భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు
పేరు పుట్టుపూర్వోత్తరాలు : భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు.
- వీటిలో మొదటిది "జంబూ ద్వీపం". ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, శ్రీశైల ఉత్తర భాగే, కృష్ణ గోదావారీ మధ్య స్థానే......). జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు పండుతాయి. కనుక దీనికి ఈ పేరు వచ్చింది.
- ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చింది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె శకుంతలకు జన్మించిన కుమారుడు.
- తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధునది పేరు మీదగా వచ్చింది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధునదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు.
- తరువాత హిందూదేశం రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందింది, ప్రస్తుతం భారత దేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు కలవు, అవి ఇండియా, భారతదేశం. ఇంకా హిందూస్తాన్ అనేది కూడా హిందూ దేశం రూపాంతరమే!
ఇండియా
మార్చుఈ ఆంగ్ల పదం, గ్రీకు పదమైన Ἰνδία, లాటిన్ ద్వారా ఇండియా. Ἰνδία బైజాంటియన్లో సింధూనది (Ἰνδός) కి ఆవల గల రాజ్యం. సా.శ.పూ. 5వ శతాబ్దంలో హెరొడోటస్ పాలిటోనిక్ (ἡ Ἰνδική χώρη) "ఇండియన్ లాండ్" (Indian land), అవెస్తన్ నుండి "హిందుస్" (సింధూ నదిని సూచిస్తుంది) దరాయిస్ 1 (డేరియస్-1) నుండి, సంస్కృతం నుండిసింధు (సింధూనదిని సూచిస్తుంది). ఆఖరుకు సంస్కృత పదం నుండి స్థిరపడింది సింధు, లాటిన్ నుండి ఇండియా, పేర్లు స్థిరపడ్డాయి.[1]
సంస్కృత పదమైన 'ఇందు' చంద్రుడి పేరు సోమతో సంబంధంలేదు.
భారత్
మార్చుభారత్ అనే పేరు [2] భారత రిపబ్లిక్, లోని భారత్ సంస్కృతం నుండి స్వీకరించిన అధికారిక పదం. సంస్కృత పదమైన 'భారత్', 'భారత' అనే పదం నుండి ఉద్భవించింది.
విష్ణు పురాణం (2.3.1) నుండి. [1][2]
- uttaraṃ yatsamudrasya himādreścaiva dakṣiṇam
- varṣaṃ tadbhārataṃ nāma bhāratī yatra santatiḥ
- उत्तरं यत्समुद्रस्य हिमाद्रश्चैव दक्षिणम् ।
- वर्षं तद् भारतं नाम भारती यत्र संततीः ।।
- "వర్షం" (దేశం) సముద్రానికి ఉత్తరాన ఉన్న, హిమములతో కూడిన పర్వతాలకు దక్షిణాన గల, దీనిని భారతం అని, ఇక్కడ భారత సంతతి నివసిస్తుంది."
సంస్కృత సాహిత్యం నుండి తీసుకున్న పేరు, భారత రిపబ్లిక్ ప్రాంతాన్ని, భారతదేశము, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ల కొరకే గాక ఆఫ్ఘనిస్తాన్ లోని అనేక ప్రాంతాల కొరకు ఉపయోగించబడింది. ఈ ప్రాంతం 4-3వ శతాబ్దాలు క్రీ.పూ. మౌర్య సామ్రాజ్యము, మొఘల్ సామ్రాజ్యం, మరాఠా సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం మున్నగు వాటి కొరకు ఉపయోగించబడింది.
అఖండ భారతదేశం అనే పదజాలమునూ సమకాలీన రాజకీయాలలో కానవస్తుంది, దీని ముఖ్య ఉద్దేశం, ఈ ప్రాంతాలన్ని ఏకీకరించి ఒక అఖండ ప్రాంతంగా అభివృద్ధి పరచాలి.
హిందూస్తాన్ , హింద్
మార్చుహింద్ అనే పేరు ఇరానియన్ భాషనుండి ఉద్భవించింది, దీని సమానార్థం ఇండో-ఆర్యన్ సింధ్., అవెస్తన్ -స్థాన్ అనగా దేశం లేదా ప్రాంతం (సంస్కృతంలో 'స్థాన' ప్రదేశం లాగా).
ఇండియాను పర్షియన్ లో హిందుస్తాన్, అరబ్బీ లో అల్-హింద్ (الهند) అని పిలుస్తారు (జై హింద్ లోని 'హింద్' లా).
