ముదిగొండ నాగలింగశాస్త్రి
ముదిగొండ నాగలింగశాస్త్రి (1876-1970[a]) [1] ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, పత్రికా సంపాదకులు.
ముదిగొండ నాగలింగశాస్త్రి | |
---|---|
జననం | 1876 |
మరణం | 1970 [1] |
వృత్తి | పండితులు, రచయిత, సంపాదకులు |
బిరుదు | మహోపాధ్యాయ |
తల్లిదండ్రులు |
|
![](http://up.wiki.x.io/wikipedia/te/thumb/2/20/%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B0%BF%E0%B0%97%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1_%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF.jpg/220px-%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B0%BF%E0%B0%97%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1_%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF.jpg)
జీవిత సంగ్రహం
మార్చువీరు 1876లో గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: అహోరపతి, జ్వాలాంబిక. వీరు ఉద్భటారాధ్య వంశజులు, శక్తివిశిష్టశివాద్వైతి, భరద్వాజస గోత్రులు, ఆపస్తంబ సూత్రులు. వీరు ముదిగొండ నందికేశ్వర ఆరాధ్యుల వారిదగ్గర విద్యనభ్యసించారు. తరువాత పశ్చిమ గోదావరి జిల్లా కొత్తపల్లి అగ్రహారంలోని ఇవటూరి లింగయ్య శాస్త్రి వద్ద శాస్త్రాధ్యయనం చేశారు. తర్వాత కాళహస్తిలోని శ్రీనివాస శాస్త్రి వద్ద వ్యాకరణ శాస్త్రాన్ని, శ్రీనివాస దీక్షితుల వద్ద మీమాంస వేదాంతాది శాస్త్రాలను, నీలకంఠ శంకరరామానుజ మధ్వభాష్యాలను అధ్యయనం చేశారు. వీరు చదువుతున్నపుడే " రక్షారుద్రాక్ష చండమార్తాండ " అనే ఖండన గ్రంథాన్ని రచించారు. ఆనాడు రామనాథపురం రాజావారిచే నిర్వహించబడిన వైయాకరణ పరీక్షలో ఉత్తీర్ణులై పారితోషికం పొందారు. శార్వరి సంవత్సరంలో మద్రాసులో జరిగిన సభలో పండితులతో చర్చాగోష్టిలో శివుడే జగత్కారణ మనుట వేదసమ్మతమని సిద్ధాంతీకరించి ఆత్మకూరు సంస్థానాధీశుల నుండి సన్మానం పొందారు.
వీరు తెనాలి చేరి అక్కడి తెలుగు సంస్కృత కళాశాలలో పదకొండు సంవత్సరాలు సాహిత్య వ్యాకరణాధ్యాపకులుగా పనిచేశారు. తరువాత ఆ ఉద్యోగాన్ని విరమించి ' శైవరహస్య బోధిని ' అనే మాసపత్రిక నడిపి తన జీవితాంతం మతసేవలోనే కాలం గడిపారు. వీరు తన పత్రికలలో కారణోత్తరం, చంద్ర, జ్ఞానోత్తరం, ముకుటోత్తరం అనేవాటిని ఆంధ్ర తాత్పర్యంతో ప్రకటించారు.
రచనలు
మార్చు- చతుర్వేద తాత్పర్య సంగ్రహం
- బ్రహ్మతర్కస్తవం
- బ్రహ్మపథం
- వేదాంతార్థ పరిష్కార తారహారం
- నలప్రహసనం
- నలవివాహం
- నవరసకాదంబరి
- శివచింతామణి ప్రభ
- భారత మంత్రులు [2]
- ఆర్యధర్మ ప్రత్యక్ష ఫలబోధన[3]
బిరుదులు
మార్చు- 1929: విజయనగరంలో తాతా సుబ్బరాయశాస్త్రి గారి ఆధ్యక్షతన జరిగిన సారస్వత పరిషత్తు వారి వార్షిక సభలో ' మహోపాధ్యాయ ' బిదుదును పొందారు.
- 1937: విమలానంద భారతీస్వామి అధ్యక్షన జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షిక సభలో ' విద్యావాచస్పతి ' బిరుదును పొందారు.
గమనికలు, మూలాలు
మార్చుగమనికలు
మార్చు- ↑ మరణ తేదీని 20వ శతాబ్ది తెలుగు వెలుగులు పుస్తకం 1970గా, V.I.A.F. డేటాబేస్ 1948గా పేర్కొన్నాయి. కనుక మరణతేదీ సందేహాస్పదం.
మూలాలజాబితా
మార్చు- ↑ 1.0 1.1 "నాగలింగశాస్త్రి, ముదిగొండ (1876-1970),". 20వ శతాబ్ది తెలుగు వెలుగులు. Vol. 1. , హైదరాబాదు,: తెలుగు విశ్వవిద్యాలయం. 2005. p. 292.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link) - ↑ నాగలింగశాస్త్రి, ముదిగొండ (1937). భారత మంత్రులు. మద్రాసు: ముదిగొండ నాగలింగశాస్త్రి.
- ↑ నాగలింగశాస్త్రి, ముదిగొండ (1923). ఆర్యధర్మ ప్రత్యక్ష ఫలబోధన. ముదిగొండ నాగలింగశాస్త్రి. Retrieved 2020-07-13.