భివాని

హర్యానా రాష్ట్రం లోని పట్టణం

భివానీ హర్యానా రాష్ట్రం లోని పట్టణం, భివానీ జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ నగరం ఆధ్యాత్మిక అభ్యాస కేంద్రంగా ఉంది. అంతేకాక ఇది, ప్రాంతీయ రాజకీయాలకు కేంద్రం కూడా. ముగ్గురు మాజీ హర్యానా ముఖ్యమంత్రులు - బన్సీ లాల్, బనార్సీ దాస్ గుప్తా, హుకుమ్ సింగ్ లకు ఇది స్వస్థలం. ఈ పట్టణం దేశ రాజధాని న్యూ ఢిల్లీకి పశ్చిమాన 128 కి.మీ. దూరంలో ఉంది. పట్టణ పాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

భివాని
పట్టణం
భివాని is located in Haryana
భివాని
భివాని
హర్యానాలో పట్టణ స్థానం
Coordinates: 28°47′N 76°08′E / 28.78°N 76.13°E / 28.78; 76.13
దేశం India
రాష్ట్రంహర్యాణా
జిల్లాభివాని
Elevation
225 మీ (738 అ.)
జనాభా
 (2011)
 • Total1,96,057
 • జనసాంద్రత380/కి.మీ2 (1,000/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
127021
టెలిఫోన్ కోడ్91-1664
ISO 3166 codeIN-HR
Vehicle registrationHR-16, HR-61

ఈ నగరంలో సాంప్రదాయిక బాక్సింగ్ పాఠశాల ఉంది. ఇండియన్ బాక్సింగ్ స్క్వాడ్‌లోని సభ్యులు దాదాపుగా అందరూ ఇక్కడి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాస్టల్ నుండే వచ్చారు. దివంగత కెప్టెన్, దిగ్గజ బాక్సర్ హవా సింగ్, భివానీలో బాక్సింగ్ అకాడమీని స్థాపించడానికి తోడ్పడ్డాడు.

చరిత్ర

మార్చు

వ్యుత్పత్తి

మార్చు

భివానీ అనే పేరు భానీ నుండి వచ్చింది. ఈ పట్టణాన్ని నీమ్ సింగ్ అనే రాజపుత్ర రాజు స్థాపించాడు. భాని అనే పేరు గల అతని భార్య, ఒకసారి అతనిపై జరిగిన కుట్ర నుండి అతన్ని రక్షించింది. దాంతో అతను ఈ పట్టణానికి ఆమె పేరు పెట్టాడు. భాని నుండి భియాని అయింది (స్థానికులు ఇప్పటికీ ఇలాగే పలుకుతారు), చివరికి భివాని అయింది. [1] ఇతర మౌఖిక సంప్రదాయాల ప్రకారం పార్వతీదేవికి మరోపేరైన భవానీ నుండి ఈ పేరు వచ్చిందని చెబుతారు. [2] భివానీలో ఎక్కువగా తన్వర్ రాజపుత్రులు ఉన్నారు.

జిల్లా భివానీ హర్యానా పశ్చిమ భాగంలో ఉంది. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లా దీనికి ఒక సరిహద్దుగా ఉంది.

విద్యాసౌకర్యాలు

మార్చు

భివానీలో ఆరు ప్రధాన సంస్థలు ఉన్నాయి, వాటిలో ఒకటి బిర్లా గ్రూప్ స్థాపించిన వస్త్ర పరిశోధన సంస్థ, టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్‌టైల్ & సైన్సెస్ ఒకటి. ఇది దేశంలోని అగ్రగామి, పురాతన సంస్థ. పట్తణంలో నాలుగు డిగ్రీ కళాశాలలు, మూడు ఉపాధ్యాయ విద్యా కళాశాలలు, ఒక నర్సింగ్ పాఠశాల కూడా ఉన్నాయి. బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, హర్యానా (బిఎస్ఇహెచ్) నగరంలో ఉంది. ప్రభుత్వ పిజి కళాశాల హన్సి రోడ్ లో ఉంది. దివంగత చౌధురి బన్సీ లాల్ జ్ఞాపకార్థం భివానిలో చౌధురి బన్సీ లాల్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు

రవాణా

మార్చు

రైల్వేలు

మార్చు

భివానీ రైల్వే జంక్షను భటిండా-రేవారీ మార్గంలో ఉంది. రేవారి వైపు, హిసార్ వైపు, రోహ్తక్ వైపూ వెళ్ళే మూడు రైలు మార్గాలకు భివాని కూడలి. ఈ మూడు మార్గాలూ భివానీ లోనే బయలుదేరుతాయి. రోహ్‌తక్ వైపు వెళ్ళే మూడవ మార్గం ఢిల్లీకి వెళ్తుంది.

రోడ్లు

మార్చు

భివాని నుండి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలకూ రాష్ట్ర రహదారులున్నాయి. భివానీ జిల్లాలో ప్రజా రవాణాకు బస్సు సర్వీసే ప్రధాన సాధనం

భౌగోళికం

మార్చు

భివాని 28°47′N 76°08′E / 28.78°N 76.13°E / 28.78; 76.13 వద్ద, [3] సముద్ర మట్టానికి 225 మీటర్ల ఎత్తున ఉంది. రాష్ట్ర రాజధాని చండీగఢ్ నుండి 285 కి.మీ., దేశ రాజధాని ఢిల్లీ నుండి 124 కి.మీ. దూరంలో ఉంది.

బాక్సింగ్

మార్చు

2008 ఒలింపిక్ హ్రీడల్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఐదుగురు బాక్సర్‌లలో నలుగురు భివానీకి చెందినవారే. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్, రెండుసార్లు ఆసియా గేమ్స్ బంగారు పతక విజేత, 11 సార్లు జాతీయ ఛాంపియన్ అయిన దివంగత కెప్టెన్ హవా సింగ్, భివానీలో బాక్సింగ్ క్లబ్‌కు సహ స్థాపకుడు. కవితా చాహల్ రెండుసార్లు ఐబా ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలుచుకుంది. ఆమె మహిళల జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రికార్డు స్థాపించింది. ఇక్కడి బాక్సింగ్ క్లబ్‌ స్థానికంగా "బిబిసి" పేరుతో ప్రసిద్ధం. [4] [5]

జనాభా

మార్చు

2011 భారత జనగణన ప్రకారం, [6] భివానీ జనాభా 1,96,057. జనాభాలో పురుషులు 54%, స్త్రీలు 46%. భివానీ సగటు అక్షరాస్యత 69%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ; పురుషుల అక్షరాస్యత 76%, స్త్రీల అక్షరాస్యత 62%. జనాభాలో 13% 7 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

పట్టణ ప్రముఖులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 2001 Archived 2019-02-05 at the Wayback Machine, Chapter-V[permanent dead link] of Haryana State Gazetteer Vol-I, Revennue Dept of Haryana, Chapter-V.
  2. "At a glance". haryanatourism.gov.in. Retrieved 2018-04-19.
  3. Falling Rain Genomics, Inc - Bhiwani
  4. Against the Odds: Vijender Kumar, BBC
  5. Martinez, D.P.; Latham, Kevin (2013). Documenting the Beijing Olympics. Routledge. p. 171. ISBN 978-1-317-96575-6.
  6. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
"https://te.wiki.x.io/w/index.php?title=భివాని&oldid=3711511" నుండి వెలికితీశారు