానా | 2003 | |
[20] | 122 | 92 | ఆస్ట్రేలియా | పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ | 2003 | |
[21] | 209 | 95 | శ్రీలంక | సెయింట్ లూసియా | 2003 | |
[22] | 191 | 98 | జింబాబ్వే | బులావాయో, జింబాబ్వే | 2003 | |
[23] | 202 | 99 | దక్షిణాఫ్రికా | జొహన్నస్‌బర్గ్, దక్షిణాఫ్రికా | 2003 | |
[24] | 115 | 101 | దక్షిణాఫ్రికా | కేప్‌టౌన్, దక్షిణాఫ్రికా | 2004 | |
[25] | 400* | 106 | ఇంగ్లాండు | ఆంటిగ్వా | 2004 | |
[26] | 120 | 108 | బంగ్లాదేశ్ | కింగ్‌స్టన్, జమైకా | 2004 | |
[27] | 196 | 113 | దక్షిణాఫ్రికా | పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ | 2005 | |
[28] | 176 | 114 | దక్షిణాఫ్రికా | బ్రిడ్జ్‌టౌన్, బార్బడస్ | 2005 | |
[29] | 130 | 116 | పాకిస్తాన్ | బ్రిడ్జ్‌టౌన్, బార్బడస్ | 2005 | |
[30] | 153 | 117 | పాకిస్తాన్ | కింగ్‌స్టన్, జమైకా | 2005 | |
[31] | 226 | 121 | ఆస్ట్రేలియా | అడిలైడ్, ఆస్ట్రేలియా | 2005 | |
[32] | 120 | 126 | ఇండియా | సెయింత్ లూసియా | 2006 | |
[33] | 122 | 129 | పాకిస్తాన్ | లాహోర్, పాకిస్తాన్ | 2006 | |
[34] | 216 | 130 | పాకిస్తాన్ | ముల్తాన్, పాకిస్తాన్ | 2006 |
వన్డే సెంచరీలు
మార్చుబ్రియాన్ లారా సాధించిన వన్డే సెంచరీల జాబితా | ||||||
---|---|---|---|---|---|---|
పరుగులు | మ్యాచ్ | ప్రత్యర్థి | వేదిక | సంవత్సరం | ||
[1] | 128 | 41 | పాకిస్తాన్ | డర్బాన్, దక్షిణాఫ్రికా | 1993 | |
[2] | 111* | 42 | దక్షిణాఫ్రికా | బ్లూయెంఫోటీన్, దక్షిణాఫ్రికా | 1993 | |
[3] | 114 | 45 | పాకిస్తాన్ | కింగ్‌స్టన్, జమైకా | 1993 | |
[4] | 153 | 54 | పాకిస్తాన్ | షార్జా, UAE | 1993 | |
[5] | 139 | 83 | ఆస్ట్రేలియా | పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ | 1995 | |
[6] | 169 | 90 | శ్రీలంక | షార్జా, UAE | 1995 | |
[7] | 111 | 96 | దక్షిణాఫ్రికా | కరాచి, పాకిస్తాన్ | 1996 | |
[8] | 146* | 100 | న్యూజీలాండ్ | పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ | 1996 | |
[9] | 104 | 102 | న్యూజీలాండ్ | కింగ్‌స్టన్, సెయింట్ విన్సెంట్ | 1996 | |
[10] | 102 | 108 | ఆస్ట్రేలియా | బ్రిస్బేన్, ఆస్ట్రేలియా | 1997 | |
[11] | 103* | 109 | పాకిస్తాన్ | పెర్త్, ఆస్ట్రేలియా | 1997 | |
[12] | 110 | 125 | ఇంగ్లాండు | బ్రిడ్జిటౌన్, బార్బడస్ | 1998 | |
[13] | 117 | 157 | బంగ్లాదేశ్ | ఢాకా, బంగ్లాదేశ్ | 1999 | |
[14] | 116* | 176 | ఆస్ట్రేలియా | సిడ్నీ, ఆస్ట్రేలియా | 2001 | |
[15] | 111 | 202 | కెన్యా | కొలంబో, Sri Lanka | 2002 | |
[16] | 116 | 203 | దక్షిణాఫ్రికా | కేప్‌టౌన్, దక్షిణాఫ్రికా | 2011 | |
[17] | 116 | 217 | శ్రీలంక | బ్రిడ్జిటౌన్, బార్బడస్ | 2003 | |
[18] | 113 | 219 | జింబాబ్వే | బులావాయో, జింబాబ్వే | 2003 | |
[19] | 156 | 250 | పాకిస్తాన్ | అడిలైడ్, ఆస్ట్రేలియా | 2005 |
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ http://www.howstat.com/cricket/Statistics/Batting/BattingCareerRuns_ODI.asp?Stat=5000 |title= ODI Batting Statistics
- ↑ Lara confirms one-day retirement BBC News retrieved July 30 2007
- ↑ Highest Maiden Tons Stats from CricInfo, retrieved July 30 2007
- ↑ Most Test Runs Stats from CricInfo retrieved July 30 2007
- ↑ Fastest Test Runs Stats from CricInfo retrieved July 30 2007
- ↑ http://www.cricinfo.com/db/STATS/TESTS/BATTING/LEADING_BATSMEN_TEST_100S.html Leading Test Batsmen] Stats from CricInfo retrieved July 30 2007
- ↑ Highest Aggregate runs in series Stats from CricInfo retrieved July 30 2007
- ↑ 100s in each innings Stats from Cric Info retrieved July 30 2007
- ↑ Test Career catces Stats from CricInfo retrieved July 30 2007