భారత రక్షణశాఖ మంత్రి

భారత ప్రభుత్వ రక్షణ శాఖ అధిపతి
(భారత రక్షణశాఖ మంత్రుల జాబితా నుండి దారిమార్పు చెందింది)

భారత రక్షణ శాఖ మంత్రి (రక్షా మంత్రి), భారతదేశ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు ఆధిపతిగా ఉంటాడు. భారతదేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ జాతీయ భద్రత, భారత సాయుధ దళాలకు సంబంధించిన సమాఖ్య విభాగాల అన్ని ఏజెన్సీలు విధులను సమన్వయపరచడం, అతిపెద్ద బడ్జెట్‌తో నిర్వహించడం, సంబంధం కలిగి ఉంటుంది.[1]

భారత రక్షణశాఖ మంత్రి
(భారతదేశ రక్షా మంత్రి)
Incumbent
రాజ్‌నాథ్ సింగ్

since 2019 మే 31
రక్షణ మంత్రి (భారతదేశం) భారత రక్షణ మంత్రి
విధంగౌరవనీయుడు
సభ్యుడుకేంద్ర మంత్రిమండలి
రిపోర్టు టుప్రధానమంత్రి
భారత పార్లమెంటు
నియామకంరాష్ట్రపతి
ప్రధానమంత్రి సలహా మేరకు
కాలవ్యవధి5 సంవత్సరాలు
నిర్మాణం1947 ఆగష్టు 15
మొదట చేపట్టినవ్యక్తిబలదేవ్ సింగ్
ఉపఅజయ్ భట్
రాష్ట్ర మంత్రి

భారత రక్షణ శాఖ మంత్రిని భారత ప్రభుత్వ ఉన్నత స్థాయి మంత్రిగా పరిగణిస్తారు. కేంద్ర మంత్రి మండలిలో, అత్యున్నత స్థాయి మంత్రిగా ఉంటాడు. రక్షణ మంత్రి కార్యాలయం అత్యంత ముఖ్య కార్యాలయం.[2]

నిర్వహణ

మార్చు

రక్షణ మంత్రి అదనంగా ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ అధ్యక్షుడిగా, డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తాడు.[2]

తోడ్పాటు

మార్చు

భారత రక్షణ శాఖ మంత్రికి, రక్షణ శాఖ సహాయ మంత్రి, దిగువ స్థాయి రక్షణ శాఖ సహాయ మంత్రి తగిన మద్దతు, తోడ్పాటు అందిస్తారు.

మొదటి రక్షణ శాఖ మంత్రి

మార్చు

స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రిగా బల్‌దేవ్ సింగ్ పనిచేసాడు. అతను 1947-52 సమయంలో నెహ్రూ మంత్రివర్గంలో పనిచేశాడు.

రక్షణశాఖ మంత్రి పదవి నిర్వహించిన మహిళలు

మార్చు

ఇందిరా గాంధీ భారతదేశ మొట్టమొదటి మహిళా రక్షణ శాఖ మంత్రిగా పనిచేసింది. మహిళలలో నిర్మలా సీతారామన్ రెండవ రక్షణ శాఖ మంత్రిగా 2017 సెప్టెంబరు 4 నుండి 2019 మే 30 వరకు పనిచేసింది.[3][4]

ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తి

మార్చు

2019 మే 30 నుండి భారత రక్షణశాఖ మంత్రిగా రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహణ బాధ్యతలు రాజ్‌నాథ్ సింగ్ నిర్వహిస్తున్నాడు.[4]

రక్షణశాఖ మంత్రుల జాబితా

మార్చు
భారతదేశ రక్షణ మంత్రుల జాబితా
వ.సంఖ్య పేరు
(జననం-మరణం)
చిత్రం పదవీకాలం రాజకీయపార్టీ లేదా
కూటమి
మంత్రివర్గం
పదవీ బాధ్యతలు స్వీకరించింది కార్యాలయం నుండి నిష్క్రమించింది పదవి నిర్వహించిన కాలం
1 బలదేవ్ సింగ్
(1902–1961)
  1947 ఆగష్టు 15 1952 మే 13 4 సంవత్సరాల 272 రోజులు భారత జాతీయ కాంగ్రెస్ 1వ, 2వ నెహ్రూ మంత్రివర్గం
2 ఎన్.గోపాలస్వామి అయ్యంగార్
(1882–1953)
  1952 మే 13 1953 ఫిబ్రవరి 10 273 days 2వ నెహ్రూ మంత్రివర్గం
3 జవాహర్ లాల్ నెహ్రూ
(1889–1964)
  1953 ఫిబ్రవరి 10 1955 జనవరి 10 1 year, 334 days 2వ నెహ్రూ మంత్రివర్గం
4 కైలాష్ నాథ్ కట్జూ
(1887–1968)
  1955 జనవరి 10 1957 జనవరి 30 2 సంవత్సరాల 20 రోజులు 2వ నెహ్రూ మంత్రివర్గం
(3) జవాహర్ లాల్ నెహ్రూ
(1889–1964)
  1957 జనవరి 30 1957 ఏప్రిల్ 17 2 సంవత్సరాల 97 రోజులు 2వ, 3వ నెహ్రూ మంత్రివర్గం
5 వి. కె. కృష్ణ మేనన్
(1896–1974)
  1957 ఏప్రిల్ 17 1962 అక్టోబరు 31 5 సంవత్సరాల 197 రోజులు 3వ, 4వ నెహ్రూ మంత్రివర్గం
(3) జవాహర్ లాల్ నెహ్రూ
(1889–1964)
  1962 అక్టోబరు 31 1962 నవంబరు 14 14 days 4వ నెహ్రూ మంత్రివర్గం
6 యశ్వంత్ రావ్ చవాన్
(1913–1984)
  1962 నవంబరు 14 1966 నవంబరు 13 3 సంవత్సరాల 346 రోజులు 4వ నెహ్రూ మంత్రివర్గం,
1వ నందా మంత్రివర్గం,
శాస్తి మంత్రివర్గం,

