మల్లికా సారాభాయ్

గుజరాత్, గుజరాత్ అహ్మదాబాద్ నుండి కార్యకర్త మరియు భారతీయ శాస్త్రీయ నర్తకుడు

మల్లికా సారాభాయ్ (జననం 1954 మే 9) సుప్రసిద్ధ భారతీయ నాట్యకత్తె. ఈమె ప్రముఖ అణు శాస్త్రవేత్త విక్రం సారాభాయ్, ప్రముఖ నృత్యకళాకారిణి మృణాళినీ సారాభాయ్‌ల కుమార్తె. ఈమె కూచిపూడి, భరతనాట్యం నృత్య కళలలో ప్రావీణ్యత సంపాదించింది.[1]

మల్లికా సారాభాయ్
2011లో మల్లికా సారాభాయ్
జననం (1954-05-09) మే 9, 1954 (age 70)
వృత్తికూచిపూడి, భరతనాట్యం
క్రియాశీల సంవత్సరాలు1969 - ప్రస్తుతం
ఎత్తు5 అ. 6 అం. (168 cమీ.)
పిల్లలురేవంత, అనహిత
వెబ్‌సైటుMallika Sarabhai

జీవిత విశేషాలు

మార్చు

మల్లిక 1954 మే 9 వ తేదీన గుజరాత్ లోని అహ్మదాబాదులో విక్రం సారాభాయ్, మృణాళిని దంపతులకు జన్మించింది. 1974 లో ఐఐఎం అహ్మదాబాదు నుంచి ఎంబియే పట్టా పొందింది. 1976 లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనే అంశం మీద డాక్టరేటు పట్టా పొందింది.[2]

కెరీర్

మార్చు

ఈమె చిన్నప్పటి నుంచి నాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. 15 సంవత్సరాల వయసు నుంచి కళాత్మక సినిమా రంగంలో పనిచేస్తూ వచ్చింది. నృత్య దర్శకురాలిగా, నర్తకిగా ఈమె మంచి పేరు సంపాదించింది. హిందీ, మలయాళం, గుజరాతీ భాషలో గాక కొన్ని అంతర్జాతీయ చిత్రాల్లో కూడా నటించింది.[3] ఈమె ఒక సామాజిక కార్యకర్త కూడా.[4]

పురస్కారాలు

మార్చు
  • 2010లో ఈమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.[5]

గ్యాలరీ

మార్చు

మూలాలు

మార్చు
  1. International encyclopedia of dance: a project of Dance Perspectives Foundation, Inc
  2. "Mallika Sarabhai Biography - Mallika Sarabhai Profile, Childhood, Life & Timeline". dances.indobase.com. Retrieved 2023-05-09.
  3. "The Hindu : National : Mallika Sarabhai to contest against Advani". web.archive.org. 2009-03-23. Archived from the original on 2009-03-23. Retrieved 2023-05-09.
  4. "Inspiring woman - Mallika Sarabhai". Women's Web: For Women Who Do (in ఇంగ్లీష్). Archived from the original on 2023-05-09. Retrieved 2023-05-09.
  5. పద్మభూషణ్ పురస్కారం#2010