భారతదేశంలో మిలియన్-ప్లస్ పట్టణ సముదాయాల జాబితా

భారతదేశంలో మిలియన్-ప్లస్ జనాభా గల పట్టణ సముదాయాల జాబితా

భారతదేశం దక్షిణాసియాలో ఒక దేశం. భౌగోళిక ప్రాంతాల వారీగా ఇది ఏడవ అతిపెద్ద దేశం. 1.2 బిలియన్లకు పైగా జనాభా కలిగిన రెండవ అత్యధిక దేశం. భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు, తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.[1] ప్రపంచ జనాభాలో 17.5 శాతం ఉంది.[2]

ఒక మిలియన్ జనాభాతో భారతదేశంలో పట్టణ సముదాయాలు

1872లో బ్రిటిష్ ఇండియా మొదటి జనాభా గణన జరిగింది. 1951 నుండి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన జరుగుతోంది.[3] భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం భారతదేశంలో జనాభా గణనను నిర్వహిస్తుంది. ప్రభుత్వం నిర్వహించే అతిపెద్ద పరిపాలనా పనులలో ఇదీ ఒకటి.[4]

2011 భారత జనాభా లెక్కల గణాంకాల ప్రకారం ఈ జనాభా గణాంకాలు ఉన్నాయి.[5] భారతదేశంలో 641,000 గ్రామాలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 72.2 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.[5] వాటిలో 145,000 గ్రామాలు 500-999 మంది జనాభా పరిమాణాన్ని కలిగి ఉన్నాయి; 130,000 గ్రామాలలో 1000–1999 మంది; 128,000 గ్రామాలలో 200–499 మంది; 3,961 గ్రామాలలో 10,000 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉన్నారు.[2] భారతదేశం 27.8 పట్టణ జనాభా శాతం 5,100 కంటే ఎక్కువ పట్టణాలు, 380 కి పైగా పట్టణ సముదాయాలలో ఉన్నారు.[6] 1991-2001 దశాబ్దంలో, ప్రధాన నగరాలకు వలసల కారణంగా పట్టణ జనాభాలో వేగం పెరిగింది.[7][8] పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 1991 - 2001 మధ్య 31.2% పెరిగింది.[9] అయినప్పటికీ, 2001 లో 70% పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించారు.[10][11] 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 46 మిలియన్లకు పైగా జనాభా నగరాల్లోనే ఉంది. అందులో ముంబై, ఢిల్లీ, కోల్‌కాతాలలో జనాభా 10 మిలియన్లకు పైగా ఉంది.

2011 నాటికి భారత దేశంలో 1 మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ జనాభా గల 54 పట్టణ సముదాయాలు ఉండగా, 2001లో వాటి సంఖ్య 35గా ఉంది.[12] భారతదేశ పట్టణ జనాభాలో 43 శాతం మంది ఈ నగరాల్లో నివసిస్తున్నారు.[12][13][14]

జాబితా

మార్చు

బోల్డ్‌ అక్షరాలలో జాబితా చేయబడిన నగరాలు సంబంధిత రాష్ట్ర/కేంద్రపాలిత రాజధాని.

