మికా సింగ్ ఒక ప్రముఖ సంగీత కారుడు. ఇతడు పలు భాంగ్రా, పాప్, సినీ గీతాలు పాడాడు. తెలుగులో మిర్చి సినిమాలో తన గళాన్ని వినిపించాడు. సుప్రసిద్ద పంజాబీ గాయకుడు దలేర్ మెహంది ఇతని పెద్దన్న. వీరిద్దరూ కలిసి కొన్ని గీతాలలో కూడా కనిపించారు.

మికా సింగ్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఅమ్రిక్ సింగ్
జననం (1977-06-10) 10 జూన్ 1977 (age 47)[1][2]
దుర్గాపూర్
మూలందుర్గాపూర్
సంగీత శైలిPop, Bhangra, Rap
వృత్తిగాయకుడు, సంగీతకారుడు
క్రియాశీల కాలం1998-ఇప్పటివరకు
వెబ్‌సైటుwww.mikasingh.in

నేపధ్యము

మార్చు

అమ్రిక్ సింగ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్ పట్టణంలో జన్మించాడు. తల్లిదండ్రులు అజ్మీర్ సింగ్ చందన్, బల్బీర్ కౌర్. ఇతను పెరిగినది మాత్రము బీహార్ లోని పాట్నా నగరం. ఇతని పెద్దన్న దలేర్ మెహంది తోబాటు అక్కడే విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. ఆరుగురు అన్నదమ్ములలో ఇతను చివరివాడు. తల్లిదండ్రులిద్దరూ సంగీతాభిమానులు కావడం వల్ల మికా కూడా ఆ రంగం పట్ల ఆకర్షితుడయ్యాడు.

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Mika Singh, happy birthday: The singer turns 36 - Bollywoodlife.com". www.bollywoodlife.com. 10 June 2013.
  2. "Mika Singh Archives".
"https://te.wiki.x.io/w/index.php?title=మికా_సింగ్&oldid=3851045" నుండి వెలికితీశారు