మావిచిగురు
మావిచిగురు 1996లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలయిన కుటుంబ కథాచిత్రం.[1] పి. ఉషారాణి ఈ సినిమా నిర్మాత. జగపతి బాబు, ఆమని, రంజిత ఈ సినిమాలో ప్రధాన నటీనటులు. స్రవంతి ఆర్ట్ ఫిలింస్, చంద్రకిరణ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాలో నటనకు గాను జగపతిబాబుకు మొదటి సారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారం లభించింది.[2]
మావిచిగురు | |
---|---|
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
రచన | దివాకర్ బాబు |
స్క్రీన్ ప్లే | ఎస్. వి. కృష్ణారెడ్డి |
నిర్మాత | పి. ఉషారాణి |
తారాగణం | జగపతి బాబు , ఆమని, రంజిత |
ఛాయాగ్రహణం | శరత్ |
సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థలు | చంద్రకిరణ్ ఫిల్మ్స్, స్రవంతి ఆర్ట్ ఫిలింస్ |
విడుదల తేదీ | మే 30, 1996 |
సినిమా నిడివి | 141 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుసీత, మధుల పెళ్ళితో కథ ప్రారంభం అవుతుంది. సీతకు తన భర్తంటే ప్రాణం. అతన్ని వేరెవరైనా ఆడపిల్ల కన్నెత్తి చూసినా సహించలేదు. మధు పనిచేసే ఆఫీసులోనే సుధ అనే అమ్మాయి సీత చూస్తుండగానే భర్తను కౌగలించుకుంటుంది. దాంతో సీత భర్తను అనుమానించడం మొదలుపెడుతుంది. ఇదే సమయంలో ఆమెకు ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉందని తెలుస్తుంది. తన చనిపోతే భర్త ఒంటరి కాకూడదని తన పరిస్థితి భర్తకు చెప్పకుండానే అతనికి సుధకు పెళ్ళి చేయాలని ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఆమె భర్తను సాధిస్తూ అతన్నుంచి వేరు పడాలని చూస్తుంది. కానీ మధు ఒప్పుకోడు. చివరికి అతనితో విడాకులు తీసుకునే దాకా వెళుతుంది. కానీ చివరకు సీతకున్న జబ్బు గురించి తెలుసుకుని తనమీద భార్యకున్న ప్రేమ కోసం సుధను పెళ్ళి చేసుకుంటాడు. తర్వాత పుట్టిన కూతురికి సీత అని పేరు పెట్టుకుంటారు.
తారాగణం
మార్చు- మధుగా జగపతి బాబు
- సీతగా ఆమని
- సుధగా రంజిత
- సీత బామ్మగా నిర్మలమ్మ
- సీత తాతయ్యగా అల్లు రామలింగయ్య
- లాయర్ సత్యానందంగా తనికెళ్ళ భరణి
- ప్రధాన గుమాస్తాగా బ్రహ్మానందం
- ప్యూనుగా ఆలీ
- రాధగా శ్రీలక్ష్మి
- గోపిగా బాబు మోహన్
- సత్యానందం అసిస్టెంటు లాయరుగా శివాజీ రాజా
- దయ్యం అలియాస్ బుజ్జులుగా ఐరన్ లెగ్ శాస్త్రి
- దయ్యం అలియాస్ రక్తకోలాగా థమ్
- జెన్నీ
- వైద్యుడిగా పి. జె. శర్మ
- గుండు హనుమంతరావు
- న్యాయమూర్తిగా సుబ్బరాయ శర్మ
- సత్యానందం భార్యగా శివపార్వతి
పాటలు
మార్చుఈ సినిమాకు దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతాన్నందించగా వేటూరి సుందర్రామ్మూర్తి పాటలు రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.
- కోదండ రాముడంట కొమ్మలాల , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , జగపతి బాబు, వందేమాతరం శ్రీనివాస్, ప్రస్సన్న, అల్లురామలింగయ్య, ఎం ఎం శ్రీలేఖ, రేణుక
- మానస సంచరారే, రచన: సదాశివ బ్రహ్మేంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- కొండమల్లి కొండమల్లి , రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- కొమ్మన కులికే కోయిలా , రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- మావిచిగురు తిని నీకు శుభమని , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- రంజుభలే రాంచిలకా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, అనుపమ
- మాట ఇవ్వమ్మా చెల్లీ , రచన, సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. కె ఎస్ చిత్ర
మూలాలు
మార్చు- ↑ "Maavichiguru (1996) | Maavichiguru Movie | Maavichiguru Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-03-27.
- ↑ Southscope July 2010 - Side A (in ఇంగ్లీష్). Southscope.