మిడిల్ క్లాస్ మెలోడీస్
మిడిల్ క్లాస్ మెలోడీస్, 2020 నవంబరు 20న అమెజాన్ ప్రైం ఓటీటీలో విడుదల అయిన తెలుగు సినిమా. ఈ సినిమాకు వినోద్ ఆనంతోజు దర్శకత్వం వహించాడు. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలలో నటించారు.[1] ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు అనూహ్యమైన స్పందన లభించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి థియేటర్లలో రిలీజ్ కావాల్సిన చిత్రం లాక్‌డౌన్ కారణంగా నవంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మిడిల్ క్లాస్ మెలోడీస్ | |
---|---|
దర్శకత్వం | వినోద్ ఆనంతోజు |
కథ | జనార్ధన్ పసుమర్తి |
నిర్మాత | ఆనంద్ ప్రసాద్ |
తారాగణం | ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ |
ఛాయాగ్రహణం | సన్నీ కూరపాటి |
కూర్పు | రవితేజ గిరిజల |
విడుదల తేదీ | 20 నవంబరు 2020 |
సినిమా నిడివి | 135 నిమిషాలు |
దేశం | భరత దేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- ఆనంద్ దేవరకొండ రాఘవ గా
- వర్ష బొల్లమ్మ సంధ్య గా[2]
- గోపాల్‌గా చైతన్య గరికిపాటి
- గౌతమిగా దివ్య శ్రీపాద
- కొండల్రావుగా గోపరాజు రమణ [3]
- లక్ష్మిగా సురభి ప్రభావతి
- ప్రేమే సాగర్ నాగేశ్వరరావు
- కమలాగా ప్రభావతి వర్మ
- సీనుగా దేశి
- అంజైహ్గా కట్టా ఆంథోనీ
పాటల జాబితా
మార్చు- ది గుంటూరు , రచన: కిట్టు వీస్సాప్రగడ , గానం.అనురాగ్ కులకర్ణి
- సంధ్య , రచన: సనపతి భరద్వాజ్ పాత్రుడు , గానం.స్వీకార్ అగస్తి
- కీలుగుర్రం, రచన: సనపాటి భరద్వాజ్ పాత్రుడు, గానం . అనురాగ్ కులకర్ణి, స్వీకార్ అగస్తి , రమ్య బెహరా
- సాంబ శివ , పలనాడు జానపదం , గానం.రామ్ మిరియాల
- మంచిదో చెడ్డదో, రచన: సనపాటీ భరద్వాజ్ పాత్రుడు.గానం.విజయ్ యేసు దాస్
- వెచ్చని మట్టిలో, రచన: సాయి కిరణ్, గానం. స్వీకర్ అగస్త్తి.
కథ
మార్చుమిడిల్ క్లాస్ కుటుంబాల కథ. గుంటూరు దగ్గరలోని ఓ పల్లెటూరులో కాకా హోటల్ నడుపుకునే కొండలరావు (గోపరాజు రమణ) కొడుకు రాఘవ (ఆనంద్ దేవరకొండ) బొంబాయి చట్నీ బాగా చేస్తాడు.అయితే, గుంటూరులో హోటల్ పెట్టి అక్కడి ప్రజలకు తన బొంబాయి చట్నీ రుచి చూపించి ఫేమస్ అయిపోయావాలని రాఘవ కలలు కంటూ ఉంటాడు.కానీ, గుంటూరులో హోటల్ పెట్టడం రాఘవ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు.
మరోవైపు వరసకు మావయ్య అయ్యే నాగేశ్వరరావు కూతురు సంధ్య (వర్ష బొల్లమ్మ)ను రాఘవ ప్రేమిస్తాడు. నాగేశ్వరరావు (ప్రేమ్ సాగర్) కూతురు సంధ్య (వర్ష బొల్లమ్మ)ను రాఘవ ప్రేమిస్తాడు.కానీ నాగేశ్వరావు మాత్రం కూతురు సంధ్యను వేరే వాళ్లకి ఇచ్చి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుంటాడు. గుంటూరు నేపథ్యంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆ యాసను, అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబించారు. ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర అద్భుతం.
మూలాలు
మార్చు- ↑ "Young Hero Anand Devarakonda's next Titled as Middle Class Melodies". The Hans India. July 11, 2020.
- ↑ "Anand Deverakonda shares Varsha Bollamma's first-look as Sandhya from Middle Class Melodies - Times of India". The Times of India.
- ↑ "మండే మంచుకొండ నాన్న". Sakshi. 2020-11-28. Retrieved 2022-04-28.
బాహ్య లింకులు
మార్చు- Middle Class Melodies (iMDB)
- vijay deverakonda reviews middle class melodies
- Class Melodies Movie Review
[[వర్గం:2020 తెలుగు సినిమాలు]