మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా
మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2]
మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
ముఖ్య పట్టణం | మేడ్చల్ |
మండలాలు | 15 |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1 (మల్కాజ్‌గిరి) |
• శాసనసభ నియోజకవర్గాలు | 9 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,084 కి.మీ2 (419 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 24,40,073 |
• జనసాంద్రత | 2,300/కి.మీ2 (5,800/చ. మై.) |
• Urban | 22,30,245 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 82.49 |
• లింగ నిష్పత్తి | 957 |
Vehicle registration | TS–08 [1] |
ప్రధాన రహదార్లు | 3 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులు |
Website | అధికారిక జాలస్థలి |
2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఏర్పడిన ఈ కొత్త జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (మల్కాజ్‌గిరి, కీసర), 14 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 6తో కలుపుకొని 162 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.[2] ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే. జిల్లా పరిపాలనా కేంద్రం షామీర్‌పేట్.[3] షామీర్‌పేట్ మండలం, అంతయపల్లి గ్రామంలో నిర్మించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను 2022 ఆగస్టు 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు.
స్థానిక స్వపరిపాలన
మార్చుజిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[4]
విద్యాసంస్థలు
మార్చుకూకట్పల్లిలోని జేఎన్‌టీయూ యూనివర్సిటీ, బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, దుండిగల్‌లోని ఏరోనాటికల్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్, మైసమ్మగూడలో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ, సూరారంలో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, శామీర్‌పేటలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఉన్నాయి.
జిల్లాలో శాసనసభ నియోజకవర్గాలు
మార్చుజిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
జిల్లాలో పార్లమెంటు నియోజక వర్గాలు
మార్చు- మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం:దీని పరిధిలో ఈ జిల్లాలోని కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి,ఉప్పల్, మల్కాజ్‌గిరి, మేడ్చల్ శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.
జిల్లాలోని మండలాలు
మార్చు- మేడ్చల్ మండలం
- శామీర్‌పేట్ మండలం
- కీసర మండలం
- కాప్రా మండలం *
- ఘట్‌కేసర్ మండలం
- మేడిపల్లి మండలం *
- ఉప్పల్ మండలం
- మల్కాజ్‌గిరి మండలం
- అల్వాల్ మండలం *
- కుత్బుల్లాపూర్ మండలం
- దుండిగల్ గండిమైసమ్మ మండలం *
- బాచుపల్లి మండలం *
- బాలానగర్ మండలం
- కూకట్‌పల్లి మండలం *
- మూడుచింతలపల్లి మండలం *
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (7)
జిల్లాలోని పురపాలక సంఘాలు (2018 నాటికి)
మార్చుజిల్లాలో మొత్తం 13 పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఉన్నాయి.వాటిలో 10 పురపాలక సంఘాలు కాగా, 3 నగరపాలక సంస్థలు ఉన్నాయి.
- జవహార్‌నగర్: 21 వార్డులు
- దమ్మాయిగూడ: 11 వార్డులు (దమ్మాయిగూ డ, అహ్మద్‌గూడ, కుందనపల్లి, గోధుమకుంట)
- నాగారం: 11 వార్డులు (నాగారం, రాంపల్లి)
- పోచారం: 11 వార్డులు (పోచారం, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, నారపల్లి, యన్నంపేట్)
- ఘట్కేసర్: 11 వార్డులు (ఘట్కేసర్, కొండాపూర్, ఎన్‌ఎఫ్‌సీనగర్)
- గండ్లపోచంపల్లి: 07 వార్డులు (గండ్లపోచంపల్లి, కండ్లకోయ, బాసిరేగడి, గౌరవెళ్లి, అర్కలగూడ)
- తూంకుంట: 11 వార్డులు (దేవరయాంజల్, ఉప్పరపల్లి)
- నిజాంపేట్: 25 వార్డులు (నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్)
- కొంపల్లి: 11 వార్డులు (కొంపల్లి, దూలపల్లి)
- దుండిగల్: 15 వార్డులు (దుండిగల్, మల్లంపేట్, డీపీపల్లి, గాగిల్లాపూర్, బౌరంపేట్, బహుదూర్‌పల్లి)
- బోడుప్పల్: 21 వార్డులు (బోడుప్పల్, చెంగిచర్ల),
- పీర్జాదిగూడ: 21వార్డులు (ఫిర్జాదిగూడ, పర్వాతాపూర్, మేడిపల్లి)
- మేడ్చల్: 15 వార్డులు ( మేడ్చల్, అత్వెల్లి) [5]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
- ↑ 2.0 2.1 "Medchal−Malkajgiri district" (PDF). New Districts Formation Portal. Government of Telangana. Archived from the original (PDF) on 30 November 2016. Retrieved 22 April 2019.
- ↑ "మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ప్రొఫైల్ (అధికార వెబ్సైట్)". Archived from the original on 2017-03-23. Retrieved 2019-04-25.
- ↑ Andhrajyothy (13 April 2024). "త్వరలో స్థానిక సమరం". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
- ↑ Sakshi (17 December 2018). "ఇక మున్సిపల్ వార్". Retrieved 23 March 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)