2వ నందా మంత్రివర్గం,

1వ ఇందిరా గాంధీ మంత్రివర్గం

7 స్వరణ్ సింగ్
(1907–1994)
1966 నవంబరు 13 1970 జూన్ 27 3 సంవత్సరాల 226 రోజులు 1వ ఇందిరా గాంధీ మంత్రి వర్గం
8 జగ్జీవన్ రాం
(1908–1986)
  1970 జూన్ 27 1974 అక్టోబరు 10 4 సంవత్సరాల 105 రోజులు 1వ, 2వ ఇందిరా గాంధీ మంత్రివర్గం
(7) స్వరణ్ సింగ్
(1907–1994)
1974 అక్టోబరు 10 1975 డిసెంబరు 1 1 సంవత్సరం 52 రోజులు 2వ ఇందిరా గాంధీ మంత్రివర్గం
9 ఇందిరా గాంధీ
(1917–1984)
  1975 డిసెంబరు 1 1975 డిసెంబరు 20 19 days 2వ ఇందిరా గాంధీ మంత్రివర్గం
10 బన్సీలాల్
(1927–2006)
1975 డిసెంబరు 21 1977 మార్చి 24 1 year, 94 days 2వ ఇందిరా గాంధీ మంత్రివర్గం
(8) జగ్జీవన్ రాం
(1908–1986)
  1977 మార్చి 24 1979 జూలై 28 2 సంవత్సరాల 126 రోజులు జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ మంత్రివర్గం
11 సి.సుబ్రమణ్యం
(1910–2000)
  1979 జూలై 28 1980 జనవరి 14 170 days భారత జాతీయ కాంగ్రెస్ (యు) చరణ్ సింగ్ మంత్రివర్గం
(9) ఇందిరా గాంధీ
(1917–1984)
  1980 జనవరి 14 1982 జనవరి 15 2 సంవత్సరాల ఒకరోజు భారత జాతీయ కాంగ్రెస్ 3వ ఇందిరా గాంధీ మంత్రివర్గం
12 రామస్వామి వెంకట్రామన్
(1910–2009)
  1982 జనవరి 15 1984 ఆగష్టు 2 2 సంవత్సరాల 200 రోజులు
13 శంకర్రావ్ చవాన్
(1920–2004)
  1984 ఆగష్టు 2 1984 డిసెంబరు 31 151 days 3వ ఇందిరా గాంధీ మంత్రివర్గం,
రాజీవ్ గాంధీ మంత్రివర్గం
14 పి.వి.నరసింహారావు
(1921–2004)
  1985 జనవరి 1 1985 సెప్టెంబరు 25 267 days రాజీవ్ గాంధీ మంత్రివర్గం
15 రాజీవ్ గాంధీ
(1944–1991)
  1985 సెప్టెంబరు 25 1987 జనవరి 24 269 days
16 విశ్వనాధ్ ప్రతాప్ సింగ్
(1930–2008)
  1987 జనవరి 24 1987 ఏప్రిల్ 12 78 days
17 కె.సి.పంత్
(1931–2012)
  1987 ఏప్రిల్ 13 1989 డిసెంబరు 1 2 సంవత్సరాల 232 రోజులు
(16) విశ్వనాధ్ ప్రతాప్ సింగ్
(1930–2008)
  1989 డిసెంబరు 2 1990 నవంబరు 10 343 days జనతాదళ్
(నేషనల్ ఫ్రంట్)
వి.పి.సింగ్ మంత్రివర్గం
18 చంద్రశేఖర్
(1927–2007)
  1990 నవంబరు 10 1991 జూన్ 21 223 days సమాజ్‌వాది జనతా పార్టీ (రాష్ట్రీయ) చంద్రశేఖర్ మంత్రివర్గం
(14) పి.వి.నరసింహారావు
(1921–2004)
  1991 జూన్ 21 1991 జూన్ 26 5 days భారత జాతీయ కాంగ్రెస్ పి.వి.నరసింహారావు మంత్రివర్గం
19 శరద్ పవార్
(జననం 1940)
  1991 జూన్ 26 1993 మార్చి 6 1 year, 253 days
(14) పి.వి.నరసింహారావు
(1921–2004)
  1993 మార్చి 6 1996 మే 16 3 సంవత్సరాల 171 రోజులు
20 ప్రమోద్ మహాజన్
(1949–2006)
1996 మే 16 1996 జూన్ 1 16 days భారతీయ జనతాపార్టీ 1వ వాజ్‌పేయి మంత్రివర్గం
21 ములాయం సింగ్ యాదవ్
(జననం 1939)
  1996 జూన్ 1 1998 మార్చి 19 1 year, 291 days సమాజవాదీ దేవెగౌడ,
గుజ్రాల్ మంత్రివర్గం
22 జార్జ్ ఫెర్నాండెజ్
(1930–2019)
  1998 మార్చి 19 2001 మార్చి 16 2 సంవత్సరాల