ఈ 'హింద్', 'హిందుస్తాన్' అనే పేర్లు అరబ్బీ, పర్షియన్ భాషలలో 11వ శతాబ్దం నుండి 'ముస్లింల పరిపాలనా' కాలం నుండి ఉపయోగంలో యున్నది. సల్తనత్, మొఘల్ కాలంనుండి విరివిగా ఉపయోగంలో ఉంది.
'హిందూ' (हिन्दू) అనే సంస్కృత పదం, పర్షియన్ పదం 'హిందూ' అనే పదాలు సమానం.
హింద్ (हिन्द) అనే హిందీ పదం హిందీ-ఉర్దూ భాషలలో ఇప్పటికీ ఉంది. ఇచ్చట చక్కటి విషయమేమంటే, అరబ్బీ, పర్షియన్, సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఈ భాషలలో 'హింద్' అనే పదం సాధారణం. దీని వల్ల గోచరమయ్యే విషయం ఒకటి, ఈ భాషలన్నింటికీ మూలం ఒక్కటేనని, ఈ భాషలు మాట్లాడే వారి పూర్వీకులు ఒక్కరేనని.
ఆర్యదేశం
మార్చుకొన్ని హిందూ గ్రంథాలలో, ఉదాహరణకు మనుస్మృతి, కొన్ని బౌద్ధధర్మ గ్రంథాలు, 'ఆర్యదేశ్' అనే పదము ఉపయోగంలో కానవస్తుంది. భారతదేశాన్ని 'ఆర్యవర్త', 'ఆర్యవర్తం' అని పిలువబడింది. ఆర్య, ఆర్యధర్మ, ఆర్యన్ ఈ పదాలన్నీ ఆర్య తెగ కొరకు ఉపయోగించబడింది. తమిళ కవి తన కవితలో భారతదేశాన్ని ఆర్యనాడు అని సంబోధించాడు.[4] 'ఆర్య' అనగా 'ఉన్నతుడు', 'దేశ' లేదా 'నాడు' అనగా ప్రాంతం.
కొన్ని చారిత్రాత్మక వివరణలు
మార్చుసా.శ. 1500 నకు పూర్వానికి చెందిన కొన్ని చారిత్రక వివరణలు క్రింద ఇవ్వబడినవి.[5]
సంవత్సరం | పేరు | వనరు | వివరణ |
---|---|---|---|
సా.శ.పూ. 486 | హిందుష్ | నఖ్ష్ ఎ రుస్తం | దరాయిస్ డేరియస్ రాజు ఈవిధంగా చెప్పాడు: "'ఓర్మజ్ద్' కృపతో పర్షియాకు ఆవల నేను స్వాధీనపరుచుకున్నాను. నేను నా రాజ్యంలో ఆ ప్రాంతాలను కలుపుకున్నాను. అవి నా సామంతాలయ్యాయి, అవి నేను చెప్పినట్టు వింటున్నాయి. మెడియా.. అరచోటియా (హరౌవాటిష్), సట్టాజిడియా (తటాగుష్), గందారియా (గదార), ఇండియా (హిదుష్) . . ." |
సా.శ.పూ. 440 | ఇండియా | హెరొడోటస్ | "ఇండియాకు తూర్పున ఎడారి ప్రాంతంవుంది. ఇండియన్లు తూర్పు ముఖానికి చాలా దగ్గరగా వున్నారు. సూర్యోదయ ముఖానికి అతిదగ్గరలో వున్నారు. " |
సా.శ.పూ. 300 | ఇండియా/ఇండికే (Indikē) | మెగస్థనీస్ | "ఇండియాకు గల ఎల్లలలో తూర్పు, దక్షిణాన మహాసముద్రం గలదు; ఉత్తరాన పర్వతశ్రేణులు, పశ్చిమాన మహా ప్రాంతం, నైలు నదికి ఆవలి నదుల ప్రాంతం." |
సా.శ.పూ. 140 | ఇండోయి, ఇండౌ | అర్రియన్ | "ఈ ప్రాంతపు ఉత్తర సరిహద్దు టారస్ పర్వతాలు, ఈ టారస్ పర్వతాలెక్కడున్నాయనే చర్చ చాలా జరిగింది. మూలంగా అలెగ్జాండర్ పయనించిన మార్గాలు, గ్రీకుల వ్రాతలను బట్టి గంగానది, దాని ఒడ్డున విలసిల్లిన నగరాలు, వాటి వర్ణనలను పరిశీలించిన పిదప, ఈ ప్రాంతం ఇండోయి, ఇండౌ గా అభివర్ణింపబడినట్లు రుజువౌతుంది." |
సా.శ.320 లేదా ఆతరువాత | భారతం | విష్ణుపురాణం | "उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् ।
वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ।।" |
సా.శ. 590. | హింద్ | ఇస్తఖ్రి | " పర్షియా సముద్రానికి తూర్పున (హిందూ మహాసముద్రం), ఇస్లామీయ దేశాల పశ్చిమం, దక్షిణాన, ఈ ప్రాంతపు ఉత్తరాన చైనా గలదు. ఈ 'హింద్' ప్రాంతపు పొడవు మక్రాన్ నుండి మన్సూరా వరకూ, బోద్ధా, మితగా సింధ్ ప్రాంతం, కనౌజ్ వరకు, టిబెట్ వరకూ, నాలుగు నెలల ప్రయాణం, దీని వెడల్పు కనౌజ్ నుండి హిందూ మహాసముద్రం వరకు మూడు నెలల ప్రయాణం." |
సా.శ. 650 | ఐదు ఇండీస్ | జుఆన్‌జాంగ్ | "ఐదు ఇండీస్ ల చుట్టుకొలత దాదాపు 90,000 లి.; మూడు వైపుల సముద్రం, ఉత్తర భాగాన హిమముతో కూడిన పర్వతాలు. ఉత్తర భాగాన వెడల్పుగాను, దక్షిణ భాగాన సన్నగాను, అగ్రము గాను; దీని ఆకారం అర్ధ చంద్రాకారం." |
సా.శ. 944. | హింద్, సింధ్ | మసూది | "సింధ్ , హింద్ కు చెందిన రాజులు, భాష గురించి చర్చిద్దాం. సింధ్ భాష హింద్ భాషకంటే వేరు. . . ." |
సా.శ. 1020 | హింద్ | అల్ బెరూని | "హింద్ తూర్పున చిన్ , మచిన్, పశ్చిమాన సింధ్ , కాబూల్, , దక్షిణాన సముద్రం."- |
సా.శ. 1205 | హింద్ | హసన్ నిజామీ | "హింద్ కు చెందిన మొత్తం దేశం, ఉత్తరం పెషావర్ నుండి, దక్షిణం హిందూ మహాసముద్రం వరకూ; పశ్చిమాన షెవాన్ (ఇండస్ పశ్చిమ ఒడ్డు) నుండి చైనానుండి వేరు చేసే పర్వతాల వరకు." |
సా.శ. 1298 | ఇండియా ద గ్రేటర్ ఇండియా ద మైనర్ మిడిల్ ఇండియా |
మార్కోపోలో | "గ్రేటర్ ఇండియా, మాబార్ నుండి కెస్మకోరాన్ (కోరమాండల్ నుండి మక్రాన్ వరకు, దీనిలో 13 ప్రసిద్ధ రాజ్యాలున్నాయి, చంపానుండి ముత్ఫిల్ (చైనా నుండి కిస్త్నా డెల్టా వరకు) ఇందులో ప్రసిద్ధమైన 13 రాజ్యాలు గలవు. హబష్ (అబిసీనియా) ఇది మధ్య ఇండియాలో గలదు." |
సా.శ. 1328. | ఇండియా | ఫ్రయర్ జోర్డానస్ | "ఎలా వర్ణించను? ఇండియా యొక్క ప్రాశస్త్యం, వర్ణణాతీతం. కానీ నేను చూడకపోయిననూ ఇండియా ప్రసిద్ధమైనదని చెప్పగలను. . ." |
సా.శ. 1404 | ఇండియా మైనర్ | క్లేవియో | "ఈ గురువారమే, ఒక రాయబారి ప్రసిద్ధమైన నది (ఓక్సస్ నది) వద్దకు వచ్చాడు, వారు ఆవలి ఒడ్డును దాటారు. అదేరోజు... సాయంత్రం 'టెర్మెజ్' నగరానికి విచ్చేశాడు, ఈ ప్రాంతం ఇండియా మైనర్ కు చెందినది, కాని ఇది ఇప్పుడు అది సమర్ఖండ్ కు చెందినది, దీనిని తముర్బెక్ జయించాడు." |
రిపబ్లిక్ ఆఫ్ ఇండియా
మార్చుఅధికారిక నామాలు
మార్చుభారత రాజ్యాంగం లోని మొదటి అధికరణ ప్రకారం అధికారిక నామాలు:
ఎనిమిదవ షెడ్యూల్ లోని భాషల నందు పేర్లు
మార్చుభారత రాజ్యాంగములోని 8వ షెడ్యూల్ లో ప్రస్తావింపబడిన 23 అధికారిక భాషలలో 'భారతదేశం' పేరు ఇలా ఉంది.[6] హిందీ, ఆంగ్లం, భారత అధికారిక భాషలు [7]
