మనోజ్ భీమ్‌రావ్ ఘోర్పడే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కరద్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

మనోజ్ భీమ్‌రావ్ ఘోర్పడే

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 నవంబర్ 23
ముందు శ్యాంరావ్ పాండురంగ్ పాటిల్
నియోజకవర్గం మాన్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు స్వాభిమాని పక్ష
స్వతంత్ర
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

మనోజ్ ఘోర్పడే స్వాభిమాని పక్ష ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కరద్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వాభిమాని పక్ష అభ్యర్థిగా పోటీ చేసి 43,903 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆయన ఆ తరువాత 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి శ్యాంరావ్ పాండురంగ్ పాటిల్ చేతిలో 49,215 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మనోజ్ ఘోర్పడే ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కరద్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి శ్యాంరావ్ పాండురంగ్ పాటిల్ల్‌పై 43691 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. "Karad North assembly constituency result: Meet BJP's Manoj Ghorpade, Maharashtra election's real giant killer" (in ఇంగ్లీష్). The Week. 23 November 2024. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
  2. "Maharastra Assembly Election Results 2024 - Karad North". Election Commission of India. 23 November 2024. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
  3. "Karad North Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.