362 రోజులు

సమతాపార్టీ 2వ, 3వ వాజ్‌పేయి మంత్రివర్గం
23 జశ్వంత్ సింగ్
(1938–2020)
  2001 మార్చి 16 2001 అక్టోబరు 21 219 days భారతీయ జనతాపార్టీ 3వ వాజ్‌పేయి మంత్రివర్గం
(22) జార్జ్ ఫెర్నాండెజ్
(1930–2019)
  2001 అక్టోబరు 21 2004 మే 22 2 సంవత్సరాల

214 రోజులు

జనతాదళ్ (యునైటెడ్)
24 ప్రణబ్ ముఖర్జీ
(1935–2020)
  2004 మే 22 2006 అక్టోబరు 26 2 సంవత్సరాల

157 రోజులు

భారత జాతీయ కాంగ్రెస్ 1వ మన్మోహన్ సింగ్ మంత్రివర్గం
25 ఎ.కె.ఆంటోనీ
(జననం 1940)
  2006 అక్టోబరు 26 2014 మే 26 7 సంవత్సరాల

212 రోజులు

1వ, 2వ మన్మోహన్ సింగ్ మంత్రివర్గం
26 అరుణ్ జైట్లీ
(1952–2019)
  2014 మే 26 2014 నవంబరు 9 167 days భారతీయ జనతా పార్టీ 1వ మోడీ మంత్రివర్గం
27 మనోహర్ పారికర్
(1955–2019)
  2014 నవంబరు 9 2017 మార్చి 13 2 సంవత్సరాల

124 రోజులు

(26) అరుణ్ జైట్లీ
(1952–2019)
  2017 మార్చి 13 2017 సెప్టెంబరు 3 174 days
28 నిర్మలా సీతారామన్
(జననం 1959)
  2017 సెప్టెంబరు 3 2019 మే 30 1 సంవత్సరాల

269 రోజులు

29 రాజ్‌నాథ్ సింగ్
(జననం 1951)
  2019 మే 30 ప్రస్తుతం అధికారంలో కొనసాగుచున్న వ్యక్తి - 2 మోడీ మంత్రివర్గం

రాష్ట్ర మంత్రుల జాబితా

మార్చు
రక్షణ మంత్రిత్వ శాఖలో రాష్ట్ర మంత్రులు
వరుస సంఖ్య మంత్రి పేరు చిత్రం రాజకీయ పార్టీ పదవీకాలం పదవినిర్వహించిన కాలం
1 రావ్ ఇంద్రజిత్ సింగ్   భారతీయ జనతా పార్టీ 2014 మే 26 2016 జూలై 5 2 సంవత్సరాల, 40 రోజులు
2 సుభాష్ భామ్రే   2016 జూలై 5 2019 మే 30 2 సంవత్సరాల, 329 రోజులు
3 శ్రీపాద్ నాయక్   2019 మే 30 2021 జూలై 7 2 సంవత్సరాల, 163 రోజులు
4 అజయ్ భట్ 2021 జూలై 7 ప్రస్తుతం ఆధికారంలో

కొనసాగుచున్న వ్యక్తి

3 years, 213 days

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Ministry of Defence". www.mod.gov.in. Retrieved 2021-10-21.
  2. 2.0 2.1 "ABOUT THE MINISTRY | Ministry of Defence". www.mod.gov.in. Retrieved 2021-10-21.
  3. ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నిర్మ‌ల[permanent dead link]|నమస్తే తెలంగాణా
  4. 4.0 4.1 "Ministry of Defence, List of Defence Ministers of India". web.archive.org. 2021-06-29. Archived from the original on 2021-06-29. Retrieved 2021-10-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

మార్చు