భాష | భాషారూపం | సూక్ష్మరూపం |
---|---|---|
అస్సామీ | ভাৰত গণৰাজ্য భారోత్ గొణొరాజ్యో | ভাৰত భారోత్ |
బెంగాలీ | ভারত গণরাজ্য భారోత్ గోనోరాజ్యో | ভারত భారోత్ |
బోడో | ||
డోగ్రి | ||
ఇంగ్లీషు[8] | రిపబ్లిక్ ఆఫ్ ఇండియా (Republic of India) | ఇండియా (India) |
గుజరాతీ | ભારતીય પ્રજાસત્તાક | ભારત |
హిందీ | भारत गणराज्य భారత గణ రాజ్య | भारत భారత్ |
కన్నడ | ಭಾರತ ಗಣರಾಜ್ಯ భారత గణరాజ్య | ಭಾರತ భారత |
కాశ్మీరి | ||
కొంకణి | भारोत गोणराज (భారోత్ గోణరాజ్) | भारोत (భారోత్) |
మైథిలి | ||
మలయాళం | ഭാരതം భారతం | ഭാരതം భారతం |
మణిపురి (, మెయిథీ) | ভারত গণরাজ্য | ভারত |
మరాఠీ | भारतीय प्रजासत्ताक భారతీయ ప్రజాసత్తాక్ | भारत భారత్ |
నేపాలీ | भारत गणराज्य భారత్ గణరాజ్య | भारत భారత్ |
ఒరియా | ଭାରତ భారత | |
పంజాబి | ਭਾਰਤ ਗਣਰਾਜ భారత్ గణరాజ్ ਭਾਰਤ ਗਣਤੰਤਰ భారత్ గణ్‌తంతర్ |
ਭਾਰਤ భారత్ |
సంస్కృతం | भारत गणराज्य భారత గణరాజ్య | भारत భారత |
సంథాలీ | ||
సింధి | ||
తమిళం | பாரத கனரஜ்ய భారత గణరాజ్య | பாரத భారత |
తెలుగు | భారత్ గణరాజ్యం | భారత్ |
ఉర్దూ | جمہوریہ بھارت జమ్‌హూరియత్ ఎ భారత్ | بھارت భారత్ |
ఇతర పేర్లు
మార్చుజంబూద్వీపం
మార్చుహిందూ, జైన, బుద్ధ మత గ్రంథాలలోని అనేక కథలలో జంబూ ద్వీపము అనే ప్రస్తావన కానవస్తుంది. ఈ ద్వీపం 7 దీవుల/ఖండాలలో ఒకటి.[9]
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ India Oxford English Dictionary, 2nd edition: 1989.
- ↑ భారత రాజ్యాంగం లోని మొదటి అధికరణ ప్రకారం: ఇండియా అనబడు భారత్, రాష్ట్రాల సమాఖ్య ,"
- ↑ Reference: "India: The Ancient Past" p.113, Burjor Avari, Routledge, ISBN 0-415-35615-6
- ↑ P. 88 A Comparative Study of Bharati and Vallathol By Cir̲pi
- ↑ "Hobson Jobson Dictionary". Archived from the original on 2012-06-28. Retrieved 2008-06-01.
- ↑ "Eighth Schedule" (PDF). National Informatics Centre. 2007. Archived from the original (PDF) on 2013-10-08. Retrieved 2007-06-26.
- ↑ "The Union: Official Language". National Informatics Centre. 2007. Retrieved 2007-06-24.
- ↑ "CIA Factbook: India". CIA. Archived from the original on 2008-06-11. Retrieved 2007-03-10.
- ↑ "Two Kinds of Faith". Archived from the original on 2007-04-30. Retrieved 2008-06-01.
బయటి లింకులు
మార్చు- The Unity of India Dileep Karanth's article about the terms "Hindu" and "India"
- Meaning of the word Hindu
- Looking for a Hindu Identity Archived 2011-05-15 at the Wayback Machine