భరణి నక్షత్రము
నక్షత్రములలో ఇది రెండవది.
భరణి నక్షత్రజాతకుల తారాఫలాలు
మార్చుతార నామం | తారలు | ఫలం |
---|---|---|
జన్మ తార | భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ | శరీరశ్రమ |
సంపత్తార | కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ | ధన లాభం |
విపత్తార | రోహిణి, హస్త, శ్రవణం | కార్యహాని |
సంపత్తార | మృగశిర, చిత్త, ధనిష్ఠ | క్షేమం |
ప్రత్యక్ తార | ఆర్ద్ర, స్వాతి, శతభిష | ప్రయత్న భంగం |
సాధన తార | పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర | కార్య సిద్ధి, శుభం |
నైత్య తార | పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర | బంధనం |
మిత్ర తార | ఆశ్లేష, జ్యేష్ట, రేవతి | సుఖం |
అతిమిత్ర తార | అశ్విని, మఖ, మూల | సుఖం, లాభం |
నక్షత్రం | అధిపతి | గణము | జాతి | వృక్షం | జంతువు | నాడి | పక్షి | అధిదేవత | రాశి |
---|---|---|---|---|---|---|---|---|---|
భరణి | శుక్రుడు | మానవ | స్త్రీ | దేవదారు | ఏనుగు | మధ్య | కాకి | యముడు | మేషం |
భరణి నక్షత్రము నవాంశ
మార్చు- 1 వ పాదము - mesha rashi
- 2 వ పాదము - కన్యారాశి.
- 3 వ పాదము - mesha rashi
- 4 వ పాదము - వృశ్చికరాశి.
భరణినక్షత్రము గుణగణాలు
మార్చుభరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడూ కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటి వారిని ఎంత గొపాగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించ లేరు. వృద్ధాపయములో సుఖజీవనము చేయడనికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంఘములో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతము అయిన సామానుల అందు ఆసక్తి ప్రదర్శిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము. కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. విరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు.ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది.
- 6, 7, 9
ఫలములు
మార్చు- స్తీసౌఖ్యం/స్తీసౌఖ్యము/స్త్రీసుఖము/స్త్రీసుఖం