ర్యాంకు పట్టణ సముదాయం రాష్ట్రం/కేంద్రపాలితం జనాభా (2011)[15] జనాభా (2001) జనాభా (1991)
1 ముంబై మహారాష్ట్ర 18,394,912 16,434,386 12,596,243
2 ఢిల్లీ ఢిల్లీ 16,349,831 12,877,470 8,419,084
3 కోల్‌కాతా పశ్చిమ బెంగాల్ 14,057,991 13,205,697 11,021,918
4 చెన్నై తమిళనాడు 8,653,521 6,560,242 5,421,985
5 బెంగుళూరు కర్ణాటక 8,520,435 5,701,446 4,130,288
6 హైదరాబాదు తెలంగాణ 7,677,018 5,742,036 4,344,437
7 అహ్మదాబాద్ గుజరాత్ 6,357,693 4,525,013 3,312,216
8 పూణే మహారాష్ట్ర 5,057,709 3,760,636 2,493,987
9 సూరత్ గుజరాత్ 4,591,246 2,811,614 1,518,950
10 జైపూర్ రాజస్థాన్ 3,046,163 2,322,575 1,518,235
11 కాన్పూరు ఉత్తర ప్రదేశ్ 2,920,496 2,715,555 2,029,889
12 లక్నో ఉత్తర ప్రదేశ్ 2,902,920 2,245,509 1,669,204
13 నాగపూర్ మహారాష్ట్ర 2,497,870 2,129,500 1,664,006
14 ఘాజియాబాద్ ఉత్తర ప్రదేశ్ 2,375,820 968,256 511,759
15 ఇండోర్ మధ్య ప్రదేశ్ 2,170,295 1,506,062 1,109,056
16 కోయంబత్తూరు తమిళనాడు 2,136,916 1,461,139 1,100,746
17 కొచ్చి కేరళ 2,119,724 1,355,972 1,140,605
18 పాట్నా బీహార్ 2,049,156 1,697,976 1,099,647
19 కొజికోడ్ కేరళ 2,028,399 880,247 801,190
20 భోపాల్ మధ్యప్రదేశ్ 1,886,100 1,458,416 1,062,771
21 త్రిస్సూరు కేరళ 1,861,269 330,122 275,053
22 వడోదర గుజరాత్ 1,822,221 1,491,045 1,126,824
23 ఆగ్రా ఉత్తర ప్రదేశ్ 1,760,285 1,331,339 948,063
24 విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ 1,728,128 1,345,938 1,057,118
25 మలప్పురం కేరళ 1,699,060 170,409 142,204
26 తిరువనంతపురం కేరళ 1,679,754 889,635 826,225
27 కన్నూర్ కేరళ 1,640,986 498,207 463,962
28 లుధియానా పంజాబ్ 1,618,879 1,398,467 1,042,740
29 నాసిక్ మహారాష్ట్ర 1,561,809 1,152,326 725,341
30 విజయవాడ ఆంధ్రప్రదేశ్ 1,476,931 1,039,518 845,756
31 మదురై తమిళనాడు 1,465,625 1,203,095 1,085,914
32 కాశీ ఉత్తర ప్రదేశ్ 1,432,280 1,203,961 1,030,863
33 మీరట్ ఉత్తర ప్రదేశ్ 1,420,902 1,161,716 849,799
34 ఫరీదాబాద్ హర్యానా 1,414,050 1,055,938 617,717
35 రాజ్‌కోట్ గుజరాత్ 1,390,640 1,003,015 654,490
36 జంషెడ్‌పూర్ జార్ఖండ్ 1,339,438 1,104,713 829,171
37 శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ 1,264,202 988,210
38 జబల్‌పూర్ మధ్య ప్రదేశ్ 1,268,848 1,098,000 888,916
39 అస‌న్‌సోల్ పశ్చిమ బెంగాల్ 1,243,414 1,067,369 763,939
40 వాసై-విరార్ మహారాష్ట్ర 1,222,390 518,601 215,762
41 అలహాబాదు ఉత్తర ప్రదేశ్ 1,212,395 1,042,229 844,546
42 ధన్‌బాద్ జార్ఖండ్ 1,196,214 1,065,327 815,005
43 మైసూరు కర్ణాటక 1,194,356 897,433 791,652
44 ఔరంగాబాద్ మహారాష్ట్ర 1,193,167 892,483 592,709
45 అమృత్‌సర్ పంజాబ్ ప్రాంతం 1,183,549 1,003,919 708,835
46 హుబ్లీ-దార్వాడ్ కర్ణాటక 1,158,214 974,377 816,558
47 జోధ్‌పూర్ రాజస్థాన్ 1,138,300 860,818 666,279
48 రాయ్‌పూర్ ఛత్తీస్‌గఢ్ 1,123,558 700,113 462,694
49 రాంచీ జార్ఖండ్ 1,120,374 863,495 614,795
50 కొల్లాం కేరళ 1,110,668 380,091 362,572
51 గ్వాలియర్ మధ్య ప్రదేశ్ 1,102,884 865,548 717,780
52 భిలాయి ఛత్తీస్‌గఢ్ 1,064,222 927,864 685,474
53 సేలం తమిళనాడు 1,032,336 696,760 499,024
54 చండీగఢ్ చండీగఢ్ 1,026,459 808,515 575,829
55 తిరుచిరాపల్లి తమిళనాడు 1,022,518 866,354 711,862
56 కోట రాజస్థాన్ 1,001,694 703,150 537,371

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "States and union territories". Government of India (2001). Census of India. Archived from the original on 27 January 2011. Retrieved 26 July 2021.
  2. 2.0 2.1 "Area and population". Government of India (2001). Census of India. Archived from the original on 13 November 2013. Retrieved 26 July 2021.
  3. "Census Organisation of India". Government of India (2001). Census of India. Archived from the original on 1 December 2008. Retrieved 26 July 2021.
  4. "Brief history of census". Government of India (2001). Census of India. Archived from the original on 13 November 2013. Retrieved 26 July 2021.
  5. 5.0 5.1 "Census 2011 Provisional Population Totals" (PDF). The Hindu. Chennai, India. Archived (PDF) from the original on 3 November 2013.
  6. "Urban Agglomerations (UAs) & towns". Government of India (2001). Census of India. Archived from the original on 13 November 2013. Retrieved 26 July 2021.
  7. Shinde, Swati (13 September 2008). "Migration rate to city will dip". Times of India. Archived from the original on 11 January 2009. Retrieved 26 July 2021.
  8. "Develop towns to stop migration to urban areas: economist". Chennai, India: Hindu. 3 December 2005. Archived from the original on 5 November 2013. Retrieved 26 July 2021.
  9. Garg 2005.
  10. Dyson & Visaria 2005, pp. 115–129.
  11. Ratna 2007, pp. 271–272.
  12. 12.0 12.1 Rukmini Shrinivasan; Hemali Chhapia. "Delhi topples Mumbai as maximum city". The Times of India. India: The Times Group|Bennett, Coleman & Co. Ltd. Archived from the original on 17 December 2014. Retrieved 26 July 2021.
  13. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Censusindia. The Registrar General & Census Commissioner, India. Archived (PDF) from the original on 13 November 2011. Retrieved 26 July 2021.
  14. "How India's cities have grown and shrunk over the last 116 years". Archived from the original on 6 May 2017.
  15. "India: Major Agglomerations". .citypopulation.de. Archived from the original on 17 December 2014. Retrieved 26 July 2021.

వెలుపలి లంకెలు

మార్చు