మల్లికార్జున్ ఖర్గే
మల్లికార్జున్ ఖర్గే భారతేదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి. ఆయన ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు.
మల్లికార్జున్ ఖర్గే | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 అక్టోబర్ 2022 - ప్రస్తుతం | |||
ముందు | సోనియా గాంధీ | ||
---|---|---|---|
పదవీ కాలం 16 ఫిబ్రవరి 2021 , 17 డిసెంబర్ 2022 – 1 అక్టోబర్ 2022[1], పదవిలో ఉన్న | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | గులాం నబీ ఆజాద్ | ||
లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత
| |||
పదవీ కాలం 4 జూన్ 2014 – 16 జూన్ 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | సుశీల్‌కుమార్ షిండే | ||
తరువాత | అధీర్ రంజన్ చౌదరి | ||
పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్
| |||
పదవీ కాలం 2016 – 2019 | |||
నియమించిన వారు | సుమిత్ర మహాజన్
(లోక్‌సభ స్పీకర్) | ||
ముందు | కే.వి. థామస్ | ||
తరువాత | అధీర్ రంజన్ చౌదరి | ||
పదవీ కాలం 17 జూన్ 2013 – 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | సి. పి. జోషీ | ||
తరువాత | డి.వి.సదానంద గౌడ | ||
కార్మిక శాఖ
| |||
పదవీ కాలం 29 మే 2009 – 16 జూన్ 2013 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | ఆస్కార్ ఫెర్నాండేజ్ | ||
తరువాత | సిస్ రామ్ ఓలా | ||
కర్ణాటక అసెంబ్లీ విపక్ష నేత
| |||
పదవీ కాలం 19 డిసెంబర్ 1996 – 7 జులై 1999 | |||
ముందు | బి.ఎస్.యడ్యూరప్ప | ||
తరువాత | జగదీష్ షెట్టర్ | ||
పదవీ కాలం 5 జూన్ 2008 – 28 మే 2009 | |||
ముందు | ఎన్. ధరమ్ సింగ్ | ||
తరువాత | సిద్దరామయ్య | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 12 జూన్ 2020 | |||
ముందు | రాజీవ్ గౌడ | ||
నియోజకవర్గం | కర్ణాటక | ||
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి & ఇంచార్జి మహారాష్ట్ర
| |||
పదవీ కాలం 22 జూన్ 2018 – 11 సెప్టెంబర్ 2020 | |||
ముందు | పదవి సృష్టించారు | ||
తరువాత | హెచ్.కే.పాటిల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వార్వట్టి, బీదరు జిల్లా, పూర్వపు హైదరాబాదు జిల్లా, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కర్ణాటక, భారతదేశం) | 1942 జూలై 21||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | రాధాబాయి ఖర్గే (m. 1968) | ||
సంతానం | 5 | ||
పూర్వ విద్యార్థి | ప్రభుత్వ కాలేజీ, గుల్బర్గా గుల్బర్గా యూనివర్సిటీ |
రాజకీయ జీవితం
మార్చుమల్లికార్జున ఖర్గే భారతదేశానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు. 19. 10. 2022 న జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల్లో 24 సంవత్సరాల తరువాత గాంధీయేతర వ్యక్తి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం గమనార్హం . ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి గుల్బర్గా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, కర్ణాటక ప్రదేశ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి 10 సార్లు పోటీ చేయగా, వరుసగా తొమ్మిది సార్లు గెలిచి ఖర్గే రికార్డు సృష్టించాడు. ఆయన కర్ణాటక రాష్ట్ర మంత్రిగా, శాసనసభ పక్ష నేతగా, విపక్ష నేతగా వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుల్బర్గా నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి చేసి గెలిచి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కార్మిక శాఖ, రైల్వే మంత్రిగా పనిచేశాడు. ఆయన 2014లో తిరిగి ఎంపీగా ఎన్నికై లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా[2], రెండుసార్లు పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పనిచేశాడు.[3][4]
మల్లికార్జున్ ఖర్గే 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయాడు.[5] ఆయన 2020 జూన్ 12న కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నికై 2021 ఫిబ్రవరి 16న రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా నియమితుడై, [6][7] కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండటంతో రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడి పదవికి 2022 అక్టోబరు 1న రాజీనామా చేశాడు.[8] కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబరు 17న ఎన్నిక జరగగా, అక్టోబరు 19న జరిగిన కౌంటింగ్ లో 9384 మంది ప్రతినిధులు (ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు) ఓటు హక్కును వినియోగించుకోగా ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశిథరూర్‌కు 1072 ఓట్లు రాగా, 416 ఓట్లు అనర్హతకు గురయ్యాయి. దీనితో మల్లికార్జున ఖర్గే 6825పై ఓట్ల మెజారిటీతో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[9]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (1 October 2022). "రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఖర్గే రాజీనామా". Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.
- ↑ Sakshi (3 June 2014). "లోక్‌సభ కాంగ్రెస్ నేతగా ఖర్గే". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
- ↑ Sakshi (3 May 2017). "పీఏసీ చైర్మన్‌గా ఖర్గే". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
- ↑ Sakshi (2 May 2018). "పీఏసీ చైర్మన్‌గా మరోసారి ఖర్గే". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
- ↑ TV9 Telugu (4 April 2019). "గుల్బర్గా ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన మల్లికార్జున్ ఖర్గే". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (8 March 2021). "రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు." Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (19 July 2021). "కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేతగా అధిర్ రంజన్". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
- ↑ "రాజ్యసభ ప్రతిపక్షనేతగా మల్లికార్జున్ ఖర్గే రాజీనామా" (in ఇంగ్లీష్). 1 October 2021. Archived from the original on 19 October 2022. Retrieved 19 October 2022.
- ↑ "కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే". 19 October 2022. Archived from the original on 19 October 2022. Retrieved 19 October 2022.